Skip to main content

ఎనిమిది రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్


ఎనిమిది రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్


 


పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత


ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం లో బాగంగా కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి


జూన్ ఒకటి నుండి జూన్ 8 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేకk పారిశుధ్య కార్యక్రమంలో బాగంగా  పరిసరాలు,గ్రామం పరిశుభ్రతను సంతరించుకునే లా గ్రామాల్లో పారిశుధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం లో బాగంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ లు కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామంలో  పాల్గొన్నారు.ముందుగా గ్రామంలో వార్డుల వారీగా పర్యటించి ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నారు.గ్రామంలో ఉన్న డ్రైన్ లు మురుగు నీరు పోయేలా శుభ్రం చేయాలని ఆదేశించారు.మంచి నీటి ట్యాంకు లు దగ్గర బ్లీచింగ్ వేసి పరిశుభ్రం చేయాలని వారు ఆదేశించారు.మంచి నీటి ట్యాంకు లను నెలలో మూడు సార్లు శుభ్రపరచాలి అన్నారు.గ్రామంలో ఎస్.సి.కాలనీ లో విద్యుత్ లో ఓల్టేజి సమస్య వివరించారు.డ్రైన్ ను నిర్మించాలని కోరారు.మంచి నీటి సమస్య పరిష్కరించాలని అర్. డబ్ల్యూ.ఎస్. ఏ. ఈ. ని,లో ఓల్టేజి విద్యుత్ సమస్య ము పరిష్కరించాలని ట్రాన్స్ కో ఏ. ఈ. ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠ ధామం నిర్మాణం ను పరిశీలించారు.వైకుంఠ ధామం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కు నిధులు మంజూరు చేస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు. శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ,వైకుంఠ ధామం చుట్టూ వేప,రాగి చెట్లు పెంచి కాంపౌండ్ వాల్,గేట్ నిర్మించాలని అన్నారు.అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 
గత సంవత్సరం అక్టో బర్,నవంబర్ లో పల్లె ప్రగతి మొదటి విడత,జనవరి లో రెండవ విడత నిర్వహించినట్లు తెలిపారు.పల్లె ల ప్రగతి,ప్రజల వికాసం కోసం నిరంతరం జరుగు కార్యక్రమం అని,ఇందులో బాగంగా  జూన్ 1 నుండి 8 వరకు  ప్రభుత్వం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యం లో, వానాకాలం సమీపిస్తున్న దృష్ట్యా గ్రామాలలో సీజనల్ వ్యాధులు  అతి సారం,డెంగ్యూ,చికెన్ గున్యా,మలేరియా, టైఫాయిడ్,వైరల్ జ్వరాలు ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎనిమిది రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ శ్రీకారం చుట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాలలో చేపట్టిన పల్లె ప్రగతి పనుల నాణ్యత కూడ తెలిసే అవకాశం ఉందన్నారు.


వర్షాకాలం త్వరలో ప్రారంభం కాబోతున్న దృష్ట్యా  గ్రామాలలో గుర్తించిన ఏమైనా సానిటేషన్ సమస్యలు వుంటే పరిష్కారం చేయాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు ,పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కలెక్టర్ అన్నారు.కేవలం సర్పంచ్,గ్రామ కార్యదర్శి మాత్రమే కాకుండా ప్రజలు అందరూ ఐక్యంగా పని చేస్తే గ్రామాలు బాగు పడతాయని అన్నారు.రోడ్ల పై చెత్త చెదారం వేయ వద్దని,గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ డస్ట్ బిన్ లలో చెత్త వేయాలని అన్నారు.ప్రతి గ్రామ పంచాయతీ కి ప్రభుత్వం ఒక మనిషికి 1632 రూ.లు నిధులు ప్రతి నెల మంజూరు చేస్తోందని,గ్రామ అభివృద్ధికి వినియోగించు కొనాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నాలుగు విడతలుగా హరిత హరం నిర్వహించినట్లు,ఇంకా ఆశించిన ఫలితాలు రావాలంటే గ్రామంలో మొక్కలు నీరు పోసి సంరక్షణ కు చర్యలు తీసుకోవాలని అన్నారు.
శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రైతులు,అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు సారథ్యం లో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్న ట్లూ, ప్రాజెక్ట్ ల ద్వారా పంటలకు సాగు నీరు ,24 గంటల ఉచిత విద్యుత్,పంటల కు పెట్టుబడి సాయం వలన యాసంగి లో జిల్లాలో 18 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.నల్గొండ నియోజక వర్గంలో 93 జి.పి.ల్లో ఉన్న సమస్యలు తెలుసని,వాటిని పరిష్కరిస్తానని అన్నారు.గ్రామంలో  డ్రైనేజీ నిర్మాణం కు అంచానాలు రూపొందిస్తే నిధులు మంజూరు చేస్తానని,కరెంట్ సమస్యలు వుంటే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు.గ్రామంలో ప్రతి ఒక్కరూ శాంతి యిత వాతావరణంలో గ్రామాలను అభివృద్ది చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,డి.పి. ఓ.విష్ణు వర్ధన్,ఎం.పి.పి.కరీం పాషా,సర్పంచ్ యాదగిరి, వైస్ ఎం.పి.పి.,తహశీల్దార్ శ్రీనివాస్,ఎం.పి.డి. ఓ సోమ సుందర్,మండల గ్రామ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు
చర్ల గౌరారం జి.పి.లో నర్సరీ నీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సందర్శించారు.నర్సరీ లో గ్రామ గ్రీన్ ప్లాన్ ప్రకారం ఏ ఏ రకాల మొక్కలు, పెంచుతున్న మొక్కలు  ఎన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.పొడవుగా ఉన్న మొక్కలను వర్షాలు ప్రారంభం అయిన వెంటనే హరిత హరం లో నాటాలని సూచించారు.తర్వాత.మిగతా మొక్కలు నాటేందుకు సిద్దం చేయాలని అన్నారు.జిల్లా కలెక్టర్ వెంట డి.పి. ఓ.విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


జిల్లా పౌరసంబంధాల అధికారి, నల్గొండ గారి సౌజన్యంతో


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్