Posts

Showing posts from September, 2024

ఎం ఈ ఓ కత్తుల రవీందర్ కు ఘనంగా సన్మానం

Image
 ఎం ఈ ఓ కత్తుల రవీందర్ కు ఘనంగా సన్మానం మునుగోడు,    మునుగోడు మండల నూతన ఎంఈఓ గా నియామకమైన కత్తుల రవీందర్ ను మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది స్థానిక మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మరియు ఎంఈఓ గా నియమితులు కావడంతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్, జిల్లా నాయకులు దుబ్బ విజయభాస్కర్, మండల అధ్యక్షులు మేడి అశోక్, స్థానిక ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పందుల మల్లేష్, మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్ ,కురుపాటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించండి - ఆర్యవైశ్య ఐక్యవేదిక

Image
  ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించండి - ఆర్యవైశ్య ఐక్యవేదిక నల్గొండ, (గూఢచారి ప్రతినిధి) 30-09-2024:   ఆర్యవైశ్య ఐక్యవేదిక ఆద్వర్యం లో ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధులు కేటాయించాలని కోరుతూ నల్లగొండ జిల్లా కలెక్టర్ కు సోమవారం కలెక్టరేట్ లో వినతి ప్రత్రం ఇచ్చారు.   ఆ వినతి పత్రం లో ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించడం ద్వారా పేద ఆర్యవైశ్య కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా, పేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కార్పొరేషన్ పనిచేసేలా ఆర్ధిక వనరులు సమకూర్చాల్సిందిగా కోరారు. దీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల డిమాండ్ను గౌరవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయడాన్ని ఆర్యవైశ్యులంతా స్వాగతిస్తున్నామని, అయితే ఇదే క్రమంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానికి ఎలాంటి నిధులు కేటాయింపు చేయకపోవడం వల్ల నిరుపయోగంగా మారిన పరిస్థితి ఏర్పడిందని,  కేవలం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు మాత్రమే చేసి ఆ కార్పొరేషను నిధుల కేటాయింపు చేయక పోవడం వల్ల కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఆర్యవైశ్యులకు, చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఆర్యవైశ్య కుటుం

మా ఇళ్లు కూల్చొద్దని నిరసన తెలియజేస్తున్న చిన్నారులు.

Image
 హైదరాబాద్ హైదర్‌షాకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇళ్లు కూల్చొద్దని ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న చిన్నారులు.  'మేము రోడ్డుపై పడతాం, మా ఇళ్లు కూల్చొద్దు' అంటూ వేడుకుంటున్నారు.

Bhupathi-Times-e-paper-29-09-2024

Image
 Bhupathi-Times-e-paper-29-09-2024

RTI ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్ల ను నియ‌మించాల‌ని ముఖ్యమంత్రిని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ లేఖ

Image
 RTI ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్లు ను నియ‌మించాల‌ని ముఖ్యమంత్రికి  బహిరంగ లేఖ విడుదల చేసిన ఫోరం ఫర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్  లేఖ యధాతధంగా చదవండి. గౌ// ముఖ్య‌మంత్రి గారిని కోరుతుంది.  హైద‌రాబాదు L. No. FGG/CM/REP/ /2024 28-9-2024 గౌ// ముఖ్య‌మంత్రి గారు తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాదు అయ్యా ! స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం సెక్ష‌న్ 15 (1) ప్ర‌కారం ప్ర‌తి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన స‌మాచార క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్ల నియామ‌కం జ‌ర‌పాలి. ప్ర‌భుత్వ యంత్రాంగం స‌మాచారం ఇవ్వ‌ని ప‌క్షంలో క‌మీష‌న్ వారు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన అప్పీళ్ళ‌ను విచారించి కోరిన స‌మాచారం ఇప్పిస్తుంది. ప్ర‌ధాన స‌మాచార క‌మీష‌న‌ర్ మ‌రియు క‌మీష‌న‌ర్లు ప్ర‌జా జీవ‌నంలో సుప్ర‌సిద్ధులై ఉండాలి. వారికి విశాల‌మైన విష‌య‌ప‌రిజ్క్షానం, చ‌ట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ‌, మేనేజ్‌మెంట్‌, జ‌ర్న‌లిజం, ప్ర‌సార మాధ్య‌మాలు, కార్య‌నిర్వ‌హ‌ణ‌, ప‌రిపాల‌న‌లో అనుభ‌వ‌ముండాల‌ని సెక్ష‌న్ 15 (5) నిర్థేశిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌ధాన క‌మీష‌న‌ర్ గారు తేది 24-8-2020 న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌గా మిగిలిన ఐదుగురు క‌మ

Bhupathi-Times-e-paper-28-09-2024

Image
 Bhupathi-Times-e-paper-28-09-2024

ఓపీఎస్ అమలు కోరుతూ 'పెన్షన్ ఆక్రోశ్ మార్చ్'

Image
బీమా భవన్లో లో నిరసన తెలుపుతున్న స్థితప్రజ్ఞ, ఉద్యోగులు  ఓపీఎస్ అమలు కోరుతూ 'పెన్షన్ ఆక్రోశ్ మార్చ్' • ఎన్ఎం ఓపీఎస్ ఆధ్వర్యంలో నిరసనలు   హైదరాబాద్, (గూఢచారి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఏకీకృత పెన్షన్ విధానాన్ని(యూపీఎస్) వ్యతిరే కిస్తూ నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్ఎం ఓపీఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 'పెన్షన్ ఆక్రోశ్ మార్చ్' పేరిట గురువారం ప్రభుత్వ ఉద్యో గులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి.. విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బొగ్గులకుంటలోని బీమా భవ న్లో ఎన్ఎం ఓపీఎస్ సెక్రటరీ జనరల్ గంగాపురం స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ.. ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ సామాజిక భద్రత ఇవ్వాల్సిన ప్రభుత్వమే.. పెన్షన్ కొను క్కునేలా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసన కార్యక్రమాల్లో సీపీఎస్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేశ్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు

*ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆటో డ్రైవర్లకు వినూత్నంగా గులాబీ పూల పంపిణీ*

Image
*ఆటో డ్రైవర్ లంతా ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి* *నిర్లక్ష్యంగా ఆటోలు నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు* *ఆటో డ్రైవర్లతో నూతన ట్రాఫిక్ సిఐ రాజు అవగాహన సమావేశం* *ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆటో డ్రైవర్లకు వినూత్నంగా గులాబీ పూల పంపిణీ* ************************************************** *నల్లగొండ*: *ఆటో డ్రైవర్లంతా ఆటోలు నడిపే సమయంలో తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నూతన ట్రాఫిక్ సిఐ డి.రాజు అన్నారు* శుక్రవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ట్రాఫిక్ సిఐ రాజు ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వినూత్నంగా ఆటో డ్రైవర్లకు గులాబీ పూలను అందజేశారు.  ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలన్నారు.  అదేవిధంగా తప్పకుండా లైసెన్సులు, ఇన్సూరెన్స్ తీసుకోవాలని, డ్రెస్ కోడ్ పాటించాలని అన్నారు. తాగి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని తెలిపారు. ఆటో రిజిస్ట్రేషన్ న

Bhupathi-Times-e-paper-27-09-2024

Image
 Bhupathi-Times-e-paper-27-09-2024

ఓపీఎస్‌ అమలుపై PCC అధ్యక్షునికి సీపీఎస్‌ ఉద్యోగుల వినతి

Image
  తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడును శాలవాతో సత్కరించి వినతి పత్రాన్ని అందజేస్తున్న రాష్ట్ర సీపీఎస్‌ ఉద్యోగుల నాయకులు జి. స్థితప్రజ్ఞ , కల్వల్‌ శ్రీకాంత్‌ తదితరులు ఓపీఎస్‌ అమలుపై PCC అధ్యక్షునికి సీపీఎస్‌ ఉద్యోగుల  వినతి హైదరాబాద్‌, (గూఢచారి): పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన యూపీఎస్‌ విధానాన్ని వ్యతిరేకించాలని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్‌కుమార్‌ గౌడ్‌కు తెలంగాణ రాష్ట్ర కాంట్రి బ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌ విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్వల్‌   శ్రీకాంత్‌ మంగళవారం మహేష్‌కుమార్‌ గౌడ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్మిని కలిసినప్పుడు తమ డిమాండ్లను గూర్చివివరించాలని కోరారు. అనంతరం రాష్ర్యలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటులో సీపీఎస్‌ ఉద్యోగుల మద్దతును గుర్తుచేశారు. రాష్ట్రంలో సీపీఎస్‌ విధానాన్నిరద్దుచేయడం వల్ల ప్రభుత్వానికి సమకూరే ఆదాయాన్ని గూర్చి వివరించారు.ఈ సందర్భంగా వారు టీపీసీసీ చీఫ్‌ను శాలువతో సన్మానం చేశారు. టీప

BhupathiTimes-epaper-26-09-2024

Image
 BhupathiTimes-epaper-26-09-2024

వానకాలం ధాన్యం కొనుగోలుకు మిల్డర్లు సిద్ధం కావాలి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్.

Image
         ఈ సంవత్సరం వానకాలం ధాన్యం కొనుగోలుకు మిల్డర్లు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు.        బుధవారం అయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో వానాకాలం ధాన్యం కొనుగోలు, కష్టం మిల్లింగ్ రైస్( సీఎంఆర్) పై సమీక్ష నిర్వహించారు.          నల్గొండ జిల్లాలో కష్టం మిల్లింగ్ రైస్ ఇప్పటివరకు 90% పూర్తయిందని, తక్కిన 10 శాతాన్ని ఈ వారం రోజులలో పూర్తి చేయాలని, లేనట్లయితే పూర్తి చేయని వారిని డిఫాల్టర్లు గా గుర్తించి వచ్చే సీజన్లో దాన్యం కేటాయింపు చేయడం జరగదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సిఎంఆర్ 70% ఉండగా,నల్గొండ జిల్లాలో 90% సీఎంఆర్ ను పూర్తి చేయడం జరిగింది.       రానున్న సీజన్లో సన్నధాన్యం సైతం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు సిద్ధం కావాలని ఆయన అన్నారు. దాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా, అక్రమాలకు పాల్పడకుండా కొనుగోలు చేయాలని ,రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆయన చెప్పారు.        జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్ ,నల్గొండ రైస్ మిల్లర్ల జిల్లా సంఘం అధ్యక్షులు నారాయణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, ఎన్ఫో

ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు పోటెత్తుతున్న జర్నలిస్టులు

Image
 ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు పోటెత్తుతున్న జర్నలిస్టులు  - మూడోరోజు ఉత్సాహంగా సాగిన సభ్యత్వాలు  - సభ్యత్వాలు స్వీకరించిన సీనియర్ జర్నలిస్టులు, చిన్న పత్రికల ఎడిటర్లు నల్గొండ, (గూఢచారి): 25-09-2024 నల్లగొండ ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులతో పాటు చిన్న పత్రికల ఎడిటర్లు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నారు. సభ్యత్వాల సేకరణ మూడవ రోజు బుధవారం పెద్ద ఎత్తున సీనియర్ జర్నలిస్టులు చిన్న పత్రికల ఎడిటర్లు సభ్యత్వాలను స్వీకరించారు. నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్ లు జర్నలిస్టులకు సభ్యత్వలను అందజేసి మాట్లాడారు. చిన్న పత్రిక ఎడిటర్లు 30 మంది ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. చిన్న పత్రిక ఎడిటర్లు ప్రెస్ క్లబ్ లో చేరడం ప్రెస్ క్లబ్ కు ఎంతో బలం చేకూర్చినట్లుగా భావిస్తున్నామన్నారు. యూనియన్లకు ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అందరూ కలిసి రావాలని కోరారు. సోమవారం ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు ప్రారంభించుకున్నామని బుధవారం నాటికి మూడవరోజు కొనసాగుతుందని నేటికీ 130 మంది వరకు సభ్యత్వం తీసుకున్నారన్న

నల్లగొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం… ఎంపీడీవో సస్పెన్షన్, కార్యదర్శి భర్తరఫ్

Image
నల్లగొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం… ఎంపీడీవో సస్పెన్షన్, కార్యదర్శి భర్తరఫ్ –గ్రామపంచాయతీలకు గడ్డి కోత యంత్రాలను కొనుగోలులో నిర్లక్యం –మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, కంపోస్ట్ షెడ్ నిర్వహణ పట్ల నిర్ల క్ష్యం పర్యవసానం –గుర్రంపోడు ఎంపీడీవో పి. మం జుల సస్పెన్షన్ –పెద్దవూర మండలం, పులిచెర్ల గ్రామపంచాయతీ కార్యదర్శి కే. నాగరాజు ఉద్యోగం నుండి తొల గింపు –దామరచర్ల మండలం,వాచ్య తాండ జూనియర్ గ్రామపంచా యతీ కార్యదర్శి కె.స్వప్నను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి నల్గొండ,(గూఢచారి): పారిశుధ్య కార్యక్రమాలలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలకు (grama panchayats) గడ్డి కోత యం త్రాలను కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ 37 గ్రామపం చా యతీలకు గాను కేవలం 10 గ్రామపంచాయతీలకు మాత్రమే గడ్డి కోత యంత్రాలను( Grass cutting machines) కొనుగోలు చేసి 27 గ్రామపంచాయతీలకు కొను గోలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం, అలాగే మొక్కల పెంపకం, కంపోస్ట్ షెడ్, పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి కారణాలవల్ల నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండల ఎంపీడీవో ( mpdo) మంజు లను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ( collector Nar

Bhupathi-Times-e-paper-25-09-2024

Image
 Bhupathi-Times-e-paper-25-09-2024

యూట్యూబ్స్ కు బ్రాడ్ కాస్టింగ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Image
 *యూట్యూబ్స్ కు బ్రాడ్ కాస్టింగ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి*  *మీడియా అకాడమీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల అభిప్రాయం  హైదరాబాద్:సెప్టెంబర్ 23 యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ, తదితరాలకు, నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై, తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్ టూరిజం ప్లాజా లో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ చానెల్స్ నిర్వాహకులు పలు సూచనలు చేశారు.రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 50 మంది సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులు,యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులు వాటి వ్యవస్థాపకులు హాజరయ్యారు. పత్రికలకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్, టీవీ చానల్స్ కు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గుర్తింపు, కంపెనీ ఆక్ట్ కింద నమోదు కావటం యూట్యూబ్ న్యూస్ చానెల్స్ కి కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. న్యూస్ వెబ్సైట్లకి కూడా అలాంటి నియమనిబంధనలే ఉన్నాయన్నది గుర్తు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపుకు అనుసరించాల్సిన అంశాల పై ఈ కార్యక్రమంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వం పరిధి

మంత్రి ఒక‌రు టెండ‌ర్ల వ్య‌వ‌హారంలో త‌ల‌దూర్చ‌డం తగదని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ కార్య‌ద‌ర్శి ముఖ్యమంత్రికి లేఖ

Image
   మంత్రి ఒక‌రు  టెండ‌ర్ల వ్య‌వ‌హారంలో త‌ల‌దూర్చ‌డం తగదని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ కార్య‌ద‌ర్శి  ముఖ్యమంత్రికి లేఖ యధాతధంగా ప్రచురిస్తున్నాం చదవండి హైద‌రాబాదు L. No. FGG/CM/REP/            /2024                        21-9-2024 గౌ//  ముఖ్య‌మంత్రి గారు తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాదు అయ్యా ! గ‌త ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ ప్ర‌తి స‌మావేశంలో ప్ర‌జ‌ల‌నుద్దేశించి సోయిలో ఉండాల‌ని హిత‌వు ప‌లికి, తానే సోయి త‌ప్పి ధ‌నిక రాష్ట్రమ‌ని చెప్పుకొని రెండుసార్లు ప‌ద‌విని పొంది దాదాపు రూ// 7 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  ప్ర‌స్థుత‌ము మీ ప్ర‌భుత్వ‌ము ముందుకు వెళ్ళ‌లేని ప‌రిస్థితి.  పాత ప‌నుల బ‌కాయిలు ఇవ్వ‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు. గ‌త బి.ఆర్‌.ఎస్‌. పాల‌కుల పాల‌న‌ను ప్ర‌జ‌లు విసిగెత్తి వ్య‌తిరేకించి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో మీరిచ్చిన హామీల‌కంటే తెలంగాణ‌ను ఇచ్చిన పార్టీగా గుర్తించి గ‌త ప్ర‌భుత్వ‌ము యొక్క అవినీతి పాల‌న‌ను ధిక్క‌రించి మీ స‌మ‌ర్థ‌తను ఎరిగి మీ  ప్ర‌భుత్వాన్ని ఎన్నుకున్నార‌న్న సంగ‌తి మ‌ర‌వ‌ద్దు. గ‌త బి.ఆర్‌.ఎస్‌. ప్ర‌భుత్వ‌ము పెద్ద అప్పులు తెచ్చి భారీ అవినీతికి

మట్టి దొంగలు

Image
 నల్లగొండ పట్టణంలో రిజిస్ట్రేషన్ ఆఫీసు complex షాప్ ల ముందు మట్టిని దొంగతనం చేస్తున్నారని, ఈరోజు నుండి షాప్ ల ముందు దొంగతనం జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. .చదువు కున్న గాడిదలు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోందని, పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్త... అని సోషల్ మీడియా లో పోస్టు వైరల్ అవుతుంది  

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టు శ్రీరాములు పేరునే కొనసాగించాలి* *-తెలంగాణ అవోపా*

Image
 *తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టు శ్రీరాములు పేరునే కొనసాగించాలి* *-తెలంగాణ అవోపా* స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాక తెలుగు ప్రజల కోసం తన ప్రాణాలు విడిచిన పొట్టి శ్రీరాములు పేరుని తెలుగు యూనివర్సిటీకి కొనసాగించాలని తెలంగాణ ఆర్యవైశ్య ఆఫీసర్స్ ప్రొఫెషనల్స్ కోరారు. సోమదిగుడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మనవరాలు రేవతి మాట్లాడారు. రేవతి‌... పొట్టి శ్రీరాములు మనవరాలు...*

పొట్టి శ్రీరాములు విశ్వావిద్యాలయం పేరు మార్పు విరమించుకోవాలి - ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
 పొట్టి శ్రీరాములు విశ్వావిద్యాలయం పేరు మార్పు విరమించుకోవాలి - ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త హైద్రాబాద్:  క్యాబినెట్ సమావేశం లో తీసుకున్న పొట్టి శ్రీరాములు విశ్వావిద్యాలయం పేరు మార్చి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టడం పై ప్రభుత్వo తీసుకున్న నిర్ణయం మార్చుకోవాలని ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు. పేరు మార్పు తో వైశ్యుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. సురవరం ప్రతాపరెడ్డి మహనీయుడు అయన పేరు ఇతర సంస్థలకు పెట్టీ ఆయనను కూడా గౌరవించాలని అయన కోరారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలిపారు.

*ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

Image
 *ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* * నల్గొండ జిల్లాలోని ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టుకు నెలవారిగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.  * గత పదేండ్లుగా నల్లగొండ జిల్లా రైతులు సాగునీళ్లు లేక ఇబ్బందులు పడ్డారని, ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రెండేళ్లలో టన్నెల్ పనులను పూర్తిచేసి నల్గొండ ప్రజల రుణం తీర్చుకుంటామన్న మంత్రి. * రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్రస్థాయి ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఎస్ ఎల్ బి సి సొరంగం పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  * ఎస్ ఎల్ బి సి హై లెవెల్ కెనాల్ కు సంబంధించి మరమత్తులో ఉన్న 4 వ పంపును మూడు రోజుల్లో మరమ్మత్తు పూర్తి చేసి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .  * ఉదయసముద్రం ,బ్రాహ్మణ వెల్లెముల కింద భూస

TGPCB ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం

Image
 TGPCB ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం హైద్రాబాద్, (గూఢచారి):  తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TGPCB) ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2024ని సెప్టెంబర్ 19, 2024న రైన్బో స్కూల్, సనత్నగర్, హైదరాబాద్లో జరిపారు. TGPCB ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. నాగేశ్వర రావు “వాతావరణ చర్యల పురోగతి” పై కీ నోట్ ప్రసంగాన్ని ఇవ్వడంతో పాటు ఓజోన్ రక్షణపై విద్యార్థుల సృజనాత్మకతను అభినందిస్తూ పవర్ పాయింట్ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమం శ్రీమతి జులేఖా స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. మొహమ్మద్ సయీద్ పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్రపై ప్రసంగించి, విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని తెలియజేశారు.విద్యార్థులు రూపొందించిన పోస్టర్లు మరియు క్విజ్ పోటీలు కూడా నిర్వహించబడ్డాయి, విద్యార్థులకు ఓజోన్ పొర క్షీణత, వాతావరణ మార్పులు, మరియు సుస్థిరతతో సంబంధిత అంశాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. రైన్బో స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1987లో సంతకం చేయబడిన మాంట్రియల్ ప్రోటోకాల్ను స్మరించుకున్నారు. కార్యక్రమం చివరలో విద్యార్థుల సందేహాలను క్లారి

TWJ: జర్నలిస్ట్ యాంటీ అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దాస్

Image
  TWJ: జర్నలిస్ట్ యాంటీ అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దాస్ ,హైదరాబాద్ : (గూఢచారి) : ఐజేయూ అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) (TWJ) జర్నలిస్ట్ యాంటి అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దాస్ మాతంగి (Das Matangi)నియమితులయ్యారు.ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రకటించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మాతంగి దాస్ మూడు దశాబ్దాలకు చేరువగా జర్నలిజం వృత్తిలో ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో సేవలందించి నిర్విఘ్నంగా కొనసాగు తున్నారు. జర్నలిజం తొలినాళ్ళ నుంచి జర్నలిస్టు సంఘంలో సమ్మిళితమవుతూ వేములపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అరంగ్రేటం చేసి ఇంతింతై వటుడింతై అన్న చందంగా మిర్యాలగూడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షులుగా, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, పదేళ్లు నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, సంఘం రాష్ట్ర కౌన్సిల్, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా, నల్గొండ జర్నలిస్ట్ యాంటి అటాక్స్ కమిటీ సభ్యులుగా వివిధ పర్యాయాలు విశిష్

FCI - _స్వచ్చత ర్యాలీ_

Image
భారత ఆహార సంస్థ, నల్గొండ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు జరుపబడుతున్న  *స్వచ్చత యే సేవ* కార్యక్రమంలో భాగంగా, సంస్థ ఉద్యోగులు ఈ రోజు _స్వచ్చత ర్యాలీ_ నిర్వహించారు.  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ AGM (QC) డా. రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల స్వప్నమైన వికసిత భారత సాధనకు స్వచ్ఛ భారతమే ముఖ్య సోపానమని అభిప్రాయపడ్డారు. రామగిరి లోని సంస్థ జిల్లా కార్యాలయం నుండి ఉద్యోగులు క్లాక్ టవర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో, సీనియర్ అధికారులు కె ఎన్ కె ప్రసాద్, రఘుపతి, బిల్ల శ్రీనివాసరావు, కె కె షా, జయ కుమార్, పట్నాయక్, సుకుమార్ మరియు సెక్షన్ ఉద్యోగులు సతీష్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

టీయూడబ్ల్యూజేతోనే చిన్న పత్రికల మనుగడ

Image
 టీయూడబ్ల్యూజేతోనే  చిన్న పత్రికల మనుగడ  తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు  హైదరాబాద్ :   టీయూడబ్ల్యూజే- ఐజేయూతోనే చిన్న పత్రికల మనుగడ సాధ్యమని తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు అన్నారు. నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం కోసం పరితపిస్తూ అవిశ్రాంతంగా కృషి చేస్తూ చిన్న పత్రికల మనుగడకు కొండంత అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంఘంతోనే తమకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం ఉందన్నారు. బుధవారం సాయంత్రం నల్గొండ జిల్లాకు చెందిన 10 మంది సీనియర్ చిన్న పత్రికల సంపాదకులు , 143, ఇతర సంఘాలకు రాజీనామా చేసి, బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో యూసుఫ్ బాబు సమక్షంలో టీయూడబ్ల్యూజే-ఐజేయూకి అనుబంధ సంఘమైన తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ లోకానికి మార్గదర్శకులు, ఐజేయూ జాతీయ అధ్యక్షులు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి మన సమస్యలపై పూర్తి అవగాహన ఉండటం,చిన్

ఇన్స్టంట్ టాయిలెట్స్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర

Image
 *నేస్లీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్స్టంట్ టాయిలెట్స్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర*  ఖమ్మం నగరంలో స్థానిక 37వ డివిజన్ లోని బాలికల పాఠశాలలో విద్యార్థునుల సౌకర్యార్ధం సుమారు అయిదు లక్షల యాభై వేల రూపాయలతో మూడు ఇన్స్టంట్ మరుగు దొడ్లను నేస్లీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా , డిఇఓ E సోమశేఖర్ శర్మ , నేస్లీ కార్పొరేట్ అఫైర్స్ మేనేజర్ వసీం అహ్మద్ , నేస్లీ ఇండియా మేనేజర్ జాకీర్ హుస్సేన్ , ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు వరలక్ష్మి , శశికళ , పారిజాత తదితరులు పాల్గొన్నారు .

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేసిన కుమారీ ఆంటీ..

Image
 ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేసిన కుమారీ ఆంటీ..

నల్గొండ బీఆర్ఎస్‌ పార్టీ ఆఫీసును కూల్చేవేయాలని హైకోర్టు ఆదేశం

Image
  నల్గొండ  బీఆర్ఎస్‌ పార్టీ ఆఫీసును కూల్చేవేయాలని హైకోర్టు ఆదేశం హైద్రాబాద్, గూఢచారి: నల్గొండ  బీఆర్ఎస్‌ పార్టీ ఆఫీసును కూల్చేవేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాన్ని కట్టడంపై అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై న్యాయస్థానానికి వెళ్లిన కారు పార్టీకి ఊహించని షాకు తగిలింది. హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. 2018లో హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్లే దారిలో అగ్రోస్ రెండెకరాల స్థలంలో పార్టీ ఆఫీసును నిర్మించింది. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం పూర్తి చేసింది. దీనిపై మున్సిపల్ అధికారులు నోటీసు జారీ చేశారు. 99 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు తీసుకుంది. ఏడాదికి గజానికి వంద రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బీఆర్ఎస్ ఆఫీసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ ఆఫీసును కట్టారని, దానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు నోటీసులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ క్రమబద్దీకరణకు అవకాశం కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై విచా

Retired IAS Rani Kumudini as Telangana Election Commissioner..!

Image
 Retired IAS Rani Kumudini as Telangana  Election Commissioner..! About her - 1988 బ్యాచ్‌కి చెందిన కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు ఆమె పదవీ విరమణ చేశారు. ఎస్‌ఈసీగా పార్థసారధి పదవీకాలం ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసింది. ఫలితంగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాణి కుముదిని SEC గా నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మూడేళ్లపాటు ఎస్‌ఈసీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఎంజీ గోపాల్‌ను ప్రభుత్వం నియమించింది. 1983 బ్యాచ్‌కు చెందిన గోపాల్ యూనియన్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా మూడేళ్లపాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

విశ్వకర్మ యజ్ఞోత్సవం లో పాల్గొన్న ఉప్పల

Image
  *విశ్వకర్మ యజ్ఞోత్సవం లో పాల్గొన్న ఉప్పల* హైద్రాబాద్, గూఢచారి:  విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రీ ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మయజ్ఞం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సకల చరాచర శక్తికి మూలకారుడు, సకల వృత్తుల వారికి పూజ్యనీయుడైన శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలందరికీ "విశ్వకర్మ జయంతి" శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్ని కుల సంఘాలకు అన్ని విధాలా కృషి చేస్తున్నాడు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు అండగా వుంటుంది అని ఉప్పల శ్రీనివాస్ గుప్త  అన్నారు. అనంతరం ఆయనను  నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల సాయి కిరణ్ ,కార్యనిర్వాహక అధ్యక్షులు.కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు సల్వా చారి,  ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు పర్వతం శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి ఆందోజు శ్రీనివాస చారి, రాష్ట్

WAM నుండి వివరణ*

Image
  టంగుటూరి రామకృష్ణ, పసుమర్తి మల్లిఖార్జున్  ల పై కా చిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, FIR నమోదు కావడం తో నష్ట నివారణ చర్యలు చేపట్టి    WAM  వివరణ ఇచ్చింది. ఆ వివరణ  యధాతధంగా ప్రచురిస్తున్నాం *WAM నుండి వివరణ* అబుదాబి UAEలోని నేషనల్ థియేటర్‌లో సెప్టెంబరు 15న జరిగిన మా ఇటీవలి గ్లోబల్ కన్వెన్షన్ 2024 విజయవంతంగా ముగిసినందుకు మేము సంతోషిస్తున్నాము, ఇందులో ప్రపంచవ్యాప్తంగా 1100 మంది పాల్గొనేవారు, ఇందులో మాజీ రాజ్యసభ సభ TG వెంకటేష్  మరియు మన సమాజం ప్రముఖ వ్యాపార ప్రముఖులు ఉన్నారు. అయినప్పటికీ, లోటస్ ట్రావెల్స్ హైదరాబాద్ డిఫాల్ట్‌తో సంబంధం ఉన్న దురదృష్టకర పరిస్థితితో మా వేడుక కప్పివేయబడింది, దీని ఫలితంగా చాలా మంది వ్యక్తులు నష్టపోయారు. మేము ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు బాధిత సభ్యులతో ఐక్యంగా ఉంటాము.  ప్రభావితమైన వారందరికీ మేము మా హృదయపూర్వక మద్దతు మరియు సంతాపాన్ని తెలియజేస్తున్నాము. మేము, WAM నాయకత్వం బాధ్యులు జవాబుదారీగా ఉండాలని పోరాడుతాము మరియు బాధితులను పరిష్కరించడానికి మరియు పరిహారం ఇవ్వడానికి త్వరిత చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. తక్షణమే మేము అన్ని నిజమైన క్లెయిమ్‌లను పరిశీల

కీ.శే.సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం పులిహోర పంపిణీ చేసిన అయన కుమారుడు ప్రముఖ న్యాయవాది సోమవరపు సత్యనారాయణ

Image
  కీ.శే.సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం పులిహోర పంపిణీ చేసిన అయన కుమారుడు ప్రముఖ న్యాయవాది సోమవరపు సత్యనారాయణ నల్గొండ,(గూఢచారి):  దివంగత సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం అయన కుమారుడు ప్రముఖ న్యాయవాది సోమవరపు సత్యనారాయణ ఈరోజు నల్గొండలో గణేష్ నిమంజనం సందర్భంగా 250 కిలోల పులిహోరను భక్తులకు ప్రసాదంగా అందచేశారు. 

1వ నెంబర్ గణనాథుని లడ్డు ను 13 లక్షల 50 వేల కు సొంతం చేసుకున్న జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి.

Image
 బ్రేకింగ్... నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఒకటవ నెంబర్ గణనాథుని లడ్డు ను వేలం పాటలో Rs.1350000/- (13 లక్షల 50 వేలు)సొంతం చేసుకున్న నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి...

టంగుటూరి, పసుమర్తి, ఘంటసాల సుభాస్ పై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, FIR నమోదు

Image
 టంగుటూరి రామకృష్ణ, పసుమర్తి మల్లిఖార్జున్, ఘంటసాల సుభాస్ పై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, FIR నమోదు హైద్రాబాద్: గూఢచారి:  అబుదాబి లో జరుగుతున్న ప్రపంచ  "అర్య వైశ్య మహా సభ " కి తీస్కువేళ్తామని పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసి, వారి ని మోసం చేసిన నగరంలోని "లోటస్ "!, ట్రావెల్స్ పై కేసు నమోదు, తెలంగాణ, ఆంధ్ర కి చెందిన పలువురికి టోపీ  పెట్టిన లోటస్ ట్రావెల్స్. వివరాలలోకి వెళ్తే  అదిలాబాద్ కు చెందిన మధ్య తరగతికి చెందిన ఆర్య వైశ్యులం. గతకొన్ని రోజుల ముందు MADRAS కు చెందిన టంగుటూరి రామకృష్ణ ఆధ్వర్యం లో నడిపించబడుతున్న ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (World Arya Vysya Mahasabha (WAM) నుండి పసుమర్తి మల్లికార్జున కలిసి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ మీటింగ్ ను అభూదాబి లో పెద్దయెత్తున నిర్వహిస్తున్నట్లు గా నిర్వహిస్తున్నట్లు మోసపూరితమైన ప్రకటనలు చేసి, WAM సభ్యత్వం తీసుకుంటే మీరు మీటింగ్ కు రావడానికి అర్హులు అని మమ్మల్ని నమ్మించి. మా దగ్గరనుండి WAM సభ్యత్వ రుసుం పేరిట రు. 2,500/- వాటితో పాటు అభూదాభి మీటింగ్ కొరకు రు. 87,000/- మరియు 5,000/- కాన్ఫరెన్స్ పేరిట మా దగ్గరనుండి వసూలు చేయడం జరి

గణేష్ ఉత్సవాలల్లో భాగంగా హాఫిజ్ పేట లో అన్నదానం చేయించిన ఉప్పల

Image
 *వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు* గణేష్ ఉత్సవాలల్లో భాగంగా హాఫిజ్ పేట లో అన్నదానం చేయించిన ఉప్పల* హాఫిజ్ పేట లోని న్యూ సైబర్ వల్లే గణేష్  ఉత్సవ -2024 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం చేయించిన  TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బుద్ధికి,సిద్ధికి నాధుడని, సకలవిఘ్నాలకు వినాయకుడు అధినాయకుడని, చదువు,జ్ఞానానికి, విజయానికి ప్రతీకగా,సకల కార్యాలను నెరవేర్చే వరసిద్ధి ప్రదాత వినాయకుడన్నారు. వినాయకుని ఆశీస్సులతో  ప్రజలందరూ సుఖ సంతోషాలుతో, ఆరోగ్యాలుతో జీవించాలని, పండుగను  భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శంకర్ రెడ్డి, IVF youth President కట్ట రవి కుమార్ గుప్త  ,IVF Hyderabad PRO  సత్యం , నాగరాజు, పనికుమర్, నాగరాజు శివ, పూర్ణ, నట రాజు  అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పనిరాజ్, కోశాధికారి కృష్ణ, రాజ శ్రీకాంత్ రాహుల్ పటేల్, అశోక్ , మంగేశ్, కృష్ణ రావు తదితరులు పాల్

ఖైర‌తాబాద్ వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం మధ్యాహ్నం లోపు పూర్తి -సిపి,సీవీ ఆనంద్*

Image
 *ఖైర‌తాబాద్ వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం మధ్యాహ్నం లోపు పూర్తి -సిపి,సీవీ ఆనంద్*  హైద‌రాబాద్ : సెప్టెంబర్ 15 వినాయ‌క చ‌వితి న‌వ‌రాత్రు లు మ‌రో మూడు రోజుల్లో ముగియ‌నున్నాయి. ఈ నెల 17 వ తేదీ మంగళ వారం నాడు  గ‌ణేశ్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.  ఈ నేప‌థ్యంలో నిమ‌జ్జ‌నం జ‌రిగే ప్రాంతాల్లో ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ పోలీసు క‌మిష‌ న‌రేట్ల ప‌రిధిలో 25 వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.  హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోనే  వేల మంది పోలీసు బలగాలతో బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ ట్లు తెలిపారు. ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనాన్ని ఈనెల 17 మధ్యాహ్నం 1.30 గంట‌లోపు పూర్తి చేయను న్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు..  ఉదయం 6.30 గంటల వర కు పూజలు ముగించుకుని, నిమజ్జనానికి తరలివెళ్ల‌ను  న్నట్లు తెలిపారు. పోలీసు లు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు సమన్వయం తో కలిసి పనిచేస్తూ ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తయ్యేలా చూస్తామ‌ న్నారు...

Bhupathi-Times-e-paper-14-09-2024

Image
 Bhupathi-Times-e-paper-14-09-2024

భారత ఆహార సంస్థ లో స్వచ్ఛతయే సేవ కార్యక్రమం

Image
భారత ఆహార సంస్థ లో స్వచ్ఛతయే సేవ కార్యక్రమం  నల్గొండ, గూఢచారి: భారత ప్రభుత్వ ఆహార, వినియోగ దారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు భారత ఆహార సంస్థ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు, భారత ఆహార సంస్థ నల్గొండ డివిజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 17 తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు స్వచ్ఛతయే సేవ కార్యక్రమం నిర్వహించబడుతుందని సంస్థ ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ హీరా సింగ్ రావత్ ఒక ప్రకటనలో తెలిపారు.  ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉద్యోగులచే స్వచ్ఛత ప్రతిజ్ఞ, సంస్థ కార్యాలయాలు మరియు డిపొలలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం , స్వచ్చత పరుగు & సఫాయి కార్మికులను గౌరవించడం వంటి కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.  అంతేకాకుండా, సఫాయి కార్మికుల ఆర్థిక ప్రగతి, సామాజిక భద్రతకి తోడ్పడే వివిధ కార్యక్రమాలు కూడా సంబంధిత శాఖల వారి సమన్వయంతో నిర్వహిస్తామని ఆయన వివరించారు. అదే విధంగా, మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్వచ్ఛత కోసం వివిధ ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సంస్థ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని వి

కేజీవాల్ కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Image
 కేజీవాల్ కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో సీబీఐ నమోదు చేసిన కేసులో సీఎం అరవింద్ కేజీవాలు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సమీప భవిష్యత్తులో ట్రయల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారన్న సీబీఐ వాదనలను అంగీకరించలేదు. కేజ్రివాల్ బెయిల్కు అర్హుడని పేర్కొంది. కేసుపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, ఈడీ కేసులోని షరతులే ఇక్కడా వర్తిస్తాయని తెలిపింది.

ఎల్బి నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రైవేటు ఆర్థిక కలాపాలకు ప్రైవేటు సిబ్బంది?

Image
  ఎల్బి నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రైవేటు ఆర్థిక కలాపాలకు ప్రైవేటు సిబ్బంది? హైద్రాబాద్, గూఢచారి: రంగారెడ్డి జిల్లా LB నగర్ లో గల ఒక సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు లో నలుగురు సిబ్బంది తో నిర్వహించాలి. ఓక సబ్ రిజిస్ట్రార్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక అటెన్డర్ తో కొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కార్యకలాపాలు నిర్వహించాలి. దానికి విరుద్ధంగా అక్కడ ఇంకా కొందరు ప్రైవేటు వ్యక్తులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారిని అక్కడి ఆఫీసర్ ప్రైవేటు గా నియమించుకున్నట్లు సమాచారం వారు ఆఫీసు కార్యకలాపాలతో పాటు ప్రైవేటు ఆర్థిక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి.

Bhupathi-Times-e-paper-13-09-2024

Image
 Bhupathi-Times-e-paper-13-09-2024