Skip to main content

Posts

ఈ నెల 28న వామ్ ఆల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు

  వామ్ ఆల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో 1000 మందికి ఉచిత భోజనాలు ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటి గంటకు ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ అడ్వైజర్ మరియు నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విటల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ గా కౌటికె విటల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, కార్యక్రమము సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర నిర్వహించబడుతున్నట్లు ఆయన  తెలిపారు.

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలి-

       లోకసభ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలని లోకసభ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ ర్రావు సూర్యవంశి అన్నారు.      శనివారం ఆయన నల్గొండ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కేషరాజుపల్లి, తిప్పర్తి, మాడుగుల పల్లి, కుక్కడం, వేములపల్లి తదితర మండలాలు, గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి కనీస సౌకర్యాలను ,ఇతర అంశాలను పరిశీలించారు.          అనంతరం మిర్యాలగూడలోని లోకసభ ఎన్నికల పంపిణీ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూము తనిఖీ చేశారు.      ఆయా పోలింగ్ కేంద్రాల సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల సందర్భంగా ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలని ,ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ చిట్టిలను పంపిణీ చేయాలని, అదే సమయంలో పోలింగ్ తేదీని సైతం తెలియజేయాలని సూచించారు.          మిర్యాలగూడ ఆర్డిఓ శ్రీనివాసరావు, తహసిల్దార్ హరిబాబు ,ఆయా మండలాల తహసిల్దార్లు ఉన్నారు. ____________________________________  జారీచేసినవారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

నల్గొండలో 25 మంది నామినేషన్లు తిరస్కరణ

  శుక్రవారం నల్గొండ లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన అనంతరం( 25) మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా (31) మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగింది.  అంగీకరించిన నామినేషన్ల అభ్యర్థుల వివరాలు

అలీన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం..

  షాద్నగర్.. అలిన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం..  ఫార్మా కంపెనీలో భారీగా చెలరేగిన మంటలు..  రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది..  అగ్నిప్రమాదం సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు..  కంపెనీలో చిక్కుకుపోయిన దాదాపు 50 మంది కార్మికులు.. మంటలు వేడి తాళలేక బిల్డింగ్ పైనుంచి దూకిన నలుగురు కార్మికులు..  లోపల ఉన్నవారిని బయటకు తెచ్చే ప్రయత్నం..   తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్ధ నాదాలు..  కార్మికులను బయటకు రప్పిస్తున్న ఫైర్ సిబ్బంది..  నిచ్చెన ద్వారా కంపెనీ నుంచి బయటికి వస్తున్న కార్మికులు..  ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా అనేదానిపై అధికారులు ఆరా..  మంటలు దాటికి చుట్టుపక్కల వ్యాపించిన పొగ .. పొగతో ఉక్కిరి బిక్కరవుతున్న సానికులు.. *50 మంది కాపాడినబాలుడు*  షాద్నగర్ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం 50 మంది ప్రాణాలను నిలబెట్టింది. స్థానికంగా నివసించే సాయిచరణ్ అనే బాలుడు మంటలను గమనించి భవనం పైకెక్కి తాడు కట్టాడు. ఆ తాడు సహాయంతో బిల్డింగ్ లోని కార్మికులు కిందకు దిగారు. లేదంటే వారందరూ అక్కడే సజీవదహనమయ్యేవారు. కాగా వెల్డింగ్ పనుల వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు గుర్తించారు.

మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

        లోక సభ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని, సోషల్ మీడియా, సువిధ, ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ కంట్రోల్ రూమ్ , సి విజిల్ తదితర విభాగాలను జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్, పోలీస్ పరిశీలకులు అమోగ్ జీవన్ గాంకర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ,సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు.       ఈ సందర్భంగా వారు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటనల గుర్తింపు, పెయిడ్ న్యూస్ స్కానింగ్, రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తదితర రిజిస్టర్ లను తనిఖీ చేశారు.       అనంతరం సోషల్ మీడియా విభాగాన్ని సందర్శించి సోషల్ మీడియా పోస్టింగ్ లను పరిశీలన చేశారు. ఆ తర్వాత సువిధ ద్వారా ఇచ్చే అనుమతులు, సి-విజిల్ యాప్ కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారం, తదితర విభాగాల సందర్శన సంద

నల్గొండ లోక్ సభకు దాఖలు అయిన నామినేషన్లు

 నల్గొండ లోక్ సభకు  ఏప్రిల్ 18 నుండి 25 వరకు దాఖలు  అయిన నామినేషన్లు  ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు https://drive.google.com/file/d/1nMN9Zjhu2NqVeXMQCJr-hGNQnI36uZKQ/view?usp=drivesdk ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు https://drive.google.com/file/d/1nMN9Zjhu2NqVeXMQCJr-hGNQnI36uZKQ/view?usp=drivesdk

నల్గొండ జిల్లా ఎన్నికల పరిశీలకులు

       పార్లమెంటు ఎన్నికలలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించింది.            గురువారం నల్గొండ జిల్లాకు లోకసభ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా నియమితులైన (2010) ఐఏఎస్ బ్యాచ్ అధికారి మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్య వంశీ జిల్లాకు వచ్చారు. వీరు లోక సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలోనే ఉండి లోకసభ ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తారు.  జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. 9867383846 సెల్ ఫోన్ నెంబర్లో అందుబాటులో ఉంటారు.        జిల్లాకు పోలీసు పరిశీలకులుగా  (2011 )ఐపిఎస్ బ్యాచ్ అధికారి  ఆమోఘ్ జీవన్ గాంకర్ నియమితులు కాగా, వీరు సైతం జిల్లాకు  చేరుకున్నారు. వీరు పోలీస్ అతిథి గృహంలో ఫోన్ నెంబర్ 8978946757 లో అందుబాటులో ఉంటారు.          కాగా ఇదివరకే జిల్లాకు వ్యయపరిశీలకులుగా కళ్యాణ్ కుమార్ దాస్  ( 2012) బ్యాచ్ ఐ ఆర్ ఎస్ అధికారి  జిల్లాకు  వచ్చారు. ____________________________________  జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

గోమాత సేవలో ఉప్పల

  గోమాత సేవలో ఉప్పల గోమాత సేవలో కాంగ్రెస్ర్ పార్టీ రాష్ట్ర నాయకులు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చెర్మేన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.

రాయలసీమలో వైసీపీని నేలకూల్చండి

 *రాయలసీమలో వైసీపీని నేలకూల్చండి* *జగన్ ను ఓటు ఆయుధంతో అధ: పాతాళానికి తొక్కేయండి* *నిర్భయంగా ఓటేయండి.. మీ వెనుక నేనుంటాను* *పెద్దిరెడ్డి ఈ ప్రాంతాన్ని సామంతరాజులా రౌడీయిజంతో పాలిస్తున్నాడు* *సంపద అంతా పెద్దిరెడ్డి కుటుంబం దగ్గరే ఉంది* *పెద్దిరెడ్డి ప్రాంతంలోకి ఎవరూ వెళ్లినా, ప్రశ్నించినా ప్రాణాలు తీస్తున్నారు* *కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలకు తగిన ప్రాధాన్యం* *కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ' ప్రసాద్ ' స్కీం ద్వారా ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి*   *రాజంపేట ప్రజాగళం సభలో ప్రసంగించిన  పవన్ కళ్యాణ్* రాజంపేట నుంచి ప్రత్యేక ప్రతినిధి : రాయలసీమలోని ఓ ప్రాంతంలో ప్రజలంతా ఉపాధి కోసం బయట ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తుంటే, ఇక్కడి డబ్బంతా ముగ్గురు దగ్గరే ఉండి పోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు వద్దనే అది ఉండిపోయింది. వాళ్లు ఈ ప్రాంతాన్ని సామంతుల్లా పాలిస్తూ దోపిడీలకు, దౌర్జాన్యాలకు, రౌడీయిజానికి కేరాఫ్ చేశారు. వీళ్లను ఎవరూ ఏమీ అనకూడదు. కనీసం ఈ ప్రాంతంలోకి వచ్చినా దాడులు చేయిస్తార'ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. స్థాన

బండి సంజయ్ నామినేషన్

*బండి సంజయ్ నామినేషన్*  *హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి* కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్, కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, మహిళా నాయకురాలు గండ్ర నళిని, కిరణ్ హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బండి సంజయ్ కుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు.