*మహిళా శక్తి సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ*


 *మహిళా శక్తి సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ*





నల్లగొండ పట్టణంలో ఈనెల 28వ తేదీన జరిగేటటువంటి మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఈరోజు ఉదయం మాధవ స్మారక నిలయం లో తెలంగాణ ప్రాంత ప్రబారి వరలక్ష్మి, డాక్టర్ స్వప్న,వినీల రెడ్డి, నన్నూరి లతా ఆవిష్కరించడం జరిగింది. ఈ 28వ తేదీన జరిగే అటువంటి మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు పూర్తయినవారి నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలు పాల్గొన గలరని నిర్వాహకురాలు నన్నూరి లత కోరారు. 28 వ తేదీన జరిగే ఈ కార్యక్రమం నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి జిఎం గార్డెన్స్ (గుండెగోని మైసయ్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుండి వచ్చినటువంటి దేవిక,,వసంత,అరుణ జ్యోతి, విజయ, అనురాధ, పావని, పుష్పలత, మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు..

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్