*అంగన్ వాడి కేంద్రానికి రైస్ కుక్కర్, మ్యాట్స్, వంట పాత్ర గోవిందు బాలరాజు వితరణ*


 *అంగన్ వాడి కేంద్రానికి రైస్ కుక్కర్, మ్యాట్స్, వంట పాత్ర గోవిందు బాలరాజు వితరణ*


నల్లగొండ : పట్టణంలోని నాగార్జున కాలనీలో గల అంగన్ వాడి కేంద్రానికి అవసరమైన రైస్ కుక్కర్, చిన్న పిల్లలు కూర్చునేందుకు అవసరమైన చాపలు (మ్యాట్స్), వంట పాత్రలను సోమవారం నాడు వెంకటేశ్వర ప్యాకేజ్ అధినేత గోవిందు బాలరాజు వితరణ చేశారు.


ఈ సందర్బంగా బాలరాజు మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రంలో అవసరమైన సామాగ్రి లేకపోవడం వల్ల కేంద్రానికి వస్తున్న చిన్నారులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని తన తల్లి గోవిందు విరమణి జ్ఞాపకార్ధం అంగన్ వాడి కేంద్రానికి అందించినట్లు చెప్పారు.


కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అదనపు కోశాధికారి కోటగిరి రామకృష్ణ, నాయకులు తల్లం గిరీష్ కుమార్, అంగన్ వాడి సిబ్బంది మంగమ్మ తదితరులున్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్