Skip to main content

*ఆగస్ట్ 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి:అర్.వి.కర్ణన్*


 

*ఆగస్ట్ 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి:అర్.వి.కర్ణన్*


నల్గొండ,ఆగస్ట్3

 ఆగస్ట్ 15 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ అన్నారు.గురు వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేదిక,వి. ఐ.పి.లు,అధికారులు,మీడియా,ఇతరులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు.

పరేడ్ మైదానంలో త్రాగు నీరు,పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.ముఖ్య అతిధి సందేశం రూపొందించేందుకు ఆయా శాఖలు సాధించిన ప్రగతి నివేదికలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి పంపించాలని అన్నారు.అటవీ,వ్యవసాయ,ఉద్యాన,జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ,గ్రామీణ నీటి పారుదల శాఖ,పశు సంవర్తక శాఖ,విద్యా శాఖ, ఐ.సి.డి.ఎస్,పరిశ్రమల శాఖలు శకటాలు,ఎస్.సి.,ఎస్.టి.,బి.సి.,గిరిజన,మైనార్టీ సంక్షేమ శాఖలు,అటవీ,సాగు నీటి పారుదల శాఖ,అర్&బి ఆయా శాఖలు సాధించిన ప్రగతి ని తెలుపుతూ శకటాలు,స్టాళ్లు ఏర్పాటు చేయాలని అన్నారు.ఎస్.పి.పోలీస్ బందోబస్తు,గార్డ్ ఆఫ్ ఆనర్ ఏర్పాటు చేయాలని అన్నారు.పరేడ్ గ్రౌండ్ లో పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డి.ఈ.ఓ.ను ఆదేశించారు. ఆయా శాఖలు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించేందుకు ప్రతి డిపార్ట్మెంట్ నుండి రెండు కు మించకుండా,పెద్ద డిపార్ట్మెంట్ అయితే గరిష్టంగా ముగ్గురికి మించకుండా ఉత్తమ పని తీరు కనపరిచిన ఉద్యోగుల వివరాలు డి.అర్.ఓ కు పంపించాలని అన్నారు.మెడికల్, ఏమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు వైద్య బృదం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.నిరంతర విద్యుత్ సరఫరా, లైటింగ్,జనరేటర్ ఏర్పాటు చేయాలని ఎస్.పి.డి.సి.ఎల్.అధికారిని ఆయన ఆదేశించారు.సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్