Skip to main content

ఈ వానాకాలం నుండే రైతులకు ఉచిత పంట బీమా పథకం అమలు


 *ఈ వానాకాలం నుండే రైతులకు ఉచిత పంట బీమా పథకం అమలు*


 *ఉచిత పంట బీమా పథకం పై నల్గొండ కలెక్టరేట్లో అధికారులకు అవగాహన సదస్సు*


  నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో బుధవారం(22-05-2024) వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పంట బీమా పథకం పై అవగాహన సదస్సు జరిగింది. రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు భరోసా కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పథకం లో భాగంగా ఈ వానకాలం పంట నుండే రైతులకు ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేయాలని, ఆ అమలకు సంబంధించిన విషయాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన సదస్సు జరిగింది.


 నల్గొండ జిల్లాలో వానాకాలంలో వరి, పత్తి, టమాట, కందులు పంటలకు... ఏసంగి లో వరి, వేరుశనగ పంటలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఉచిత పంట బీమా పథకం వర్తిస్తుంది. దీనికోసం రైతులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తాము వేసిన పంటలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేసుకున్న పంటకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రైతు ఒక పంట పండించి మరో పంట నమోదు చేసుకుంటే ఇది వర్తించదు.దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినా, అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగినా ఈ బీమా వర్తిస్తుంది.


  ఉచిత పంట బీమా విధి విధానాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అవలంబించాల్సిన విషయాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించారు.  


  ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్ హైదరాబాద్ కి చెందిన డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ బాబు, నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంగీతలక్ష్మి, ట్రైనర్ సుమన్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

 *రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ.* సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ రవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… సి.ఎం.ఆర్ బియ్యం ను ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్లు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తిరుమలగిరి పోలీసు స్టేషన్ లో పౌర సరఫరా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మడి సోమనర్సయ్య కు చెందిన మూడు మిల్లులలో అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో సుమారు రూ.250 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు నెల క్రితం అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇమ్మడి సోమనర్సయ్య ను, ఇమ్మడి సోమనర్సయ్యను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు సూర్యాపేట డిఎస్పీ తెలియజేశారు . గతం లో  ఈ విషయం పై gudachari vartha https://www.gudachari.page/2024/04/blog-post_17.html

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.