Skip to main content

Posts

*ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపిన  రెవెన్యూ సంఘాలు*

*మా స‌మ‌స్య‌లు ఎవ‌రికి చెప్పుకోవాలి ముఖ్య‌మంత్రి గారూ..? *- అబాండాలు వేస్తూ ఆత్మాభిమానాన్ని దెబ్బ‌తీస్తున్నారు* *- ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపిన  రెవెన్యూ సంఘాలు* విధి నిర్వ‌హ‌ణ‌లో అసువులుబాసిన రెవెన్యూ ఉద్యోగుల సంతాప స‌భ ఆదివారం సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో జ‌రిగింది. చ‌నిపోయిన రెవెన్యూ ఉద్యోగుల‌కు అన్ని రెవెన్యూ సంఘాల నేత‌లు సంతాపం తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి, టీజీటీఏ అధ్య‌క్షులు ఎస్‌.రాములు, టి.వి.ఆర్‌.ఒ.డ‌బ్య్లూఏ రాష్ట్ర అధ్య‌క్షులు గ‌రికె ఉపేంద్ర‌రావు, టి.వి.ఆర్‌.ఒ.ఏ అధ్య‌క్షులు ఎన్‌.ల‌క్ష్మినారాయ‌ణ‌, టీడీఆర్‌వీఆర్వోఏ అధ్య‌క్షులు ర‌వినాయ‌క్‌, టీఎస్‌వీఆర్ఏ అధ్య‌క్షులు వంగూరు రాములు హాజ‌ర‌య్యారు.  *58 ల‌క్ష‌ల మందికి పాస్ పుస్త‌కాలు ఇవ్వ‌లేదా..?* ఈ సంద‌ర్భంగా డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం అధ్య‌క్షులు వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత రెవెన్యూ ఉద్యోగుల‌కు ప‌ని ఒత్తిడి పెరిగింద‌ని, దీంతో అనేక మంది ఉద్యోగులు ప‌ని ఒత్తిడి, మాన‌సిక ఒత్తిడి, ప్ర‌మాదాల కారణంగా మ‌ర‌ణించారని పేర్కొన్నారు. ఎంత ప‌ని

రాజ్యాంగ బద్దంగా సమ్మె చేస్తున్న కార్మికులపై సీఎం కేసీఆర్ చట్టవ్యతిరేకమైన చర్యల వల్లే ఆత్మహత్యలు- కరీంనగర్ ఎంపీ బండి సంజయ్*

  రాజ్యాంగ బద్దంగా సమ్మె చేస్తున్న కార్మికులపై సీఎం కేసీఆర్ చట్టవ్యతిరేకమైన చర్యల వల్లే ఆత్మహత్యలు- కరీంనగర్ ఎంపీ బండి సంజయ్* కామెంట్స్ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ది ప్రభుత్వం ప్రకటనతో జరిగిన హత్య.  కేసీఆర్ ఉద్యమ దృహాలను నెత్తినపెట్టుకుని ఉద్యకారుల ప్రాణాలను బలికొంటున్నాడు.  న్యాయపరమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్నవారిపై ఉద్యమ ద్రోహులు అవాక్కులు చేవాక్కులు మాట్లాడుతున్నారు. కొంత మంది ఉద్యోగులు ప్రభుత్వ పదవుల్లో చేరి ఉద్యమాన్ని తకట్టుపెట్టాలని చూస్తున్నారు..  రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరుడుగా శ్రీకాంతచారి నిలిస్తే.. ప్రత్యేక రాష్ట్రంలో శ్రీనివాస్ రెడ్డి నిలిచారు.  ఆవేశపూరిత ప్రసంగాలతో నాడు, ఆవేశపూరిత నిర్ణయాలతో నేడు తెలంగాణ ప్రజల చావులకు కేసీఆర్ కరణమయ్యాడు.  హరీష్ రావుకు నాడు కిరోసిన్ దొరికింది కానీ అగ్గిపుల్ల దొరకాలే.. కానీ శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతయ్యారు.  కుటుంబపార్టీ టిఆర్ ఎస్ చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు.  ప్రజల ప్రయోజనాలకన్న కాంట్రాక్టర్ల ప్రయోజనము సీఎం కేసీఆర్ కు ముఖ్యం అయ్యింది.  ఆర్టీసీ కార్మికులది సెల్ఫ్ డిస్మిస్ ఎలవుద్దో ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి.  సెల

సంకల్పం,స్వయం కృషి తో మహర్షి గా ఎదగవచ్చు  - వాల్మీకి జయంతి వేడుకలలో ఇంఛార్జి కలెక్టర్ 

సంకల్పం,స్వయం కృషి తో మహర్షి గా ఎదగవచ్చు   అందుకు వాల్మీకి జీవితమే నిదర్శనం  వాల్మీకి రామాయణ కావ్యం  సమాజానికి దిక్సూచి వాల్మీకీ నేటి యువతకు మార్గదర్శకుడు  వాల్మీకి జయంతి వేడుకలలో ఇంఛార్జి కలెక్టర్  ప్రతి మనిషీ తప్పులు చేయడం సహజమేనని, అయితే వాటిని తెలుసుకొని సరిదిద్దుకుని స్వయం కృషి ,సంకల్పం తో ముందుకు సాగితే  మహిర్షి కావచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తీ  వాల్మీకి అని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు .  వాల్మీకి జీవితం  ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు .   ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధ్వర్యంలో  ని మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఇంఛార్జి జిల్లా కలెక్టర్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ....  రామాయణాన్ని రచించిన వాల్మీకి ఆ కావ్యం ద్వారా  మానవీయ విలువలు, రాజనీతిని మార్గదర్శనం చేశారని   అన్నారు.  కుటుంబం బంధాలు, విలవలతో కూడిన జీవన విధానాన్ని రామాయణం ద్వారా సమాజానికి చాటారన్నారు. ఇండోనేషియా సహా ప్రపంచ దేశాలు రామాయణం గొప్పతనం

పాత MIG BHEL హైదరాబాద్  వద్ద ఒక గొలుసు స్నాచింగ్ **

  పాత MIG BHEL హైదరాబాద్  వద్ద ఒక గొలుసు స్నాచింగ్ ‌శ్రీమతి లక్ష్మి దేవి, వయస్సు: 76 సంవత్సరాలు.  ఉదయం 07-45 గంటల సమయంలో  ఇంటి ముందు పువ్వులు  తెంపుతుండగా 20 నుండి 22 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు తెలియని వ్యక్తులు గ్లామర్ బైక్ మీదకు వచ్చి ఆమెమెడమీద ఉన్న 4 తులా బంగారు గొలుసు పుస్తేలా తాడును  లాకెళ్లారు.  

***మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు.....***

మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు..... సమ్మె పరిణామాలతో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట డిపో పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రవి అనే ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. నిప్పంటించుకునే సమయంలో వెంటనే సమీపంలో ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, పోలీసులు ఆయన్ను అడ్డుకుని కాపాడారు.

**ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ మృతి**

ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ మృతి హైదరాబాద్‌: ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందారు.  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన శనివారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు.  90 శాతానికి పైగా శరీరం కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తీసుకొచ్చారు.  కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి చికిత్స అందించారు.  అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందారు.  ఆర్టీసీ డ్రైవర్‌ మృతి నేపథ్యంలో ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  శ్రీనివాస్‌రెడ్డి మృతికి ప్రభుత్వమే కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.  ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 

*జగ్గారెడ్డి.. సంగారెడ్డి ఎమ్మెల్యే*  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కామెంట్స్.....

*గాంధీ భవన్ లో*  *జగ్గారెడ్డి.. సంగారెడ్డి ఎమ్మెల్యే*  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కామెంట్స్.....   ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి చనిపోవడం చాలా దురదృష్టకరం...  శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేదు.. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న.. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. తెలంగాణ ఉధ్యమంలో ఆర్టీసీ కార్మికుల ది కీలకపాత్ర... 25 రోజులు బంద్ పాటించి ..అప్పటి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు... విభజన తర్వాత మన జీవితాలు బాగుపడుతాయని కార్మికులు ఆశించారు..  వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నా..ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం..  అటు కార్మికులు ,ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..  *ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బంద్ లో* *కార్మికుల ఆత్మహత్యలు ఎప్పుడు* *జరగలేదు..*   *తెలంగాణ ప్రభుత్వం ఉన్నాక ఇలాంటి* *ఘటనలు జరగడం* *దురదృష్టకరం..*  ఆత్మ గౌరవం కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది..  *తెలంగాణలోఎమి జరుగుతుందని* *కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది..*  హుజూర్ నగర్ ఎన్నికల్లో పీసీసీ  బిజీగా ఉండడం వల్ల రాలేక పోతున్నారు.. ఎన్నికల తర్వాత కార్మికుల ఉద్యమం లో పాల్గొంట

ఎస్‌బిఐ కస్టమర్లకు దీపావళి ఆఫర్… 

ఎస్‌బిఐ కస్టమర్లకు దీపావళి ఆఫర్…    న్యూఢిల్లీ: ఎస్‌బిఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) తన కస్టమర్లకు అద్భుతమైన బంపర్ ఆఫర్ ప్రకటించింది.  దీపావళి పండగను పురస్కరించుకొని క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు నగదు బహుమతులతో పాటు, అత్యధిక మొత్తం ఖర్చు చేసిన కస్టమర్ కి లక్ష విలువైన “మేక్‌ మై ట్రిప్‌” హాలిడే ఓచర్ ను గెల్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.  దీనితోపాటు రోజు వారీ గిఫ్ట్‌లలో ఏడువేల రూపాయల విలువైన వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌, వీక్లీ కేటగిరిలో రూ.17,500 విలువైన షియోమి స్మార్ట్‌ ఫోన్లు గెల్చుకునే అద్భుత అవకాశం ఇస్తోంది.  కాగా ఈ ఆఫర్లు అక్టోబరు 30వ తేదీ వరకు మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.  ఇందుకోసం ఎస్‌బిఐ వివిధ రకాల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.  అయితే ఇటీవల అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా సేల్‌లో భాగంగా ఎస్‌బిఐ 10 శాతం డిస్కౌంట్‌  ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

సూర్యాపేట జిల్లా మటంపల్లి లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడి ఇంట్లో భారీగా మద్యం నిల్వలు పట్టివేత

సూర్యాపేట జిల్లా: మటంపల్లి లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడి ఇంట్లో భారీగా మద్యం నిల్వలు పట్టివేత. 11 లక్షల 56,000 రూపాయల విలువైన 200 కాటన్ ల మద్యం పట్టివేత. ఆకస్మిక సోదాలు నిర్వహించిన స్పెషల్ పార్టీ పోలీసులు. పట్టుబడిన ఇల్లు టిఆర్ఎస్ పార్టీకి చెందిన శౌరిరెడ్డిగా గుర్తింపు.

మెఘా’ కృష్ణారెడ్డి  ఇల్లు, కార్యాలయాలపై  ఐటీ దాడులు!!!????

'మెఘా' కృష్ణారెడ్డి  ఇల్లు, కార్యాలయాలపై  ఐటీ దాడులు!!!???? మెఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత సన్నిహితుడు, అతికొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని… భారతీయ సంపన్నుల్లోనే మొదటి 100స్థానాల్లో నిలిచిన మెఘా సంస్థ కార్యాలయాలపై ఐటీ దృష్టిపెట్టింది. ఇంత త్వరగా ఇన్ని వేల కోట్ల రూపాయాల సంపాదన ఎలా సాధ్యమయింది… ఎక్కడెక్కడ మెఘా సంస్థ పనులు చేస్తోంది, ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్టుల వివరాలు… సంపాదించిన మొత్తంపై పూర్తి లెక్కలు రాబడుతోంది. తొలివెలుగుకు వచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం 35చోట్ల మెఘా సంస్థ కార్యాలయాలు, కృష్ణారెడ్డి ఆఫీసు, ఇళ్లతో పాటు ఆయన బంధువులు, కీలక అనుచరుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధంలేని ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. బినామీ కంపెనీల వివరాలు, పన్ను ఎగవేత అంశాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భారీగా ఫేక్‌ బిల్లులతో పాటు ప్రభుత్వ అధికారుల వద్ద ఉండాల్సిన ఆయా ప్రాజెక్టుల కీలక అంశాలు ఈ సోదాల్లో లభ్యమయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మెఘా సంస్థ క