Posts

Showing posts from July, 2024

టి డి ఆర్ స్కాంలో డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణమోహన్ తొంపాటు మరో ముగ్గురు అరెస్ట్

Image
 టి డి ఆర్  స్కాంలో డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణమోహన్ తో పాటు మరో ముగ్గురు అరెస్ట్ . రాజేంద్రనగర్ టీడిఆర్ స్కాంలో నలుగురు మున్సిపల్ ఉద్యోగుల అరెస్ట్ రాజేంద్ర నగర్ లో కబ్జాదారులకు కొమ్ముకాసి టిడిఆర్ ఇప్పించిన మున్సిపల్ ఉద్యోగులు.  మూడున్నర కోట్ల రూపాయల టిడిఆర్ని అక్రమంగా కబ్జాదారులకు ఇప్పించిన జిహెచ్ఎంసి ఉద్యోగులు.  టి డి ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసే మహమ్మద్ ఖాన్, డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణమోహన్ అరెస్ట్ . డిప్యూటీ ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ల్యాండ్ సర్వేర్ దీపక్ కుమార్ అరెస్ట్.  గతంలోని ఈ స్కాం కు సంబంధించి జిహెచ్ఎంసి ఉన్నతాధికారిని అరెస్టు చేసిన పోలీసులు.

న్యూ ఢిల్లీ లో ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులతో ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా

Image
 ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులతో ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులకు సన్మానం హాజరైన ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా  రాజకీయంగా వెనుకబడిన ఆర్యవైశ్య జాతిని మేల్కొలిపి, వివిధ రాష్ట్రాల్లో నామినేటెడ్‌ పద వులు దక్కించుకొనేలా ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌(ఐవీఎఫ్‌) తీర్మాణించింది. ఆలిండియా అధ్యక్షుడు అశోక్‌ అగర్వాల్‌ అధ్యక్షతన న్యూఢిల్లిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన పలువురు వైశ్యనాయకులను ఘనంగా సన్మానించారు. దాదాపు 37మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా వివిధ పార్టీల నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందిన వారిని సైతం ఒకే వేదికపైకి తీసుకు వచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్‌(ఐవీఎఫ్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా వైశ్యజాతి ప్రజా ప్రతినిధులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని, ఆర్థికంగా వెనుకబడిన వైశ్యజాతి బిడ్డల చదువులకు, వారి అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. అంత

*సేవా భావం ఉన్న వారు కావాలి-కమ్మర్షియల్ వారు వద్దు* - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు పోలిశెట్టి బాలకృష్ణ

Image
  *సేవా భావం ఉన్న వారు కావాలి-కమ్మర్షియల్ వారు వద్దు* - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు పోలిశెట్టి బాలకృష్ణ వనపర్తి:  రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పేద ఆర్య వైశ్యులకు అందుబాటులో ఉండాలి. సేవలందించి, ఆర్యవైశ్య సత్రాల్లో తక్కువ రెట్లకు వసతి కల్పించి, సమస్యలపై స్పందించే వారు తెలంగాణ అధ్యక్షులుగా ఉండాలి. సత్రాలు వ్యాపారంగా మారాయి.సెల్ ఫోన్ చేసే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. సేవా భావం ఉండాలి. తెలంగాణలో సభ్యత్వాలు చేయించి ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయాలి. అందరి సహకారం, ప్రజా ప్రతినిధుల సహకారం అవసరం ఉన్నపుడు వాడుకోవాలి 

ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Image
  ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Hydrabad:  అక్క ను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన ముఖ్యమంత్రి... ఆయన వ్యాఖ్యలను సమర్ధించిన మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి (Dy CM) కంటతడి పెట్టిన సబిత తనను కావాలని రేవంత్ టార్గెట్ చేశాడని, కాంగ్రెస్ లోకి వచ్చినపుడు పెద్ద నాయకుడివి అవుతవని ప్రోత్సహించానని, కానీ రేవంత్ తనను ఇలా అవమానిస్తూ టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడని ఆవేధన వ్యక్తం చేసిన సబిత ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం.. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్టు. శాసన సభలో గం దరగోళ వాతావరణం..

మహిళలకు ఆషాఢమాసం కానుకలను ప్రకటించిన వామ్

Image
 మహిళలకు ఆషాఢమాసం కానుకలను ప్రకటించిన వామ్ హైద్రాబాద్:  ఆషాఢమాసంలో బట్టల షాప్ వారు, గోల్డ్ షాప్ వారు డిస్కౌంట్లు మరియు కానుకలు ప్రకటిస్తుంటారు. కానీ ఇక్కడ మెంబర్ షిప్ తీసుకుంటే చీరే ఫ్రీ.  వామ్ లో మెంబర్ షిప్ తీసుకుంటే మహిళలకు కానుకలను ప్రకటించింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ లో నూతనంగా మెంబర్షిప్ తీసుకున్న కపుల్స్ లో మహిళకు బర్ బరి శారీ కానుకగా ఇస్తున్నట్లు ghmc వామ్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ తెలిపారు. అంతే కాకుండా 6 కపుల్ మెంబర్షిప్ పంపిన వారికి కూడా ఒక బర్ బరి శారీ కానుకగా ఇవ్వనున్నట్లు అయన ప్రకటించారు. బలే ఉంది కదా కానుకల మెంబర్షిప్. 

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుంది - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి

Image
 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుంది - ఆర్యవైశ్య  సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి ఖమ్మం:  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుందని ఖమ్మం కు చెందిన ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి అభిప్రాయం వెలిబుచ్చారు . ఎన్నికల్లో కూడా మనవారు ఒక్కొక్కరు పార్టీలో ఉండి పార్టీల అండదండలతో వారు ఎన్నికల్లో గెలవాలని దానికి సంబంధించిన అంతవరకు నా ఉద్దేశం ప్రకారం పార్టీ ఏదైనా కానీ మనం ఎవర్నో ఒకరిని కచ్చితంగా మన అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి వస్తుంది. గెలుపు ఓటముల పరిస్థితి పక్కన పెడితే ఎవరు ఓడిన గెలిచిన వారు వారు స్థాయిలను మర్చిపోకుండా అందరూ కలిసికట్టుగా కులం కట్టుబాట్లు అనుకూలంగా పనిచేసే ఐక్యతను చాటి చెప్పేలా, ఎన్నికల కమిటీల్లో కూడా జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించి సజావుగా ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుందని తెలిపారు.

ఎలక్షన్లు జరపాలని ఉద్యమానికి పిలుపునిచ్చిన మిత్రులకు సూటి ప్రశ్న* - కోటగిరి చంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్టు

Image
  *ఎలక్షన్లు జరపాలని ఉద్యమానికి పిలుపునిచ్చిన మిత్రులకు సూటి ప్రశ్న* - కోటగిరి చంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్టు*  అయన సూటి ప్రశ్న ను ఈ క్రింద యధాతధంగా చదవండి ఆర్యవైశ్య సోదరులు వివిధ ప్రాంతాల నుండి ఎన్నికలు నిర్వహించాలని సమావేశమై వారు వారి వారి అభిప్రాయాలు తెలిపినారు, మహాసభ కార్యవర్గం మీటింగ్ కు పోయి వచ్చిన వారే మహాసభ ఎన్నికలు పెడతారని, ఎన్నికలు కమిటీ వేస్తారని చెప్పారు.  కానీ నేటి వరకు ప్రస్తుత రాష్ట్ర మహాసభ అధ్యక్షులు కానీ వారి కార్యవర్గము గాని అధికారికంగా చెప్పలేదు . మన ఆర్యవైశ్య పత్రికలకు గాని, సోషల్ మీడియా ద్వారా కానీ ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహిస్తాము అని ప్రకటించలేదు, ఇది అందరూ గమనించాలి. ఉద్యమం పిలుపునిచ్చిన మిత్రులకు చిన్న సూచన చేస్తున్న మహాసభ అధ్యక్షులు కానీ వారి కార్యవర్గము గాని అధికారికంగా ఎన్నికలు పెడుతమని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టీ ప్రకటింప చేయాలి

శ్రీ సరస్వతి శిశు మందిర్ కు ప్రింటర్ బహుకరణ

Image
 నల్గొండ పట్టణం రవీంద్ర నగర్ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ కి ఈరోజు సంజీవిని మెడికేర్ సొసైటీ సహకారంతో 23,500 రూపాయలు విలువ గల ప్రింటర్ పాఠశాలకు అందజేయడం జరిగింది. పాఠశాల యాజమాన్యం వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఆచార్యులు అనిత రెడ్డి, సమితి జనరల్ సెక్రటరీ పరమాత్మ, అకాడమిక్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రెటరీ సుధాకర్, సంజీవిని మెడికేర్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్, శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేస్తే అధ్యక్షుడు మారడు - సంఘం ముందు వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపట్టండి - గంగిశెట్టి రఘు సీనియర్ జర్నలిస్టు

Image
 వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేస్తే అధ్యక్షుడు మారడు - సంఘం ముందు వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపట్టండి - గంగిశెట్టి రఘు సీనియర్ జర్నలిస్టు గంగిశెట్టి రఘు సీనియర్ జర్నలిస్టు పోస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది ఈ  క్రింద  చదవండి యధాతధంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షుడి మార్పు కోసం అంటూ ఓ వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేసి అందులో ఓ 1000 మందిని ఆడ్ చేసిన అల్ప సంతోషులు.అరేయ్ బాబు వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేస్తే అధ్యక్షుడు మారడు....గ్రూపు లో పోస్టులు పెడితే సత్వరమే అతను కుర్చీ కాలీ చేసి వెళ్లడు.ముందు మీరు అప్డేట్ అవ్వండి ఇంకా మీ పాత ఆలోచనలు కాకపోతే అవును అలానే ఉంటాయి ఎందుకంటే అది మీ తప్పు కాదు మీ వయస్సు తప్పు అంతే.చదువుకుంటే తెలిసేది ఆ చదువు లేకపోతే ఇలానే ఉంటది.గ్రూపు క్రియేట్ చేసినంత మాత్రాన అతను ఆ గ్రూపుకు భయపడి ఆ పదవి నుండి దిగిపోతాడా? ఆ గ్రూపు లో ఆ సంఘం నాయకులను ఆడ్ చేయడమే కాకుండా అడ్మిన్ చేయడం హాస్యాస్పదం.10 సంవత్సరాల నుండి ఆ సంఘం నాయకులే అన్ని కింద పైన మూసుకొని కూర్చోని ఉంటే ఏదో తోపు గాళ్ల లెక్క మీకెందుకు బై ఈ వాట్స్ ఆప్ గ్రూపు లు.ఆన్ లైన్ పులులు కానీ ఆన్ రోడ్డులో మాత్రం

సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ కు సన్మానం

Image
సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ కు సన్మానం హైద్రాబాద్: (గూఢచారి)  ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ ఎడిటర్ నీలగిరి శంఖారావం, ns99channel ని శాలువాతో సత్కరించినారు. మరియు ఈ కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించకపోవడం పై మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల గురించి చర్చించారు..

అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి

Image
 అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి తిరుపతి: యువతులను గంజాయికి బానిసలు చేసి అశ్లీల చిత్రాలు తీస్తున్న కృష్ణకిషోర్ దంపతులు. పద్మావతి యూనివర్సిటీలో బీఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతికి గంజాయి అలవాటు చేసిన దంపతులు. తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. కృష్ణకిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించడమే కాకుండా వీడియోలు తీసిన మహిళ. బాధితురాలి అన్నకు, కాబోయే భర్తకు వీడియోలు, ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్. తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. భార్యాభర్తలను రిమాండ్‌కు తరలించిన పోలీసులు. గతంలోనూ ఓ యువతిని మోసం చేసి రూ.5 లక్షలు కాజేసినట్టు విచారణలో వెల్లడి.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం - ఉప్పల శ్రీనివాస్

Image
 ప్రపంచ వ్యాప్తంగా ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం. - TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం అని టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  అన్నారు. దుబాయ్ లో ఘనంగా అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ 11 వ వార్షకోత్సవ వేడుకలు Ramada Hotel Dhena లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ విభాగం ఇన్చార్జి రాజేష్ సోమా ముఖ్యఅతిథిగా అలాగే ప్రముఖ టెక్స్ట్ బిజినెస్ చంద్రశేఖర్ మరియు గోల్డ్ బిజినెస్ వ్యాపారస్తుడు కిషన్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా  మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ అన్ని రంగాల్లో రాణించాలి అని సమిష్ఠ కృషితో

*బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బ్యాగులు పంపిణీ*

Image
  *బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బ్యాగులు పంపిణీ* *కార్పోరేట్ స్కూల్ కి పోటిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తయారు చేయడమే మా లక్ష్యం.*  బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు  బుక్కా ఈశ్వరయ్య ...... రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ప్రైమరి మరియు హైస్కూల్ విద్యార్థుల కు కావలసిన సమాగ్రిని అన్ని వేళల అందిస్తున్న బుక్కా ఈశ్వరయ్య గారు ఈరోజు ప్రైమరి మరియు హైస్కూల్ విద్యార్థుకు బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది.*pvpm rao memorial పై pk మేహర్ (USA) గారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని ఈ వేదిక ద్వారా మేహర్ గారికి ధన్యవాదాలు తెలుపినారు*.   అనంతరం విద్యార్థుల ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ ప్రభుత్వం ఎంతో శ్రమకోర్చి అన్ని సదుపాయాలు కల్పిస్తున్న ఊరి విడచి ఇతర ప్రాంతంలో గల ప్రైవేట్ స్కుళ్ళకు పిల్లను తల్లిదండ్రులు పంపడం బాదాకరమని అన్ని వసతులు, మంచివిద్యా ఉన్నందున ఎవ్వరు కూడ ఊరు వదలి పోవద్దని ఉద్భోదిస్తూ, మా బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో మీకు కావలసిన స్టేషనరి, ఆటవస్తువులు , బోజన పళ్ళాలు, గ్లాసులు, గతంలో అందించానని, ఇప్పుడు బ్యాగులు కూడ ఇస్తున్

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన వివరాలు

Image
  ఈ రోజు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.  *పర్యటన వివరాలు* ▪️ఉదయం గం. 10.00 నుండి *నల్గొండ పట్టణంలోని గౌరవ మంత్రిగారి నివాసంలో .  ▪️ఉ. గం. 11.30 నిమిషాలకు *దోనకల్ గ్రామంలో 33/11 కె.వి. సబ్ స్టేషన్* కార్యక్రమంలో పాల్గొంటారు.  ▪️మధ్యాహ్నం గం. 01.00 కు నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న *ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణాన్ని పరిశీలిస్తారు, అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు*.  ▪️మధ్యాహ్నం గం. 03.00 లకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని *మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు*.   ▪️అనంతరం సాయంత్రం గం. 05.00 లకు నల్గొండ నుంచి హైదరాబాద్  బయలుదేరుతారు.

ఎసిబి వలలో ఎస్ఐ మరియు సబ్ రిజిస్ట్రార్

Image
  ఎసిబి వలలో ఎస్ఐ మరియు సబ్ రిజిస్ట్రార్ –రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కొత్తగూడెం ఎస్ఐ, పరకాలలో సబ్ రిజిస్ట్రార్  (గూఢచారి):   హైదరాబాద్: తెలం గాణలో అవినీతి నిరోధక శాఖ (acb) అధికారుల ఆయా వేర్వేరు ప్రాం తాల్లో వేసిన వలలో ఇద్దరు అధి కారులు (officers) చిక్కారు. ఈ రెండు వేర్వేరు సంఘటనల్లో కూడా ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం గమనా ర్హం. *కొత్తగూడెంలో ఎస్ఐ…*… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అవినీతి ఎస్ఐ (si) ఏసీబీకి చిక్కా డు. పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రా ము ఓ కేసులో నిందితుడికి సాయం చేసేందుకు న్యాయవాది నుంచి రూ.20 వేలు లంచం డి మాండ్ చేశాడు. అయితే ఈ కేసును వాది స్తున్న న్యాయవాది ( advocate) లక్ష్మారెడ్డి ఏసీ బీకి ఫిర్యాదు చే యడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఎస్ఐ రాములు 20 వేలు లం చం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏసీబీ వ‌ల‌లో పరకాల సబ్ రిజిస్ట్రార్*..వరంగల్ జిల్లా పరకాల సబ్ రిజి స్ట్రార్ ( sub registrar) కందాల సునీత ఇద్దరు అన్న దమ్ముల సేల్ & గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.80 వేలు లంచం డి మాండ్ చేసింది. అయితే వారు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సునీ త లంచం తీసుకుంటుండగ

గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యతలేని వైర్లను అమ్ముతున్న ...

Image
 నల్గొండ : బ్రేకింగ్... ప్రకాశం బజార్ లోని పలు దుకాణాల్లో బయటపడ్డ నిర్వహకుల ఘరానా మోసం.... పలు దుకాణాలపై కాపీ రైట్స్ అధికారుల తనిఖీలు... హనుమాన్ ఎలక్ట్రిక్ షాప్ లో గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యతలేని వైర్లను అమ్ముతున్న నిర్వాహకులు... రూ 22 లక్షల విలువ గల 16 వైర్ బ్యాగులు స్వాధీనం.. పద్మావతి కిరాణం షాపులో రూ 1.70 లక్షల విలువ గల కల్తీ మస్కిటో అగరబత్తులు స్వాధీనం... పలు దుకాణాలపై కొనసాగుతున్న దాడులు...

BHUPATHI TIMES 24th July 2024 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Image
 

బదిలీల్లో అన్యాయం జరిగిందని కలెక్టర్ కు మొరపెట్టుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగి

Image
  బదిలీల్లో అన్యాయం జరిగిందని కలెక్టర్ కు మొరపెట్టుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగి నల్గొండ:  ఉమ్మడి నల్గొండ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ జూనియర్ అసిస్టెంట్ బదిలీల్లో నిభందనలు పాటించలేదని దీంతో నాకు అన్యాయం జరిగిందని జిల్లా కలెక్టర్ కు మొరపెట్టు కున్న ఓ మహిళా ఉద్యోగి. మాకు మౌఖికంగా సంప్రదింపులు జరపలేదని, ఫార్మెట్ లో అప్లికేషన్ తీసుకున్నారని తాను పెట్టు కున్న ఆప్షన్ ప్రాంతాలలో నాకు పోస్టింగ్ ఇవ్వలేదని, తాను చిన్న పిల్లల తల్లి గా, కొత్త పోస్టింగ్ స్థలానికి పెరిగిన దూరాన్ని నిర్వహించడం నాకు అత్యంత కష్టం అని ఈ బదిలీ నా మరియు నా కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తిగత మరియు ఆర్థిక సవాళ్లను కలిగించిందినీ, నేను సీనియారిటీ లిస్టు లో కూడా ముందు ఉన్నానని, నాకు అన్యాయం జరిగిందని బదిలీల నిర్ణయాలపై సమీక్ష నిర్వహించాలని ఆమె అభ్యర్థించారు. మానవతా దృక్పథంతో మహిళ అని చూసి తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్ ను కోరింది. ఆమె విజ్ఞాపన పై కలెక్టర్ స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్త్రార్ ను ఆదేశించినట్లు తెలిసింది.

*స్పీకర్ ఛాంబర్ లో ప్రారంభమైన బీఏసీ సమావేశం.*

Image
 *స్పీకర్ ఛాంబర్ లో ప్రారంభమైన బీఏసీ సమావేశం.* హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు, బీఆర్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనమానేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల.

స్మితా సబర్వాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల

Image
  స్మితా సబర్వాల్ పై నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు*   *మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఓ అధికారిగా ఉండి.. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు* *స్మితా సబర్వాల్  ఓ దివ్యాంగులకి జన్మనిచ్చి ఉంటే వారి కష్టాలు ఏంటో ఆమెకు తెలిసేవని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు*  *దివ్యాంగులను అవహేళన చేసి.. వారి మనో ధైర్యాన్ని దెబ్బతినేలా కుట్ర చేస్తున్న స్మితా సబర్వాల్ .. మెంటల్ గా అన్ ఫిట్ అని.. IAS గా పనికి రాదని.. వెంటనే ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆయన కోరారు* *ఎన్నో ఆటుపోట్లను కష్టనష్టాలను ఎదుర్కొని బాలలత లాంటి ఓ దివ్యాంగ మహిళ IAS కాగలిగారని.. తనతో పాటే ఎంతోమందిని IASలుగా తయారు చేసేందుకు IAS అకాడమీ ద్వారా ఎంతోకృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.* *బాలలత గారి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి దివ్యాంగులనే హేళన చేయడం సరి కాదన్నారు.* *ప్రపంచమే గర్వించదగ్గ ఎంతోమంది దివ్యాంగులు ఉన్నారని, అటువంటి వారిని అవమానించడం సరికాదని ఆయన హితువు పలికారు.*

బడ్జెట్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరిన చైర్ పర్సన్ సుజాత.

Image
 బడ్జెట్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరిన చైర్ పర్సన్ సుజాత.. హైద్రాబాద్ , (గూఢచారి ప్రతినిధి) :  ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ను కలిసిన రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత.. ఆర్య వైశ్య కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తగిన విదంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేసిన చైర్ పర్సన్ సుజాత.

సెప్టెంబర్ 1న కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు

Image
  సెప్టెంబర్ 1న కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు హైద్రాబాద్ : (గూఢచారి ప్రతినిధి) శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు సెప్టెంబర్ 1న హైద్రాబాద్ లకడికపూల్ వాసవి సేవా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీమతి మంజులత వర్మ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ ఎన్నికల్లో అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లు ఏడుగురు, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి ముగ్గురు కర్ణాటక నుండి ఇద్దరు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒకరు) సెక్రటరీలు ఏడుగురు, (ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ముగ్గురు కర్ణాటక నుండి ఇద్దరు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒకరు), అడ్వైజర్లు 19 మంది కి (ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి 13 మంది కర్ణాటక నుండి నాలుగు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒక్కరు) ఎన్నికలు నిర్వహించబడతాయి. ఆగస్టు 10 న నామినేషన్ పత్రాలు ఇస్తారు, ఆగస్టు 16, 17 తేదీల్లో ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 18వ తేదీ స్

*ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వాఖ్యలను తీవ్రంగా ఖండించిన బాలలత*

Image
 *ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వాఖ్యలను తీవ్రంగా ఖండించిన బాలలత* హైద్రాబాద్:   ( గూఢచారి ప్రతినిధి):  *బాలలత, మాజీ బ్యూరోక్రాట్*  *స్మిత సబర్వాల్ కి మాజీ బ్యూరోక్రాట్ సవాల్* తనతో సివిల్స్ పరీక్షకు రాయడానికి స్మిత సిద్ధమా అంటూ సవాల్ విసిరిన బాలలత ఆమె మాటల్లో... తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని స్మితకి సవాల్ విసిరిన బాలలత స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోంది స్మిత సబర్వాల్ మాటలు దురదృష్టకరం అసలు దివ్యంగులం బ్రతకాలా వద్దా? మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా? వద్దా? పని ఉన్నోళ్ళు పని చేస్తారు. ట్వీట్ లు పెడుతూ ఉండరు స్మిత సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేదు. అసలు స్మిత సబర్వాల్ అర్హత ఎంటి? స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా? తెలంగాణ ప్రభుత్వ విధానమా? స్మిత తన సర్వీసులో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్ లో పరుగెత్తుతూ పని చేసిందో చెప్పాలి స్మిత ట్వీట్ తాను దివ్యంగుల పట్ల వివక్షతను చూపుతోంది ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి రెండు కాళ్ళు పనిచేయవు. కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చ

రామ్ లక్ష్మణ్ రైస్ మిల్లు తనిఖీ చేసిన ఆర్డీవో

Image
 రామ్ లక్ష్మణ్ రైస్ మిల్లు తనిఖీ చేసిన ఆర్డీవో నల్గొండ, ( గూఢచారి ప్రతినిధి) వేలం వడ్లు lifiting కొరకు రాష్ట్రం అంతా  పాడి వెరిఫికేషన్ చేయిస్తున్నా సందర్భంగా నల్గొండ టౌన్ మరియు మండలంలో గల రామ్ లక్ష్మణ్ రైస్ మిల్లును తహశీల్దార్, RI CS మరియు TA తో కలిసి RDO , DSO & DM CS లు తనిఖీ చేసారు.

తాండూరు లో దొంగ నోట్లు

Image
 తాండూరు లో దొంగ నోట్లు

పీపుల్స్ ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్ గా నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Image
  పీపుల్స్ ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్ గా నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి నల్గొండ:  నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పీపుల్స్ ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్ గా ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలు సక్రమంగా అందేలా పలు చర్యలు తీసుకుంటున్నారు. గతం లో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ భాద్యతలు నిర్వహించడం తో జిల్లాపై పూర్తి అవగాహన ఉంది. అయన జిల్లా కలెక్టర్ గా భాద్యతలు సేకరించిన నాటి నుండి ప్రజల సమస్యల పై స్పందించడం, ప్రజలకు సేవలందించే పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ లు చేస్తూ అధికారులను , ఉద్యోగులను ప్రజలకు సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు.   గత కొన్ని రోజుల క్రింద నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు చర్యలు తీసుకోవడం మే కాకుండా మొత్తం ఆసుపత్రి సేవలు ప్రజలకు సక్రమంగా అనేందుకు జిల్లా యంత్రాంగాన్ని పర్యవేక్షించే విధంగా డ్యూటీలు వేశారు.   జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లోని వివిధ కార్యాలయాలను ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైరాజరవుతున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తున్నారు.  శుక్రవారం హా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

Image
  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్ హైద్రాబాద్:  (గూఢచారి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు నిర్వహించుటకు అమరవాది అంగీకరించి కార్యవర్గ సమావేశంలో తీర్మానించి నట్లు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్ష మార్పు కొరకు కర్మన్ ఘాట్ వేడుక కన్వెన్షన్ లో జరిగిన సమావేశం లో శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ మీటింగ్ లో మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు అమరవాది అంగీకరించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించి నట్లు శ్యామ్ సుందర్ తెలిపారు. రెండు, మూడు నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అయన అన్నారు. ఈ సమావేశం లో మలిపెద్ది శంకర్, కాచం సత్యనారాయణ, ప్రేమ్ గాంధీ,  మొగుళ్లపల్లి ఉపేందర్, యాదా నాగేశ్వర రావు,  మోటూరి శ్రీకాంత్, బొడ్ల మల్లిఖార్జున్, అర్థం శ్రీనివాస్, వందనపు వేణు, పుల్లూరు సత్యనారాయణ, బాలరాజు,  కొండూరు గణేష్, కొండూరు రాజేశ్వరి మరియు పలు జిల్లాల నుండి సుమారు 300 మంది పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో తేలుకుంట్ల శ్రీనివాస్

Image
 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  లను కలసిన తేలుకుంట్ల శ్రీనివాస్. చిత్రం లో మునిసిపల్ ఛైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్స్ నాయకులు గుమ్మల మోహనరెడ్డి వున్నారు.

తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్ష మార్పు కొరకు నిర్వహిస్తున్న సమావేశానికి తెలంగాణ వివిధ జిల్లాల నుండి ఆర్యవైశ్యుల రాక ప్రారంభం

Image
 తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్ష మార్పు కొరకు  నిర్వహిస్తున్న సమావేశానికి వేడుక కన్వెన్షన్ కు తెలంగాణ వివిధ జిల్లాల నుండి ఆర్యవైశ్యుల రాక ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర మహాసభ కార్యవర్గ సమావేశానికి పాల్గొన డానికి ఎన్ విలేజి రెస్టారెంట్ కు విచ్చేసిన ఊరే లక్ష్మణ్, ఆగీర్ వెంకటేష్ లు

Image
  తెలంగాణ  రాష్ట్ర మహాసభ కార్యవర్గ సమావేశానికి పాల్గొన డానికి ఎన్ విలేజి రెస్టారెంట్ కు విచ్చేసిన ఊరే లక్ష్మణ్, ఆగీర్ వెంకటేష్ లు

District Fisheries Officer in ACB Net.

Image
District Fisheries Officer, Suryapet in ACB Net. On 03.07.2024, the Accused Officer (A.O.) Sri. Thakoor Roopender Singh, District Fisheries Officer, Suryapet caught red handed when he demanded bribe amount of Rs.25,000/- from the complainant Sri Saragandla Kotaiah, Fisherman-cum-President of Fishermen's Co- Operative Society, Suryapet and accepted from accompanying witness Sri. Endla Suresh, Fisherman-cum-Treasurer of Fishermen's Co- Operative Society, Suryapet to do an official favour i.e. "to issue Fishing Rights Document to their society for fishing". Tainted bribe amount was recovered from the possession of the A.O. Both hand fingers of A.O which came into contact with tainted bribe amount yielded positive result in chemical test. The A.O. performed his duty improperly and dishonestly to obtain undue advantage. Earlier A.O. was trapped by the ACB Officials in the year 2016. Therefore, A.O. is being arrested and produced before the Hon'ble Ist Addl. Special Jud

సీనియర్ అసిస్టెంట్ ఎస్.సురేందర్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

Image
నల్గొండ: 19 జులై ( గూఢచారి)     ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకుగాను   హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్.సురేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు విద్య వైద్య రంగాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని,విధుల పట్ల  ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.       శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా హలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.        ముందుగా ఆయన హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని సిబ్బంది  హాజరు రిజిస్టర్, ఇతర రిజిస్టర్లు, వార్డు ,ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ ను జిల్లా కలెక్టర్ విధుల నుండి సస్పెండ్ చేశారు.        ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారితో పాటు  ఉప ఆరోగ్య కేంద్రాల ఇన్చార్జిలతో ఆయన సమావేశం నిర్వహించారు.      ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య  కేంద్రాలకు ప్రతిరోజు వస్తున్న

సోషలో మీడియాలో నిరసనల హోరు - తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరపాలని ఊపందుకున్న ఉద్యమం

Image
 సోషలో మీడియాలో నిరసనల హోరు - తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరపాలని ఊపందుకున్న ఉద్యమం  హైద్రాబాద్:  దాదాపు 9 సంవత్సరముల నుండి ఎన్నిక కాకుండా, ఓ 10 మంది తో సొసైటీ ఏర్పాటు చేసుకొని, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నాయకులతో నాదే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అంటూ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న, అక్రమంగా మహాసభ బిల్డింగ్ లో తిష్టవేసిన వారిని సాగనంపడానికి ఉద్యమం ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైశ్య నాయకులు గళం వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కు ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాలంటూ కార్యక్రమం రూపొందించుకున్నారు. అప్రజాస్వామికంగా ఉన్న వారు కర్మంగట్ లో నిర్వహించ దలుచుకున్న సమావేశం దగ్గరకు భారీగా సంఖ్యలో వైశ్యులు తరలివచ్చి ఎన్నికలు నిర్వహించే విధంగా డిమాండ్ చేయాలని, జిల్లా అధ్యక్షుల చప్పట్లతో మరోసారి అధ్యక్ష పదివి కాలాన్ని పొడిగించుకోకుండ ఉద్యమం చేయాలని నిర్ణయించి భారీగా హాజరు కావాలని పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్ర మహాసభ ఎన్నికల తో పాటు ప్రభుత్వం ఉప్పల్ భాగాయత్ లో కేటాయించిన 5 ఎకరాల స్థలం ట్రస్టు పేరుతో కొంత మంది చేతుల్లోకి పోకుండా ఉండాలని సోషల్ మీడ

ఒకేసారి 31 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిన రాష్ట్రం దేశంలో ఏదీ లేదు -:రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .

Image
           ఒకేసారి 31 వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిన రాష్ట్రం దేశంలో ఏదీ లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.        రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల లోపు బ్యాంకు రుణాలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో మొదటి విడత లక్ష రూపాయల లోపు రుణాల నిధుల విడుదల సందర్బంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు వేదికలో నిధుల విడుదల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఎం ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.       ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి ఆయా జిల్లాల లోని రైతులతో రుణమాఫీపై ముఖాముఖి మాట్లాడారు. నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలానికి చెందిన రాజు అనే రైతుతో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ పై మాట్లాడారు       ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప

శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం

Image
 శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం శ్రీశైలంలో చిరుత సంచారం పాతాళగంగా పాత మెట్ల మార్గంలో సంచారం.  డివైడర్‌పై చాలా సేపు కూర్చొని.తర్వాత అటవీ ప్రాంతంలోకి వెళ్లిన చిరుత పులి గతంలోనూ అదే ప్రాంతంలో సంచారం. , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన