ఎస్‌బిఐ కస్టమర్లకు దీపావళి ఆఫర్…
ఎస్‌బిఐ కస్టమర్లకు దీపావళి ఆఫర్…
న్యూఢిల్లీ: ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కస్టమర్లకు అద్భుతమైన బంపర్ ఆఫర్ ప్రకటించింది.
దీపావళి పండగను పురస్కరించుకొని క్రెడిట్ కార్డు వినియోగదారులకు నగదు బహుమతులతో పాటు, అత్యధిక మొత్తం ఖర్చు చేసిన కస్టమర్ కి లక్ష విలువైన “మేక్ మై ట్రిప్” హాలిడే ఓచర్ ను గెల్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
దీనితోపాటు రోజు వారీ గిఫ్ట్‌లలో ఏడువేల రూపాయల విలువైన వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్, వీక్లీ కేటగిరిలో రూ.17,500 విలువైన షియోమి స్మార్ట్ ఫోన్లు గెల్చుకునే అద్భుత అవకాశం ఇస్తోంది.
కాగా ఈ ఆఫర్లు అక్టోబరు 30వ తేదీ వరకు మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఇందుకోసం ఎస్‌బిఐ వివిధ రకాల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
అయితే ఇటీవల అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో భాగంగా ఎస్‌బిఐ 10 శాతం డిస్కౌంట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment