జూన్ 11 ఏపీ కరోనా సమాచారం

ఏపీ కరోనా బులిటెన్
అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 135 కేసులు నమోదవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 38 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే విదేశాల నుంచి వచ్చి 9 మందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఏపీలో 182 పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ఏపీకి చెందిన 11,602 శాంపిళ్లను పరిశీలించగా 135 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా 65 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఏపీలో నమోదైన మొత్తం 4261 పాజిటివ్ కేసులకు గాను.. 2540 మంది డిశ్చార్జ్ అవగా.. 80 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1641 మంది కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ