Skip to main content

Posts

Gainesville తెలుగు కుటుంబాల ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

 Gainesville తెలుగు కుటుంబాల ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు ఫ్లోరిడా లోని Gainesville తెలుగు కుటుంబాల ఆధ్వర్యంలో ఆటలు, పాటలతో కోలాహలంగా ఘనంగా ఉగాది ఉత్సవాలు నీబెర్రి లోని ఫ్రెడీ వాల్మార్క్ పార్కు లో నిర్వహించారు. ఈ ఉత్సవములో దాదాపు 150 మంది తెలుగువారు పాల్గొన్నారు. ఈ పండుగ ఉత్సవం లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నలు, పెద్దలు పాల్గొని శ్రోతలను ఉర్రూతలూగించారు. తొలుత మహిళలు, బాలికలు పంచాంగ శ్రవణం చేశారు. భారతీయ, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఉత్సవం సాగింది. కమ్మని  విందు ఏర్పాటు చేశారు. 
  @ ధాన్యం సేకరణను వేగవంతం చేసిన నల్గొండ జిల్లా యంత్రాంగం @ 5 లక్షల మె. ట ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటికే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  @ సుమారు 13 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ    @ కొనుగోలు కేంద్రాల సక్రమ నిర్వహణకు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ప్రత్యేక పర్యవేక్షణ  @ రెవెన్యూ అదనపు కలెక్టర్ తో పాటు, పౌరసరఫరాలు, మార్కెటింగ్ ,వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, తాసిల్దారుల తో ప్రతిరోజు సమీక్ష, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీలు.       రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరేలా యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో దాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతున్నది .రైతులు పండించిన దాన్యాన్ని కొనుగోలు చేసేందుకుగాను ఈ యాసంగిలో జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, 370 కి 370 కేంద్రాలను ప్రారంభించడం జరిగింది . ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 171 కోట్ల రూపాయల విలువ చేసే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. శనివారం న

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

  చలివేంద్రాన్ని ప్రారంభించిన  ఉప్పల శ్రీనివాస్ గుప్త హైదరాబాద్ లోని  ఉప్పల్ , రామంతపూర్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమములో ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్  వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు IVF జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ  చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త విచ్చేసి   రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో..* IVF  మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు పాండు గుప్త, IVF  మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ కొత్తపల్లి రమేష్, కోశాధికారి బోనగిరి శ్రవణ్ కుమార్, IVF స్టేట్ ఆధ్యాత్మిక చైర్మన్ బోనగిరి శ్రీనివాస్,  నగేష్, IVF మేడ్చల్ జిల్లా నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్ కుమార్*

  *తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటావా?*   *కొట్లాడి తెలంగాణ సాధించి అధికారమిస్తే...తెలివిలేనోళ్లంటావా?*   *తెలంగాణ సొమ్మును దోచుకుని తెలివిలేనోళ్లంటావా?*   *అమెరికాలో చిప్పలు కడిగిన నిన్ను మంత్రి చేస్తే ఇదేనా నువ్విచ్చే బహమతి?*   *తెలంగాణ ప్రజలారా... బీఆర్ఎస్ ను ఈడ్చి తన్నండి*   *తెలివిలేనోళ్లు మాత్రమే బీఆర్ఎస్ కు ఓటేయండి...*   *తెలివి ఉన్నోళ్లెవరూ బీఆర్ఎస్ కు ఓటేయకండి*   *బీఆర్ఎస్ కార్యకర్తలారా... మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే ‘క్విట్ బీఆర్ఎస్‘*   *కేటీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్ కుమార్*   తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రోళ్లు తెలివైన వాళ్లంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ భగ్గుమన్నారు. ‘‘కొట్లాడి రాష్ట్రం సాధించిన తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటావా? అమెరికాలో చిప్పలు కడిగిన నీకు అధికారం అప్పగిస్తే.. తెలివిలేనోళ్లంటావా. సకల జనుల సమ్మె చేసి ఉద్యోగాలనే ఫణంగా పెట్టిన తెలంగాణ ఉద్యోగులను తెలివిలేనోళ్లంటావా? తెలంగాణ కోసం పోరాడి బలిదానమైన 14 వందల మంది నీకు తెలివిలేనోళ్లా?’’ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలారా....

*రాజేష్ కుటుంబానికి అండగా* *ఉంటాం* *-మీడియా అకాడమీ చైర్మన్* *కె.శ్రీనివాస్ రెడ్డి*

 *రాజేష్ కుటుంబానికి అండగా* *ఉంటాం* *-మీడియా అకాడమీ చైర్మన్* *కె.శ్రీనివాస్ రెడ్డి*  ---------------------------------------- యువ ఫోటో జర్నలిస్ట్ నర్రా రాజేష్ ఆకస్మిక మరణం అత్యంత విషాదకరమని, అతని కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్  కె.శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రాజేష్ సంస్మరణ సభ, అసోసియేషన్ నుండి బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయా పత్రికల్లో ఫోటో జర్నలిస్టుగా సేవలందించిన రాజేష్, ఎంతో బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడని ఆయన కొనియాడారు. మీడియాకు ఫోటో జర్నలిస్టులు కళ్ళు, చెవుల లాంటి వారన్నారు. పత్రికల్లో వార్తలకు సాక్ష్యంగా నిలిచేది ఫోటోలేనని, ఆ ఫోటోల కోసం ఫోటో జర్నలిస్టులు పడే తిప్పలు వర్ణనాతీతమని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పాత్రికేయ వృత్తి అభద్రతా, అత్యంత ప్రమాదకరమైనట్లు ప్రజాస్వామిక దేశాలకు ఐక్యరాజ్య సమితి ఎప్పుడో సూచించిందని ఆయన గుర్తుచేసారు. ఫోటో, వీడియో జర్నలిస్ట

ఉద్యోగుల వయో పరిమితిపై వచ్చే వార్తల్లో వాస్తవం లేదు*

 *ఉద్యోగుల వయో పరిమితిపై వచ్చే వార్తల్లో వాస్తవం లేదు*        హైదరాబాద్, ఏప్రిల్ 12:: 'రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్లుగా లేదా 33 సంవత్సరాల సర్వీసు' అంటూ వివిధ వార్త పత్రికలూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏవిధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ లేదని స్పష్టం చేశాయి. ఈ విధమైన వూహ జనిత వార్తలు రాయడం, దీనిని సామాజిక మాధ్యల్లో ప్రసారం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే / ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఒక అధికార ప్రకటనలో తెలిపారు. ------------------------------------------------------------------------------------------------------------ స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.

*బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏరుకొండ హరి*

 *బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏరుకొండ హరి*   నల్లగొండ:   బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ పట్టణానికి చెందిన ఏరుకొండ హరి నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏరుకొండ హరి బిజెపిలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ ఓ బీసీల హక్కుల సాధన కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రాజిలేని పోరాటం చేస్తామని తెలిపారు. ఓబీసీలను సంఘటితం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి , ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.

బండి సంజయ్ చాయ్ పే చర్చా

 ఎన్నికల బిజీ ప్రచారం నడుమ బండి సంజయ్ చాయ్ పే చర్చా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రం చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలతో కలిసి చాయ్ తాగుతున్న బండి సంజయ్

పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎం - కోమటిరెడ్డి

  *పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎం* *కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవు* *రేవంత్ నాయకత్వంలో టీం వర్క్ గా పని చేస్తున్నాం* *కాంగ్రెస్ లో ఏకనాథ షిండేలు లేరు* *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* *హరీష్ రావు,మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్* *నల్లగొండ*: రాష్ట్రంలో ఈ ఐదేళ్లతో పాటు వచ్చే ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన రంజాన్ వేడుకలలో పాల్గొన్న అనంతరం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని హరీష్ రావు, బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంత టీం వర్క్ గా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు లేరని, గ్రూపులు లేవని అన్నారు. ఏక్ నాథ్ షిండే అన

జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి*

 *జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి* *నల్లగొండ*: అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినీమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి,మేధావి, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు మహిళలకు కూడా సమాజంలో గౌరవం తెచ్చే విధంగా స్ఫూర్తిని తీసుకువచ్చాడని అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే ఆశ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో తాను నల్లగొండలో ఎక్కడలేని విధంగా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు.ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జ్యోతిరావు పూలే సేవలను గుర్తించి ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించిందని అన్నారు.బడుగు,బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల