Skip to main content

6 గ్యారంటీలు అమలు కొరకు 5 లక్షల 27వేల 492 దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు - జిల్లా కలెక్టర్ హరుచందన దాసరి




6 గ్యారంటీలు అమలు కొరకు 5 లక్షల 27వేల 492 దరఖాస్తులను  ఆన్లైన్ లో నమోదు - జిల్లా  కలెక్టర్ హరుచందన దాసరి

నల్గొండ :  6 గ్యారంటీలలో భాగమైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందరమ్మ ఇల్లు మరియు చేయుత పథకాల అమలు కొరకు 5 లక్షల 27వేల 492 దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్ లో నమోదు చేశామని నల్గొండ జిల్లా  కలెక్టర్ హరుచందన దాసరి తెలిపారు. గణతంత్ర దిన్నాన్ని పురస్కరించుకొని నల్గొండ పోలీస్  హెడ్ క్వార్టర్స్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నల్గొండ జిల్లా  కలెక్టర్ హరుచందన దాసరి జాతీయ  జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ 75వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలనీ, జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థినీ విద్యార్థుల కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మనందరికి పండుగ రోజని, ప్రపంచంలోనే గొప్ప సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రదేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం1950, జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నామని, భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాననీ తెలిపారు. 
     ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాని అన్నారు. నూతన ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే రెండు మానవీయ పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం మని,  తెలంగాణ ఆడబిడ్డలను మహా లక్ష్ములను చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలోభాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నామని,  ఆర్ధిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్ళే వారికి, విద్యార్ధులకు, మధ్యతరగతి మహిళలకు, ట్రాన్స్ జండర్లకు ఈ పథకం ఉపయోగపడుతుందని,పై పెచ్చు ప్రయాణ ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయిందనీ,  డిసెంబర్9వ తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 39 లక్షల 77 వేల 469 మంది మహిళలుఉచితంగా ప్రయాణించారని ఆమె తెలిపారు.  పేదలకు మెరుగైన వైద్య సేవలు, సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని, ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 5లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచటం జరిగిందినీ తెలిపారు  పేదలందరికీఉచితంగా కార్పోరేట్ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చే ఈ పథకానికి డిసెంబర్, 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రాంబించందని,  ఇందుకుగాను 63 కోట్ల 34 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందనీ తెలిపారు. ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాలకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారనీ అన్నారు.  ఈకార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలలో భాగమైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందరమ్మ ఇల్లు మరియు చేయుత పథకాల అమలు కొరకు 5 లక్షల 27వేల 492 దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందనీ తెలిపారు. జిల్లాలో రైతులకు పంట పెట్టుబడి సహాయం క్రింద 2023-24 యాసంగి సీజన్లో 3 లక్షల 12 వేల 688 మంది రైతులకు 172 కోట్ల 41 లక్షల రూపాయలు పంటపెట్టుబడిగా పంపిణీ చేయనైనదనీ తెలిపారు. జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ ఎకరాలకు, AMR SLBC ప్రాజెక్ట్ హెచ్.ఎల్.సి. మరియు ఎల్.ఎల్.సి. కాలువల ద్వారా 3 లక్షల ఎకరాలకు
సాగునీరు అందిస్తున్నామనీ తెలిపారు. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నవనీ,  ఫ్లోరైడ్ బారి నుండి ప్రజలను రక్షించడం కొరకు చేపట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు 3 లక్షల 61 వేల ఎకరాలకు సాగునీరు కల్పించబడుతుందనీ, తెలిపారు.  జిల్లా కేంద్రంలో 275 కోట్ల రూపాయలతో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు భవన నిర్మాణం మంజూరు అయిందనీ మరియు పనులు పురోగతిలో ఉన్నవనీ,  మంజూరై పనులు మొదలు కానున్నవి. కోట్ల 75 లక్షల రూపాయలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నల్లగొండ నందు 50 పడకల క్రిటికల్ కేర్ నక్రేకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏరియా ఆసుపత్రిగా ఉన్నతీకరణకు 32 కోట్ల రూపాయలు మంజూరై పనులు జరుగుచున్నవనీ తెలిపారు. 100 పడకల ఏరియా ఆసుపత్రి మిర్యాలగూడను 200 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరణకై 14 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు కాబడి పనులు జరుగుచున్ననీ తెలిపారు. 30 పడకల సి.హెచ్.సి. హాలియ ఏర్పాటుకై 5 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో ఉన్నవనీ తెలిపారు . జిల్లాలో 2 లక్షల 29 వేల 838 మంది వ్యవసాయ వినియోగదారులు ఉచిత విద్యుత్ ద్వారా లబ్దిపొందుతున్నానీ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8 వేల 235, 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు 6 వేల 439 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందినీ, 30 కోట్ల 18 లక్షల రూపాయలతో 15 విద్యుత్ఉప కేంద్రముల నిర్మాణ పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవనీ తెలిపారు.  దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 34 వేల 500 కోట్ల రూపాయలతో 4 వేల మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో యాదాద్రి  థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణ పనులు 2024 డిసెంబర్ నాటికి మొత్తము ఐదు యూనిట్లు పూర్తి చేయడానికి పనులు శరవేగంగా జరుగుచున్నవనీ తెలిపారు. మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం జిల్లాలో అనాధ బాలికలకు కొత్త బాలసదన్ భవన నిర్మాణమునకు ఒక కోటి 34 లక్షల రూపాయలు కేటాయించబడినదనీ తెలిపారు. వయో వృద్ధుల వసతి గృహము కొరకు కొత్త భవన నిర్మాణమునకు 50 లక్షల రూపాయలుకేటాయించబడినదనీ తెలిపారు. MGNREGS పథకం క్రింద 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 130 కోట్ల 64 లక్షల రూపాయలు ఖర్చు చేసి 2 లక్షల 63 వేల మంది కూలీలకు 59 లక్షల 88 వేల పని దినాల ఉపాధికల్పించడం జరిగినదనీ మరియు 22 కోట్ల రూపాయలతో గ్రామ పంచాయితీలలో సి.సి. రోడ్లు మరియు మురికి కాలువలు మంజూరు చేయడం జరిగిందనీ, ఆసరా పించన్ల పథకంలో వృద్దాప్య, వితంతు, కల్లుగీత, బీడీ, ఒంటరి మహిళలు మరియు చేనేత కార్మికులకు జిల్లాలో 2 లక్షల 10 వేల 611 మంది లబ్దిదారులకు 53 కోట్ల 73 లక్షల 43 వేల రూపాయలు పించన్లు ప్రతినెల పంపిణీ చేయడం జరుగుతుందనీ, . జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయబడే National Academy of
Construction (NAC) ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా 2 వేల మంది నిరుద్యోగ యువతీ యువతకు ఉపాధి కల్పించుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందనీ తెలిపారు.మహిళా స్వయం సహాయక సంఘాలు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత కోసం నైపుణ్యాభివృద్ధికార్యక్రమాలు అందించడం జరుగుతుందనీ తెలిపారు. ప్లాన్ నిధుల ద్వారా నల్లగొండ నుండి ముషంపల్లి-కన్నెకల్ (వయా) ధర్మాపురం వరకు 99 కోట్ల 80 లక్షల రూపాయలతో సింగల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చుటకు నిధులు మంజూరు చేయబడిననీ తెలిపారు. జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, BT రెనువల్స్, రోడ్ల విస్తరణ మొదలైన పనులకు గాను 292 కోట్ల 71 లక్షల నిడమనూరులో కోర్టు భవనాలు, జడ్జి రెసిడెన్షియల్ క్వార్టర్స్, నల్లగొండలో ఆర్ & బి గెస్ట్ హౌజ్, ఆర్ & బి ఆఫీస్ పనులు చేపట్టబడుచున్నవనీ మరియు 32 కోట్ల 65 లక్షల రూపాయలతో దేవరకొండ మరియు
మరియు మిర్యాలగూడలో ఇండోర్ స్టేడియం నిర్మాణం మొదలైన పనులు జరుగుచున్నవనీ తెలిపారు. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా గ్రామీణ రహదారుల నిర్మాణము, బ్రిడ్జి పనులు, భవనాల నిర్మాణము, రోడ్ల మరమ్మత్తులు ఇతర పనులకు గాను జిల్లాకు 783 కోట్ల 89 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 8 వేల 352 పనులు మంజూరు అయినాయనీ, ఇప్పటి వరకు 7 వేల 247 పనులు పూర్తి అయినవనీ తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో రహదారులు, జంక్షన్లు, ఆర్చ్లు, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధికి, సమీకృత శాఖాహార మరియు మాంసాహార మార్కెట్లు, రైతు బజార్, వైకుంఠధామాలు, వైకుంఠ రధాలు, భూగర్భ మురికి కాలువలకు, మంచినీటి సరఫరా కొరకు వివిధ పథకాల ద్వారా నల్లగొండ మున్సిపాలిటీలో 533 కోట్ల 6 లక్షలు, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 101 కోట్ల 77 లక్షలు, దేవరకొండ మున్సిపాలిటీలో 56 కోట్ల 20 లక్షలు, చిట్యాల మున్సిపాలిటీలో 19 కోట్లు, నందికొండ మున్సిపాలిటీ 28 కోట్ల 85 లక్షలు, నకిరేకల్ మున్సిపాలిటీలో 31 కోట్ల 75 లక్షలు, హాలియా మున్సిపాలిటీలో 33 కోట్ల 77 లక్షలు, చండూరు మున్సిపాలిటీలో 52 కోట్ల 41 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నవని తెలిపారు.  ఈ విద్యా సంవత్సరంలో 61 షెడ్యూల్డు కులముల వసతి గృహాలలో 3518 మంది, 42 గిరిజన వసతి గృహాలలో 8932 మంది, 46 వెనుకబడిన తరగతుల వసతి గృహాలలో 4899 మంది విద్యార్ధినీ విద్యార్ధులకు వసతి కల్పించనైనదనీ, ఈ విద్యా సంవత్సరంలో 7608 షెడ్యూల్డు కులముల విద్యార్థులకు 14 కోట్ల 65 లక్షలు, 2056 గిరిజన విద్యార్ధులకు 7 కోట్ల 35 లక్షలు, 21766 వెనుకబడిన తరగతుల విద్యార్థులకు 17 కోట్ల 50 లక్షలు, 2228 మంది మైనారిటీ విద్యార్థులకు 4 కోట్ల 5 లక్షల రూపాయలు ఉపకారవేతనములు చెల్లించడం జరిగిందనీ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 12 SC గురుకుల విద్యాలయాలలో 7 వేల మంది విద్యార్ధినీ విద్యార్ధులు, 13 ST గురుకుల విద్యాలయాలలో 7 వేల 920 మంది, 15 BC గురుకుల విద్యాలయాలలో9 వేల మంది, 6 Minority గురుకుల విద్యాలయాలలో 536 మంది విద్యానభ్యసిస్తున్నారనీ తెలిపారు  జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయుటకు నిర్మాణాత్మక రీతిలో సహకారం, సూచనలు అందజేయుచున్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి , గౌరవ రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి,   శాసన మండలి సభ్యులు,  శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు అందరికీ ఈ సంధర్భంగా కలెక్టర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశరు. జిల్లా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న ప్రధాన న్యాయమూర్తికి, శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నల్లగొండ కి, వివిధ శాఖల జిల్లా ఉద్యోగులకు, బ్యాంకర్లకు, స్వచ్చంద సేవా సంస్థలకు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసి జిల్లా ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియా ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేశారు.



Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్