లడ్డు వివాదం లో విమర్శలకు కేంద్ర బిందువుగా నిలిచిన TTD EX EO ధర్మారెడ్డిని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు సత్కరించడంపై విమర్శల వెల్లువ


 


లడ్డు  వివాదం లో విమర్శలకు  కేంద్ర బిందువుగా నిలిచిన  TTD EX EO ధర్మారెడ్డిని  స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి  దేవస్థానం ధర్మకర్తలు సత్కరించడంపై విమర్శల వెల్లువ


భువనగిరి, (గూఢచారి) ఇటీవల   తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం లో కేంద్ర  బిందువుగా నిలిచిన  తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి  యాదాద్రి జిల్లాలోని భువనగిరి  పరిధి లోని మానేపల్లి  హిల్స్ నిర్మించిన స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంనకు విచ్చేసిన సందర్భంగా 
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్   ఆఫీసర్  ధర్మారెడ్డి స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ కర్తలు,  ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి జ్యువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు దంపతులతో  పాటు వారి కుమారుడు మానేపల్లి మురళీకృష్ణ వీరిని సాదరంగా  ఆహ్వానించి  ధర్మారెడ్డి నీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా  పలువురు ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు   మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విభాగంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  అప్పటి మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి ని  ఈ విధంగా సత్కరించడం   పై   విమర్శలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పోలీసు హౌసింగ్ చైర్మెన కోలేటి దామోదర్ కూడా ఉన్నారు.




Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్