శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతం



* వరంగల్ -ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతం 


* సోమవారం వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టబధ్రుల  ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన 12 జిల్లాలలో ఉదయం  8.00 గం.ల కు ప్రతినిధులకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

కొన్ని జిల్లాలలో సాయంత్రం 4 గంటల వరకే క్యూలైన్ల లో ఉన్న ఓటర్లకు టోకెన్ల ద్వారా వారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు కల్పించడం జరిగింది. 

 * ప్రారంభంలో పోలింగ్ కొంత మందకోడిగా ప్రారంభమైనప్పటికీ అనంతరం ఓటర్లు పెద్ద ఎత్తున 

    పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

* శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలలో భాగంగా ఈ విడత యువత, ప్రత్యేకించి పట్టభద్రులైన    మహిళలు అధిక సంఖ్యలో హాజరై వారి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.

* కొన్నిచోట్ల దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.

 * ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలలో ఓటర్లు సాధారణ ఎన్నికలను మించి క్యూలైన్లో నిలబడి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

* శాసనమండలి పట్టబధ్రుల పోలింగ్ ముగిసే వరకు అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం పోలింగ్ నమోదయింది.

* అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది 

* వరంగల్ -ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక లో ఓటర్లు వారి ఓటు  హక్కును వినియోగించుకునేందుకుగాను 12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 463,839 మంది ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకున్నారు.

 * పోలింగ్ ముగిసే సా.4.00 గం.ల సమయానికి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 318445 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా కొన్ని చోట్ల క్యూ లైన్ లో వోటర్లు ఉన్నారు.  పోలింగ్ కొనసాగుతుంది.  ఫైనల్ పోలింగ్ శాతం  ఇంకా రావలసిఉంది.

* వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నియోజక వర్గం మొత్తంలో

   463839 ఓటర్లు ఉండగా , 120576 మహిళా ఓటర్లు 197868 పురుష ఓటర్లు, ఇతరులు 01, 

   మొత్తం కలిపి 318445 మంది ఓటర్లు ఓటు వేశారు.12 జిల్లాల వ్యాప్తంగా కలుపుకొని ఎమ్మెల్సీ 

    ఎన్నికలలో 68.65 పోలింగ్ శాతం నమోదు అయ్యింది.

* సిద్దిపేట జిల్లాలో 69.82 శాతం, జనగాం జిల్లాలో 71.60 శాతం, హనుమకొండ జిల్లాలో 71.21 

   శాతం, వరంగల్ జిల్లాలో 70.84 శాతం, మహబూబాబాద్ 69.52 శాతం, ములుగు 74.54 శాతం,  

   జయశంకర్ భూపాలపల్లి 69.16 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 68.05 శాతం, ఖమ్మం 65.54 శాతం,  

   యాదాద్రి భువనగిరి 67.45 శాతం, సూర్యాపేట 70.62 శాతం, నల్గొండ జిల్లాలో66.75 శాతం,  

    వరుసగా పోలింగ్ శాతం నమోదయింది.

* ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో మహిళా ఓటర్లు పెద్ద మొత్తంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం జరిగింది 

* అత్యధికంగా ఖమ్మంలో సాయంత్రం 4 గంటల సమయానికి 21543 మహిళలు వారి ఓటు హక్కును వినియోగించుకోగా, నల్గొండలో 19780 సంఖ్యలో మహిళలు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

* శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను అన్ని 

    జిల్లాల కలెక్టర్లు ,అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించిన ఆర్. డి. ఓ. లు, అదనపు 

    కలెక్టర్లు, పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని పోలింగ్ ను సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు

* అన్ని జిల్లాల వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు జరగలేదు.

 * ఈ విడత ఎం ఎల్ సి ఎన్నికలలో ఓటర్లు సరైన విధంగా ఓటు వేసేందుకు,వారి ఓటు  

    చెలుబాటయ్యే విధంగా చేసేందుకుగాను పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం జరిగింది. 

* ప్రాధాన్యత క్రమంలో 1,2,3,4 అంకెల రూపంలో వేసే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు 

   ఓటు సక్రమంగా వేసేందుకుగాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద    

    “ఓటు ఎలా వేయాలి” అన్న అంశంపై ఫ్లెక్సీని, పోస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది 

*ఇదే విధంగా అన్ని జిల్లాల్లో సైతం పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం జరిగింది

* పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించడమే కాకుండా, ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది

 * పోలింగ్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ తో పాటు, హెల్ప్ డెస్కుల ఏర్పాటు పోలింగ్ కేంద్రం లోకి సెల్  ఫోన్ లు , వాటర్ బాటిల్ లు , ఇంక్ పెన్ లు తీసుకురాకుండా పోలింగ్ స్టేషన్ గేట్ వద్ద పూర్తి స్తాయిలో తనికి లు చేయడం జరిగింది.

* ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు

* మొత్తం ఎన్నికల ప్రక్రియను నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కంట్రోల్ రూమ్ ద్వారా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగింది 

* నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కంట్రోల్ రూమ్ ద్వారా  ప్రతి రెండుగంటలకు ఒకసారి ఎన్నికలు జరిగిన 12 జిల్లాల నుండి పోలింగ్ శాతాన్ని సేకరించి రాష్ట్ర స్థాయిలో సీఈఓ కార్యాలయం తో పాటు ,మీడియాకు, ఇతర జిల్లాలకు చేరవేయటం జరిగింది

* వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టబధ్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా  నిర్వహించడంలో సహకరించిన అన్నీ జిల్లాలా ఎన్నికల అధికారులు, పోలీస్, రెవెన్యూ  అధికారులు ,ఇతర సిబ్బంది ముఖ్యంగా పట్టభద్రులైన ఓటర్లు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు,  మీడియా ప్రతినిధులకు అధికారులు  కృతజ్ఞతలు తెలిపారు.




Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్