TGPCB ఆధ్వర్యంలో జాతీయ కాలుష్య నిరోధక దినోత్సవం

చీఫ్ ఇంజనీర్ బి రఘు, పి సి బి అధికారులు సందేశాలతో పోస్టర్లు అమర్చిన ఆటోల ద్వారా అవగాహన ప్రచారం

 గూఢచారి న్యూస్, హైద్రాబాద్ 2 డిసెంబర్

జాతీయ కాలుష్య నిరోధక దినోత్సవం – డిసెంబర్ 2, 2025 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అవగాహన కార్యక్రమాలు.

జాతీయ కాలుష్య నిరోధక దినోత్సవం సందర్భంగా 2025 డిసెంబర్ 2న తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది.

ప్రజల్లో కాలుష్యం పట్ల అవగాహన పెంపొందించేందుకు ఆటో ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. చెత్త దహనం ప్రభావం, వాహన కాలుష్యం, వాయు నాణ్యత మెరుగుదల మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై సందేశాలతో పోస్టర్లు అమర్చిన ఆటోలు ముఖ్య మార్గాల్లో ప్రచారం చేశాయి.

అలాగే, నేషనల్ హై స్కూల్, బెగంపేట్ లో విద్యార్థుల కోసం పర్యావరణ అవగాహన క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహించబడింది. విద్యార్థులు చురుకుగా పాల్గొని పర్యావరణ పరిరక్షణపై తమ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు.

పర్యావరణ నాణ్యత అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని టి జి పి సి బి తెలియజేసింది. కాలుష్యాన్ని తగ్గించే సురక్షితమైన, పద్ధతులను అనుసరించాలని ప్రజలను కోరింది.



Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం