Skip to main content

Posts

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను రిలీవ్‌ చేస్తూ డీఓపీటీ ఉత్తర్వులు

 *సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను రిలీవ్‌ చేస్తూ డీఓపీటీ ఉత్తర్వులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఈనెల 12లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీవోపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీస్‌ సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్‌ కుమార్‌ రిలీవ్‌ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈనెల 12లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీవోపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్‌ కొనసాగుతున్నారు. క్యాట్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని 20

ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలుగా ప్రభావతి ఎన్నిక

*ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలుగా ప్రభావతి ఎన్నిక*     కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈ నెల 6 నుండి 9 వరకు జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జాతీయ 13వ మహాసభలలో కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఎన్నికైనది. 1992 లో చదువు వెలుగు ద్వారా ఉద్యమాలలోకి వచ్చి ప్రజానాట్యమండలి కళాకారునిగా వ్యవసాయ కూలీల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి కూలీరెట్లు భూమి సమస్యలపై అనేక కార్యక్రమాలు నిర్వహించినది. తదనంతరం మహిళా సంఘం నల్గొండ డివిజన్ కార్యదర్శిగా ప్రస్తుతం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నది. నిరంతరం మహిళల సమస్యలపై రాజీలేని ఉద్యమాలు నిర్వహిస్తూ మహిళలకు అండగా నిలబడినది. మహిళలపై విద్యార్థులపై జరిగిన ఘటనలపై సీరియస్గా స్పందించి నిందితులకు కతినమైన శిక్షలు పడే విధంగా నిలబడినది. నిరుపేదలకు భూమి ఇండ్ల స్థలాల సమస్యపై గుడిసెలు పోరాటం నిర్వహించి తొమ్మిది రోజులు జైలుకెళ్ళినది. మరియొకసారి ఐదు రోజులు జైలుకు సైతం వెళ్ళినది.  నల్లగొండ జిల్లాలో మండల కేంద్రాలు గ్రామాలలో ఐద్వా కమిటీలను విస్తృతపరచి ఐద్వాలో సభ్యులుగా చేర్పించి ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమంలో చురుకైన ప

కాంతి ఫార్మా అనుమతులు రద్దు

  కాంతి ఫార్మా అనుమతులు రద్దు నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలంలో ఏర్పాటు చేస్తున్న కాంతి లేబరేటరీస్ ఫార్మా కంపెనీ అనుమతులను రద్దు చేస్తూ నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి  ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 6న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గట్టుప్పల మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గట్టుపల్ గ్రామ సర్పంచ్ కుమారి విడమ్ రోజా మంత్రి కేటీఆర్ దృష్టికి ఫార్మా కంపెనీని రద్దు చేయాలని విషయాన్ని తీసుకువచ్చారు. ఫార్మా కంపెనీ వల్ల జరగబోయే నష్టాలను మంత్రికి వివరించారు. గత సంవత్సరం కాలంగా ఈ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని పరిసర గ్రామాల ప్రజలు కూడా ఆందోళనలు చేసినట్లు రోజా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రజా ప్రతినిధుల వినతులు, మంత్రి ఆదేశాలను పరిశీలించిన మీదట సోమవారం కాంతి లేబరేటరీస్ ఫార్మా కంపెనీ నిర్మాణ అనుమతులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. .

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌

 *తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌* *తెలంగాణలో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు.* *కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు* *రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌మార్‌ను ఏపీకి కేటాయించిన కేంద్రం.* *కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు.* *క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేశ్‌కుమార్.* *క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం.* *క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు.* *సోమేశ్‌కుమార్‌ అభ్యర్థనతో తీర్పు అమలు 3 వారాలు నిలిపివేత.*

రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం. - నార్సింగీ లో దారీ దోపిడీ, హత్య కేసు లో పురోగతి.

   రంగారెడ్డి:........ రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం.  నార్సింగీ లో   దారీ దోపిడీ, హత్య కేసు లో పురోగతి.  హైదర్ గూడ చౌరస్తా వద్ద పాద చారుల పై దూసుకెళ్లిన లారీ. బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తల ను ఢి కొట్టిన లారీ. లారీ చక్రాల కింద నలిగిపోయిన భర్త. లారీ కింద నుండి భార్యను లాగేసిన స్థానికులు.  తప్పిన పెను ప్రమాదం. రోడ్డు ప్రమాదం తో ఉలిక్కి పడ్డ రోడ్డు పై ఉన్న ప్రజలు.  100 ఫొన్ చేసి సమాచారం ఇచ్చిన స్థానికులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్న కాప్స్. ఆర్టీసీ బస్సు, లారీ ఓవర్ టేక్ చేయడం తో పాదచారుల పైకి దూసుకొని వచ్చిన లారీ అంటున్న స్థానికులు.  భార్య కళ్ల ముందు కొట్టు మిట్టులాడుతూ ప్రాణాలు విడిచిన భర్త. తీవ్రంగా గాయపడ్డ భార్య.  కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య, మంజుల. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ కు వచ్చిన దంపతులు.  లారీ రూపంలో దూసుకొని వచ్చిన‌ ప్రమాదం. †******************************************  నార్సింగీ లో   దారీ దోపిడీ, హత్య కేసు లో పురోగతి.  కిషోర్ కుమార్ రెడ్డి ని హత్య చేసిన చింటూ సింగ్ ను పట్టుకున్న   నార్సింగీ పోలీసులు.  ఇప్

జర్నలిస్ట్ యూనియన్ వర్గాల స్టేట్మెంట్ ల యుద్ధం

  జర్నలిస్ట్  యూనియన్ ఐజేయు వర్గాల స్టేట్మెంట్ ల యుద్ధం అల్లం నారాయణ వర్గం ఐజేయు ప్రెసిడెంట్ వినోద్ కోహ్లీ పిలుపు ఐజెయు జాతీయ జర్నలిస్టుల మహాసభలు జయప్రదం చేయాలి - ఐజేయు ప్రెసిడెంట్ వినోద్ కోహ్లీ పిలుపు జాతీయ స్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించేందుకు ఈనెల 8, 9,10 తేదీలలో పటాన్ చెరువులోని జిఎంఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాల జర్నలిస్టుల మహాసభలను జయప్రదం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) అధ్యక్షులు వినోద్ కోహ్లీ జర్నలిస్టులను కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం నాడు  తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్లతో కలిసి ఆయన మాట్లాడారు. మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల కనీస వేతనాల కోసం గలమెత్తింది తామేనని కోహ్లీ అన్నారు. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై స్పందించి పోరాడింది తమ సంఘమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఐజేయు సభలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మూడు రోజులపాటు జరిగే పదవ ప్లీనరీ సమావేశంలో అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిస్

మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రభారిగా -వీరెళ్లి చంద్రశేకర్

  మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రభారిగా -వీరెళ్లి చంద్రశేకర్    తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్లమెంట్ పరిధి కలిగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ (7 అసెంబ్లీ నియోజక వర్గాలు 52 మండలాలు)ప్రవాస యోజన ప్రభారిగా బిజెపి రాష్ట్ర నాయకులు వీరెళ్ళీ చంద్రశేకర్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ,కరీం నగర్ పార్లమెంట్ సభ్యులు  బండి సంజయ్ కుమార్  నియమించారు. ఈ సంధర్బంగా వీరెల్లి మాట్లాడుతూ  తనను నియమించినందుకు  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ తనకు కేటాయించిన భాద్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు  

ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం

  నల్గొండ జిల్లా.... వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని  భారీ మోసం నిరుద్యోగ యువకులకు టోకరా వేసిన ఘరానా మోసగాడు న్యాయం చేయాలని బాధితుల ఆవేదన నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్వో లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం... బాధితులు నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

సార్ మా ఊర్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు వల్ల ప్రజలకు ఇబ్బంది - కేటీఆర్ తో గట్టుప్పల్ సర్పంచ్ ఇడం రోజా

  సార్ మా ఊర్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు వల్ల ప్రజలకు ఇబ్బంది - కేటీఆర్ తో గట్టుప్పల్  సర్పంచ్ ఇడం రోజా గట్టుప్పల్; సార్ మా ఊర్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ..ఆ కంపెనీని ఎక్కడికైనా తరలించండి మంత్రి కేటీఆర్ తో గట్టుప్పల్  సర్పంచ్ ఇడం రోజా.. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ కంపెనీ కూడా వద్దు తక్షణమే ఫార్మా కంపెనీని రద్దు చేయండి. జిల్లా కలెక్టర్కు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం. ఘట్టుప్పల  గ్రామంలో చేనేత క్లస్టర్లను ప్రారంభించడానికి  విచ్చేసిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారిని గ్రామ సర్పంచ్ కుమారి రోజా మా గ్రామంలో నెలకొల్పే ఫార్మా కంపెనీ అనుమతులను రద్దుచేసి మా గ్రామాన్ని కాలుష్యం నుండి కాపాడాలని కోరగా, స్పందించిన మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి మౌకికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా గట్టుప్పల దాని చుట్టుపక్క గ్రామాల ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దేవరకొండలో మెడికల్ దందా?

  దేవరకొండలో మెడికల్ దందా? అక్రమంగా సిటీ స్కాన్? లైసెన్స్ లేని దుకాణాలు? మేము గిచ్చినట్లు... మీరు ఏడ్చినట్లు... దేవరకొండ పట్టణములో ఒక CT స్కానింగ్ సెంటర్ నిబంధనల ప్రకారంగా లేదని, CT స్కానింగ్ కావలసిన టెక్నికల్ సపోర్ట్ మెయింటెయిన్ చేయడం లేదని, రెడియాలిజిస్టు సపోర్టు లేదని, దాన్ని తరలించాలని అధికారులు నోటీసు లు ఇచ్చారు. అయిన చాటుమాటుగా స్కానింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.మేము గిచ్చినట్లు చేస్తాం మీరు ఏడ్చినట్లు చేయండని చందంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆక్రమంగా నడుస్తున్న సిటీ స్కానర్ తో అబార్షన్లు చేయించుకునే అవకాశం కూడా ఉంది. ఈ విషయం పై స్థాయి అధికారులు దృష్టి పెట్టి అడ్డుకట్ట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు               ఇది ఇలా ఉంటే డ్రగ్ లైసెన్స్ లు లేకుండా కూడా కొన్ని మెడికల్ షాప్ లు నడిపిస్తున్నట్లు తెలిసింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ లు దేవరకొండ కు తనకీ లకు వెళ్తున్న సమాచారం కొంతమంది ఉద్యోగులు లీక్ చేస్తుండటం తో లైసెన్స్ లేని దుకాణాలు ఆ సమయం లో మూసి వుంచుతున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని