Skip to main content

ఆర్టీఐ దరఖాస్తు తిరస్కరించిన Pio పై ఫిర్యాదు చేస్తాం - ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయికుమార్.

 ఆర్టీఐ దరఖాస్తు తిరస్కరించిన Pio పై ఫిర్యాదు చేస్తాం - ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయికుమార్.


హైద్రాబాద్: అడ్వకేట్ ముచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ హైద్రాబాద్ కు సంభందించిన సమాచారం కొరకు ఆ సొసైటీ మెంబర్ అయిన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయికుమార్ సమాచార హక్కు చట్టం క్రింద హైద్రాబాద్ జిల్లా కో ఆరేటివ్ అధికారి ఆఫీసు పౌర సమాచార అధికారికి ఆర్టీఐ దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అట్టి దరఖాస్తును ఆ కార్యాలయ PIO తిరస్కరించారని దానిపై ఫిర్యాదు చేస్తామని, లీగల్ గా ప్రొసీడ్ అవుతామని తెలిపారు.

దరఖాస్తు లో ఐదు అంశములకు కోరామని, ముఖ్యంగా సొసైటీ నిధుల నుండి  దాదాపు 2 కోట్ల తో ప్రస్తుత మరియు పాత డైరెక్టర్లు కు సూట్ లు మరియు గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నారని, ఇది సొసైటీ ఫండ్స్ ను దుర్వినియోగ పర్చినట్లు అవుతుందని, ఈ కార్యక్రమం విరమించుకోవాలని కోరుతూ దాదాపు 40 మంది సభ్యుల సంతకాలతో సొసైటీ సెక్రటరి కి లేఖ ఇచ్చామని ఆ లేఖ పై ఎలాంటి చర్యలు తీసుకున్నరో సమాచారం ఇప్పించవలసిందిగా PIO ను కోరారు. దానికి ఆ కార్యాలయ pio దరఖాస్తు ను సేక్షన్ 8 (జె) క్రింద తిరస్కరించారని ఇది ఆర్టీఐ చట్టానికి వ్యతిరేకం అని, దీనిపై సెక్షన్ 18(1) క్రింద ఫిర్యాదు చేస్తామని, ఇంకా చట్టపరంగా చర్యలకు ప్రొసీడ్ అవుతామని తెలిపారు.

దరఖాస్తు మరియు తిరస్కరణ డాక్యుమెంట్స్ ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేసి చూడొచ్చు

https://drive.google.com/file/d/1yMlEAde0o-IwYC1hOmZxGeu_PG0-fDXn/view?usp=drivesdk


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

 *రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ.* సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ రవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… సి.ఎం.ఆర్ బియ్యం ను ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్లు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తిరుమలగిరి పోలీసు స్టేషన్ లో పౌర సరఫరా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మడి సోమనర్సయ్య కు చెందిన మూడు మిల్లులలో అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో సుమారు రూ.250 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు నెల క్రితం అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇమ్మడి సోమనర్సయ్య ను, ఇమ్మడి సోమనర్సయ్యను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు సూర్యాపేట డిఎస్పీ తెలియజేశారు . గతం లో  ఈ విషయం పై gudachari vartha https://www.gudachari.page/2024/04/blog-post_17.html

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.