13 మంది అభ్యర్థులు (16) సెట్ల నామినేషన్లు


 






నల్గొండ:

   వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా 5 వ రోజైన సోమవారం 13 మంది అభ్యర్థులు (16) సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు .ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టపద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్ జి కి వీరు నామినేషన్లను సమర్పించారు.


        సోమవారం నామినేషన్లు సమర్పించిన వారిలో తెలుగుదేశం పార్టీ నుండి ముండ్ర మల్లికార్జునరావు 2 సెట్ల నామినేషన్లను, ధర్మ సమాజ్ పార్టీ నుండి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ 1 సెట్ నామినేషన్, బిఆర్ఎస్ నుండి ఆనుగుల రాకేష్ 1 సెట్, నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా కర్ని రవి 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు .


     స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత 2 సెట్ల నామినేషన్లు, చీదల్ల వెంకట సాంబశివరావు 1 సెట్, చీదల్ల ఉమామహేశ్వరి 1 సెట్, తాడిశెట్టి క్రాంతి కుమార్ 2 సెట్లు, అయితగోని రాఘవేంద్ర 1 సెట్, భక్కా జడ్సన్ 1 సెట్,బుగ్గ శ్రీకాంత్ 1 సెట్, పాలకూరి అశోక్ కుమార్ 1 సెట్, దేశ గాని సాంబశివరావు 1 సెట్ నామినేషన్లను దాఖలు చేశారు.

__________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు