Skip to main content

Posts

*మహిళా శక్తి సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ*

 *మహిళా శక్తి సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ* నల్లగొండ పట్టణంలో ఈనెల 28వ తేదీన జరిగేటటువంటి మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఈరోజు ఉదయం మాధవ స్మారక నిలయం లో తెలంగాణ ప్రాంత ప్రబారి వరలక్ష్మి, డాక్టర్ స్వప్న,వినీల రెడ్డి, నన్నూరి లతా ఆవిష్కరించడం జరిగింది. ఈ 28వ తేదీన జరిగే అటువంటి మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు పూర్తయినవారి నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలు పాల్గొన గలరని నిర్వాహకురాలు నన్నూరి లత కోరారు. 28 వ తేదీన జరిగే ఈ కార్యక్రమం నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి జిఎం గార్డెన్స్ (గుండెగోని మైసయ్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుండి వచ్చినటువంటి దేవిక,,వసంత,అరుణ జ్యోతి, విజయ, అనురాధ, పావని, పుష్పలత, మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు..

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) టొరంటో లో సంక్రాంతి పండుగ వైభవంగా ఘన వేడుకలు

  తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) టొరంటో లో సంక్రాంతి పండుగ వైభవంగా ఘన వేడుకలు తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు తీన్మార్ సంక్రాంతిగా చింగ్కూజీ సెకండరీ స్కూల్, బ్రాంటెన్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 800 కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించగా, శ్రీమతి మేఘన గుర్రాల, శ్రీమతి శైలజ ఎర్ర, శ్రీమతి స్ఫూర్తి కొప్పు, కుమారి ప్రహళిక మ్యాకల మరియు శ్రీమతి శ్రీరంజని కందూరి గార్లు జ్యోతి ప్రజ్వలన చేయగా రామదాసు అర్గుల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతముగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ మరియు షో అండ్ టెల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రాహుల్ బలనేని మరియు శ్రీమతి జ్యోతి రాచ మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా ప్రవీణ్ నీల, శ్రీమతి ఝాన్సీలక్ష్మి గరిమెళ్ళ, శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి మరియ

15న RSS సంక్రాంతి ఉత్సవము

  15న RSS సంక్రాంతి ఉత్సవము నల్గొండ:  ఈ నెల 15న  సోమవారం  రాష్ట్రీయ స్వయం సేవక్ అధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవము నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవము నల్గొండ ఎస్. పి. అర్ స్కూల్ ల్లో ఉదయం 8 గంటలకు నిర్వహించ బడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధాన వక్త గా దక్షణ మధ్య క్షేత్ర సహా క్షేత్ర ప్రచారక్ శ్రీ రామ్ భారత్ జీ, ముఖ్య అతిథిగా డా . వై వి. రాజశేఖర్ రెడ్డి గార్లు పాల్గొంటారని, కార్యక్రమం ప్రారంభ నికి 10 నిమిషాల ముందుగా రావలసిందిగా వారు కోరారు. 

నల్గొండ మున్సిపల్ తాత్కాలిక చైర్మన్ రమేష్ కు అభినందనలు వెల్లువ

 నల్గొండ మున్సిపల్ తాత్కాలిక చైర్మన్ రమేష్ కు అభినందనలు వెల్లువ *నల్లగొండ*: నల్గొండ మున్సిపల్ తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అబ్బగోని రమేష్ గౌడ్ ను గురువారం పలువురు కౌన్సిలర్లు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నేతలు కలిసి బోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుదోడ్ల వెంకట్రామిరెడ్డి, నల్లగొండ అశోక్, బీసీ సంఘం నేతలు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Hmda పై ACB కన్ను?

 Hmda   అధికారుల పై ACB కన్ను? హైదరాబాద్: Hmda అధికారుల పై ACB దృష్టి సారించినట్లు సమాచారం. అన్ని జోన్ల లో విధులు నిర్వహిస్తున్న PO ల, APO ల మరియు ఇతర టెక్నికల్ సిబ్బంది  ఇంజనీరింగ్ అధికారుల సిబ్బంది వివరాలు సేకరిస్తున్నట్లు వినికిడి. వివరాలు కావాలని ఏసీబీ అధికారి ఒకరు hmda సెక్రటరీ ని కలవడం తో అన్ని జోన్ల అధికారులు కు వివరలు ఇవ్వమని సెక్రటరీ ఆదేశాలు ఇచ్చినట్లు గుసగుసలు వినపడుతున్నాయి

విప్ ను ఉల్లంఘించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోండి.. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

 విప్ ను ఉల్లంఘించిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోండి.. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ 'మందడి సైదిరెడ్డి' మీద అవిశ్వాస తీర్మానం సందర్భంగా.. బీఆర్ఎస్ పార్టీ జారీ చేసిన విప్ ను ఉల్లంఘించిన ఆ పార్టీ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోవాలంటూ.. కలెక్టర్ హరిచందన కు ఫిర్యాదు చేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.*

నిర్దిష్ట గడువులోపు సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలి* *వీ.సీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీ.ఎస్ శాంతికుమారి

నల్గొండ జిల్లా *నిర్దిష్ట గడువులోపు సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలి*   *వీ.సీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీ.ఎస్ శాంతికుమారి*  నిర్దిష్ట గడువులోపు సీ.ఎం.ఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యాన్ని సాధించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీ.ఎం.ఆర్ ప్రగతిపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరిపించి, కోటా మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్ సీ ఐ)కు బియ్యం నిల్వలు చేరవేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. గత డిసెంబర్ 31 నాటికే ఎఫ్.సి.ఐకి సీ.ఎం.ఆర్ కోటాను చేరవేయాల్సి ఉన్నప్పటికీ, అనేక జిల్లాలలో మిల్లింగ్ ప్రక్రియ పెద్ద ఎత్తున పెండింగ్లోనే ఉండిపోయిందని అన్నారు. ఈ నెల 31 వరకు ఎఫ్.సీ.ఐ గడువు పొడిగించినందున, నిర్ణీత సమయంలోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలు చేరేలా చూడాలన్నారు. ఈ అంశానిక

జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హరిచందన దాసరి

                                                          *జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హరిచందన దాసరి* *# కలెక్టర్ కు స్వాగతం పలికిన ఎస్.పి.,అదనపు కలెక్టర్ లు,పలు శాఖల జిల్లా అధికారులు,ఉద్యోగులు#*  నల్గొండ జిల్లా కలెక్టర్ గా హారిచందన దాసరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.  జిల్లా కలెక్టరేట్ చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ను ఛాంబర్లో ఎస్.పి.చందన దీప్తి, ఇంచార్జి కలెక్టర్ గా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)జె.శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, అర్.డి. ఓ .లు,మున్సిపల్ కమిషనర్ లు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలెక్టర్ కు పూల బొకేలు అందించి సాదరంగా కలిశారు. 

*అంగన్ వాడి కేంద్రానికి రైస్ కుక్కర్, మ్యాట్స్, వంట పాత్ర గోవిందు బాలరాజు వితరణ*

 *అంగన్ వాడి కేంద్రానికి రైస్ కుక్కర్, మ్యాట్స్, వంట పాత్ర గోవిందు బాలరాజు వితరణ* నల్లగొండ : పట్టణంలోని నాగార్జున కాలనీలో గల అంగన్ వాడి కేంద్రానికి అవసరమైన రైస్ కుక్కర్, చిన్న పిల్లలు కూర్చునేందుకు అవసరమైన చాపలు (మ్యాట్స్), వంట పాత్రలను సోమవారం నాడు వెంకటేశ్వర ప్యాకేజ్ అధినేత గోవిందు బాలరాజు వితరణ చేశారు. ఈ సందర్బంగా బాలరాజు మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రంలో అవసరమైన సామాగ్రి లేకపోవడం వల్ల కేంద్రానికి వస్తున్న చిన్నారులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని తన తల్లి గోవిందు విరమణి జ్ఞాపకార్ధం అంగన్ వాడి కేంద్రానికి అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అదనపు కోశాధికారి కోటగిరి రామకృష్ణ, నాయకులు తల్లం గిరీష్ కుమార్, అంగన్ వాడి సిబ్బంది మంగమ్మ తదితరులున్నారు.

నల్గొండ మునిసిపల్ ఛైర్మెన్ పై నెగ్గిన అవిశ్వాసం

 నల్గొండ మునిసిపల్ ఛైర్మెన్ పై నెగ్గిన అవిశ్వాసం నల్గొండ మునిసిపల్ ఛైర్మెన్  మందడి సైది రెడ్డి పై కాంగ్రెస్స్ కౌన్సిలర్స్ ఇచ్చిన అవిశ్వాసం నెగ్గింది. మొత్తం 48 కౌన్సిలర్స్ కు 47 మంది హాజరు అయ్యారు. బిజెపి కౌన్సిలర్ బండారు  ప్రసాద్ గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో అందులో ఒక్కరూ తట్స్తం, 41 మంది అనుకూలం 5 గురు వ్యతిరేకం.  బిజెపి కౌన్సిలర్స్ కూడా అవిశ్వాసానికి  అనుకూలంగా ఓటు వేశారు.