Posts

Showing posts from November, 2024

నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

Image
  నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు హైద్రాబాద్, (గూఢచారి):  హైదరాబాద్ లోని నీటిపారుదల శాఖ లో పనిచేసే సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు (ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు) హేరూర్ నికేశ్ కుమార్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అనిశా అధికారులు. అనిశా అధికారులు ఆయన నివాసంతో పాటు ఆయనకు & ఆయన బంధువులకు సంబంధించిన 19 చోట్ల వద్ద సోదాలు నిర్వహించారు. సోదాల్లో "ప్లాట్లు (5), వ్యవసాయ భూమి (6.5 ఎకరాలు), ఫ్లాట్లు (6) మరియు వాణిజ్య స్థలాలు (2) తో కూడిన రూ.17,73,53,500/- విలువైన (మార్కెట్ విలువ ప్రకారం) మరియు స్థిర & చరాస్తులను గుర్తించారు" ఇత:పూర్వం ఇతను 30-05-2024 న ఒక భవనం నిర్మాణం కోసం NOC జారీ చేయడానికి రూ.1,00,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. “ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి

మాజీ ముఖ్యమంత్రి కీ.శే. రోశయ్య కు ఘనంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
  కీ.శే. రోశయ్య కు ఘనంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త  హైద్రాబాద్,(గూఢచారి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీ :శే: శ్రీ కొణిజేటి రోశయ్య 3 వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి నివాసం బల్కం పేట లోని వారి నివాసంలో పెద్ద కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావు తో పాటు కలసి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఈ కార్యక్రమంలో పలువురు ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సన్మానించిన పోలీస్ కమిషనర్

Image
  *ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సన్మానించిన పోలీస్ కమిషనర్*  ఖమ్మం, (గూఢచారి ప్రతినిధి నాని): ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ శాఖ మన్ననలు పొందారని పోలీస్ కమిషనర్ కొనియాడారు. రిటైర్ మెంట్ తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదని, మీ విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.   *ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు*  1) N.నాగేశ్వరరావు ASI  2) పి. క్రిష్ణయ్య, ఏఆర్‌ఎస్‌ఐ  3) జి. సూర్యారావు, ఏఆర్‌ఎస్‌ఐ ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, ఆర్ ఐ కామరాజు, పోలీస్ అసోసియేషన్ జానీమియా, పంతులు పాల్గొన్నారు.                              

CM Revanth Reddy: ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యం

Image
 అత్యంత నిరుపేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్ల‌లో తొలి ప్రాధాన్యం.... * దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికుల‌కు పెద్ద‌పీట‌ * పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బ‌లోపేతం * ల‌బ్ధిదారు ఆస‌క్తి చూపితే అద‌న‌పు గ‌దుల నిర్మాణానికి అనుమ‌తి * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య‌క్ర‌మం ఎంచుకోవాల‌ని సీఎం తెలిపారు. ఇందిర‌మ్మ ఇళ్లపై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌మిస్తున్నందున త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఈ విష‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శితో పాటు మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌ని.. ఏ ద‌శ‌లోనూ ల‌బ్ధిదారుకు ఇబ్బంది క

ACB NEWS: 10 వేలు లంచం తో చిక్కిన సర్వే & లాండ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్

Image
  ACB NEWS: 10 వేలు లంచం తో చిక్కిన సర్వే & లాండ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ నిర్మల్ జిల్లా, (గూఢచారి) అనిశా అధికారుల చేతికి చిక్కిన నిర్మల్ పట్టణంలోని సర్వే మరియు భూ దస్తావేజుల సహాయ సంచాలకుల కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జి.జగదీష్. నిర్మల్ జిల్లా, మామడ మండలంలోని భూమికి సంబంధించిన సేత్వార్ ప్రతి మరియు టోంచ్ చిత్రపటం జారీ చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.10000/- #లంచం ను అదే కార్యాలయంలో అటెండర్ (తన భార్య తరపున )గా పని చేస్తున్న ఎస్. ప్రశాంత్ ద్వారా తీసుకుంటుండగా acb అధికారులు పట్టుకున్నారు. “ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయమని ఎసిబి అధికారులు కోరారు.

5 వేలు తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్

Image
 5 వేలు తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ వరంగల్, (గూఢచారి): గాదె కార్తీక్, అసిస్టెంట్ ఇంజనీర్, డ్రాయింగ్ బ్రాంచ్, 0/0 జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్, వరంగల్ జిల్లా. "వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం MGNREGS కింద సీసీ రోడ్డు పనులు పూర్తి చేయడానికి సంబంధించి సుమారు 9 లక్షల రూపాయల బిల్లులను పరిశీలించి ఖరారు చేసినందుకు ఫిర్యాదుదారుని నుండి #5,000/- లంచం మొత్తాన్ని తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డారు" Gade Kartheek, Assistant Engineer, Drawing Branch, O/o The District Panchayat Raj Engineer, Warangal dist.was caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.5,000/- from the complainant "for scrutinizing and finalizing bills worth approximately Rs.9 Lakh related to the completion of CC road works under MGNREGS in Wardhannapet mandal of Warangal Dist.

చెక్కులు పంపిణీ చేసిన కాశి అన్నపూర్ణ సత్రం కార్యవర్గం & తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత

Image
 చెక్కులు పంపిణీ చేసిన కాశి అన్నపూర్ణ సత్రం కార్యవర్గం & తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత  హైద్రాబాద్: (గూఢచారి):  ఈరోజు హైదరాబాద్ కాశీ అన్నపూర్ణ సత్రం కార్యాలయంలో మెరిట్ స్టూడెంట్స్ కి పై చదువుల కోసం చెక్కులు పంపిణీ చేసిన కాశి అన్నపూర్ణ సత్రం కార్యవర్గం మరియు. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత. 

ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీస్‌లో నాగార్జున సందడి

Image
  ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీస్‌లో నాగార్జున సందడి హైదరాబాద్‌: ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) సందడి చేశారు. తన కొత్త కారు టయోటా లెక్సస్ (Toyota Lexus) రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేశారు.

మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
  మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త హైద్రాబాద్, (గూఢచారి): మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే అని TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. అందరికీ విద్యను అందించేలా కృషిచేసిన మహానీయుడు, తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా LB Nagar చౌరస్తా లో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది పూలే. సామాజిక ఉద్యమాల మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే చదువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే పురోగతి లేదు అనే సత్యాన్ని గ్రహించి 19వ శతాబ్దపు తొలినాళ్లలో నిమ్న జాతుల కోసం, మహిళల కోసం దేశంలో మొదటిసారిగా పాఠశాలలను ఏర్పరిచిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే. విద్యావ్యాప్తి ద్వారా కుల వివక్షతను, సాంఘిక దురాచారాలను, మూడనమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేశారు. కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచి

కొత్తగూడెం జిల్లా అధికారులకు మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్ ...!

Image
 కొత్తగూడెం జిల్లా అధికారులకు మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్ ...! ఆఫీసర్స్ బీ అలర్ట్...! •⁠ ⁠విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు •⁠ ⁠కొత్తగూడెం జిల్లా అధికారులకు మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్ ...! •⁠ ⁠పలు శాఖల అధికారుల పనితీరు పై ఫిర్యాదులొస్తున్నాయ్ - పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిక - సీఎస్ఆర్ నిధులు నిర్వీర్యం కాకుండా సీపీవో బాధ్యతయుతంగా వ్యవహరించాలి •⁠ ⁠పంచాయతీ సెక్రటరీలపై డీపీవో, ఎమ్మార్వోలపై ఆర్డీవో పర్యవేక్షణ తప్పనిసరి  •⁠ ⁠అన్ని శాఖల అధికారులను అడిషనల్ కలెక్టర్ సమన్వయం చేసుకోవాలి •⁠ ⁠కొత్తగూడెం జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావే శం

CM Revanth Reddy: కుల సర్వేలోభాగంగా వివరాలు నమోదు చేయించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Image
 CM Revanth Reddy: సర్వేలోభాగంగా వివరాలు నమోదు చేయించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైద్రాబాద్, (గూఢచారి):  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న ఎన్యుమరేటర్, అధికారులు.హాజరైన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, తదితరులు.  సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను ఆరా తీసిన సీఎం.హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.వీలయినంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం.

భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు -

Image
 భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు  హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుడిమాల్కాపూర్ లోని ఓ ఫర్నీచర్ గోదాములో గురువారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Revanth Reddy: విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాలి

Image
  Revanth Reddy: విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాలి * ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు*  *లేనివి ప్ర‌చారం చేస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్న* వారిపై కఠిన చర్యలు Hydrabad, gudachari: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాల‌ని, వారికి ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అల‌క్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. * బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్య‌క్తం చేసిన ముఖ్యమంత్రి ఈ విషయంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చ‌రించారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొల‌గించేందుకు కూడా వెనుకాడ‌బోమని స్ప‌ష్టం చేశారు. క‌లెక్ట‌ర్లు త‌ర‌చూ పాఠశాలలు, వ‌స‌తిగృహాలు, గురుకులాలను త‌నిఖీ చేసి, నివేదిక‌ల‌ను సమ‌ర్పించాల్సిందే అని ఆదేశించారు.  *గ

Revanth Reddy: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి

Image
Revanth Reddy: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి  హైద్రాబాద్:   రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సన్న రకాలపై ప్రభుత్వం అందిస్తున్న రూ. 500 విషయంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు. గిట్టుబాటు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా రైతుల్లో భరోసా కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించగా, ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందన్నారు. సన్నరకాలకు తెలంగాణలో బోనస్ అందిస్

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలసిన ట్రైనీ ఐపీఎస్ లు

Image
 ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలసిన ట్రైనీ ఐపీఎస్ లు హైద్రాబాద్, (గూఢచారి): ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని తెలంగాణ కేడర్‌ 2023 మరియు 2024 బ్యాచ్‌ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం గారి నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి  కూడా ఉన్నారు.

*కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల కార్మికుల సంక్షేమం*

Image
 *కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల కార్మికుల సంక్షేమం* - *ఆటో వర్కర్స్ యూనియన్ వనసమారాధనలో దయాకర్ రెడ్డి* *ఖమ్మం, (గూఢచారి ప్రతినిధి నాని): కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల కార్మికుల సంక్షేమం సాధ్యమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని గోపాలపురం మామిడితోటలో ఐ ఎన్ టీ యూ సీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా, అధ్యక్షుడు సిహెచ్. విప్లవ్ కుమార్ ఆధ్వర్యంలో వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దయాకర్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అలాగే కార్మికులకు కూడా తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు. మంత్రి పొంగులేటి, మరో ఇద్దరు జిల్లా మంత్రుల చొరవతో జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పక్షాన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టీ యూ సీ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ. నర్సింహా రెడ్డి, ప్రధా

తమ ఇంట్లో జరిపించే పెళ్లిల భావించి ఓ దివ్యాంగ జంట పెళ్లిని జరిపింంచిన జగిని శ్రీనివాస్ గుప్తా

Image
 తమ ఇంట్లో జరిపించే పెళ్లిల భావించి ఓ దివ్యాంగ జంట పెళ్లిని జరిపింంచిన జగిని శ్రీనివాస్ గుప్తా హైద్రాబాద్: ఓ దివ్యాంగ జంట పెళ్లిని తమ ఇంట్లో జరిపించే పెళ్లిల భావించిన జగిని ఫర్నిచర్స్ అధినేత జగిని శ్రీనివాస్ గుప్తా, రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్,యడవెల్లి బాలరాజు, రామ్ సేవా సమితి చైర్మన్ నర్సింహారావు లు అంగరంగ వైభవంగా ఉచిత వివాహం జరిపించారు. సైదాబాద్ డివిజన్, SBH కాలనీ లోని శ్రీ శ్రీనివాస కమ్యూనిటీ హల్ లో బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా మౌనిక,రాజేష్ ల వివాహాన్ని కన్నుల పండుగగా జరిపారు. నూతన దంపతులకు పుస్తె, మట్టెలు, పెళ్లి బట్టలతో విందు భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్బంగా జగిని శ్రీనివాస్ మాట్లాడుతూ...నిరుపేదలైన రాజేష్-మౌనిక లు వారి పెళ్లి నిమిత్తం మమ్ములను సంప్రదించగా... వారికి మేము అండగా ఉంటామని ధైర్యం చెప్పి ఈ రోజు వారికి ఎలాంటి లోటు లేకుండా ఉచిత వివాహం జరిపించామని తెలిపారు. సామాజిక సేవలో భాగంగా గతంలో కూడా ఇలాంటి ఉచిత వివాహలు ఎన్నో జరిపించామని అన్నారు. నిరుపేదలు, దివ్యంగులు వారి వివాహం కోసం మమ్ములను సంప్రదిస్తే....వారికి అన్ని విధాలుగా అండగా వుంటూ వారి వివాహాన్ని జరుపుతామ

ACB NEWS: జీవీఎంసీ జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం పై ఏ.సీ.బీ. సోదాలు.

Image
  ACB NEWS: జీవీఎంసీ జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం పై ఏ.సీ.బీ. సోదాలు. విశాఖ...మధురవాడ... ఉలిక్కిపడిన జీవీఎంసీ అధికారులు, సిబ్బంది. విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం సహా హైదరాబాద్ లో... మరియు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు గుర్తించిన అధికారులు కేసులు నమోదు. యాంకర్... మధురవాడలోని జీవీఎంసీ జోన్-2 జోనల్ కమిషనర్ పొందూరు సింహచలంపై మంగళవారం ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది.ఉదయం నుంచి ఏసీబీ అధికారులు జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపారు. అవినీతి,అక్రమాలపై సింహాచలంపై వరుసగా ఫిర్యాదులు వాటిపై నిగా ఉంచిన ఏసీబీ అధికారులు తనిఖీలకుదిగారు.వక్రమార్గంలోనే ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు కేసు నమోదు చేశారు.ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు విశాఖ అధికారులు స్థానిక స్పెషల్ జడ్జీ అనుమతితో ఏకకాలంలో ఆరు ప్రదేశాలలో సోదాలు చేపట్టారు.మధురవాడ, మిథిలాపురి కాలనీలోని జోనల్ కమిషనర్ ఇల్లు,మధురవాడలోని జోనల్ కార్యాలయం,శ్రీకాకుళం జిల్లాలోని ఆయన ముగ్గురు బంధువుల ఇళ్లు,హైదరాబాద్ లోని బంధువుల ఇళ్లలోనూ ఏక కాలంలో సోదాలు జరిపి అవినీతి సొమ్మ

Revanth Reddy : వరంగల్‌లో విమానాశ్రయ తక్షణం పనులు ప్రారంభించాలి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Image
  Revanth Reddy : వరంగల్‌లో విమానాశ్రయ తక్షణం పనులు ప్రారంభించాలి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు కి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్ల‌ను భార‌త విమాన‌యాన సంస్థ (AAI)కి అంద‌జేసినట్టు తెలిపారు. ♦️తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , రాష్ట్రానికి చెందిన అందుబాటులో ఉన్న ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ని కలిసి చర్చించారు. ♦️తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ముఖ్యమంత్రి వివరిస్తూ, వరంగల్‌తో పాటు పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్‌లలో ప్రతిపాదిత విమానాశ్రయాల గురించి కేంద్ర మంత్రికి నివేదించారు. ♦️వరంగల్ తో పాటు మిగతా ప్ర

విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపు తో నే విద్యా వ్యవస్థ పటిష్టం

Image
  విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపు తో నే  విద్యా వ్యవస్థ పటిష్టం నల్గొండ, (గూఢచారి):         ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ మార్పు, శిక్షణ, నైపుణ్యాలతో కూడిన విద్య ఇచ్చినప్పుడే  రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టమవుతుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .        మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ విద్యపై నిర్వహించిన ప్రజాభిప్రాయానికి పలువురు విద్యావేత్తలు, మేధావులు, అధ్యాపక, ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులు, ప్రాథమిక విద్య నుండి మొదలుకొని యూనివర్సిటీ విద్య వరకు ప్రొఫెసర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరై ఆయా స్థాయిలలో విద్యను పటిష్టం చేసేందుకు వారి అభిప్రాయాలను తెలియజేశారు.      తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా చైర్మన్ ఏ.మురళి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్య

కూసుమంచి జూనియర్ కళాశాలకు ఫర్నిచర్ ఏర్పాటు చేసిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Image
  కూసుమంచి జూనియర్ కళాశాలకు ఫర్నిచర్ ఏర్పాటు చేసిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం, ( గూఢచారి ప్రతినిధి నాని):  కూసుమంచి మండలానికి నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలకు కంప్యూటర్లు, బీరువా, ఫర్నిచర్ కొంత లోటు ఉండగా కాలేజీ ప్రిన్సిపల్ వీరస్వామి కుసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్చార్జి భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గకి తెలియపరచగా వారు స్థానిక శాసనసభ సభ్యులు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి తెలియపరచగా వారు వెంటనే స్పందించి జూనియర్ కళాశాలకు అవసరమైన ఫర్నిచర్ ను కంప్యూటర్లను ఖమ్మం క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి చేతుల మీదగా ఈరోజు జూనియర్ కళాశాల సిబ్బందికి అందించారు.

బాల సురక్ష కార్యక్రమం సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్* అవేర్నెస్ ప్రోగ్రాం.

Image
 *బాల సురక్ష కార్యక్రమం   సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్* అవేర్నెస్ ప్రోగ్రాం. కోదాడ, (గూఢచారి ప్రతినిధి మిట్టపల్లి శ్రీనివాస్) కోదాడ పట్టణం లోని KSSBM ZPGHS, MPPS ఆజాద్ నగర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదవ తరగతి మరియు నాలుగు, ఐదు తరగతుల బాలికలు సుమారు 200 మందికి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ బాల సురక్ష వాలంటీర్ ఇంపాక్ట్ ట్రైనర్ వీరవిల్లి శ్రీలత బాలికలకు సేఫ్ టచ్ అన్ సేఫ్ టచ్ గురించి వివరించడం జరిగింది. సమాజంలో బాలికల పట్ల ఎన్నో రకాల ఇబ్బందులకి గురి అవుతున్నారు. పిల్లలు శారీరకంగా మానసికంగా ఉండటానికి చైల్డ్ సేఫ్ కు సంబంధించిన కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము. చాలా మంది పిల్లలు తెలిసి తెలియని వయసులో సర్వే ప్రకారం 50 శాతం మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురిఅవుతున్నారు. 2020-22 వరకు సుమారు ఒక లక్ష ఇరవై వేల మంది లైంగిక వేధింపులకు గురి అయ్యారని ప్రభుత్వం వారి అంచనా. ఇది బయటికి తెలిసినవి తెలియనివి కొన్ని వేలు ఉంటాయి ఇలాంటి సొసైటీలో మన పిల్లలు జీవిస్తున్నారు మన పిల్లలకి, పిల్లలు యొక్క తల్లిదండ్రులకి, టీచర్స్ కి, కేర్ టేకర్స్ కి ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశంతో పిల్లలకి సేఫ్ టచ్ అంటే ఏమిటి అన

ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏఈ

Image
 *ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏఈ*   *మేడ్చల్ జిల్లా* : ఘట్ కేసర్ కరెంట్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్. ఓ వ్యక్తి నుండి రూ.15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు. కరెంటు ఏఈ బలరాం నాయక్, లైన్ మెన్ హేమంత్ నాయక్ ఇద్దరు రూ.15,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ మెకానిజం సిస్టమ్ పైన అవగాహన సదస్సు

Image
 కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ మెకానిజం సిస్టమ్ పైన అవగాహన సదస్సు  హైద్రాబాద్, (గూఢచారి): ధర్మ పీఠం నిరాంకర్ అఖడ ఫౌండర్ ట్రస్టీ, ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ మరియు ఉస్మానియా విశ్విద్యాలయాల్లో లో అనుసంధానంగా ఉన్న గెలాక్సీ విద్య సంస్థ లో గెస్ట్ ఫ్యాకల్టీ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ కరణకొట్ నాగేకర్ సాయి కుమార్ చే కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ మెకానిజం సిస్టమ్ పైన విఘ్నేశ్వర హై స్కూల్, జియగూడ హైదరాబాద్ లో అవగాహన సదస్సు నిర్వహించ బడింది. ఈ సదస్సు లో విద్యార్థులకు విద్యాహక్కు చట్టం, బాలల హక్కుల పైన అవగాహన కలిపించారు. .సేవా, భాధ్యత, ధర్మ స్థాపన, న్యాయాపరిపాలన చేకూర్చాలని లక్ష్యం తో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార యంత్రంగా ధర్మ పీఠం నిరాంకర్ అఖడ ట్రస్ట్టు ను 2019 లో సమాజ సేవా చేయాలని ఉద్దేశ్యం తో యోగి నిరాకర్ మహదేవ్ గూరిజి స్థాపించి ఫౌండర్ ట్రస్టీ గా కరణకొట్ నాగేకర్ సాయి కుమార్ నియమించారు. ఈ ట్రస్టు ఆద్వర్యం లో విద్యార్థులకు అవగాహన తేవడానికి నిర్వహించారు. ఈ కార్య్రమంలో ప్రముఖులు హుసానొద్దీన్, కార్మిక, రాజకీయ నాయకులు ద రుపల్లి నరసింహులు, ప్రముఖ జర్నలిస్టు దరుపల్లి లక్ష్మణ్, సా

ఇండస్ట్రీల నుండి తెచ్చిన ప్రమాదకరమైన కెమికల్స్ ను గుట్టుచప్పుడు కాకుండా మూసిలోకి*

Image
 *ఇండస్ట్రీల నుండి తెచ్చిన ప్రమాదకరమైన కెమికల్స్ ను గుట్టుచప్పుడు కాకుండా మూసిలోకి* *బట్టబయలయిన కెమికల్ స్కాం*  * హైద్రాబాద్ పీసీబీ అధికారుల నిఘా వైఫల్యం*  హైద్రాబాద్, (గూఢచారి): నిఘా పెట్టడం లో హైద్రాబాద్ పీసీబీ అధికారుల వైఫల్యం తో మూసిలోకి కెమికల్స్. లంగర్ హౌస్ త్రివేణి సంఘం వద్ద తాండూర్ కర్ణాటక పటాన్ చెరు, షాద్నగర్, తదితర ఇండస్ట్రీల నుండి తెచ్చిన ప్రమాదకరమైన కెమికల్స్ ను గుట్టుచప్పుడు కాకుండా మూసిలో వదులుతున్నారు. మూసి వెంబడి ఖాళీ స్థలంలో కబ్జా చేసి అందులో ఇసుక వ్యాపారం లారీల పార్కింగ్ పెట్టి, ఎవరికి అనుమానం రాకుండా ఆ స్థలం నుండి మూసిలోకి ఏకంగా పైప్ లైన్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పైప్ లైన్ ద్వారా ప్రతిరోజు కనీసం 8 నుండి 10 భారీ ట్యాంకర్లను తెచ్చి కెమికల్స్ ని మూసిలో వదులుతున్నారు .  దీనివల్ల ఇక్కడ మూసి కలుషితం కావడంతో పాటు, దుర్గంధం, స్థానికులు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు.  లారీలు రావడం గమనించిన స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా  నాలుగు లారీలతో పాటు పారిపోయారు  కెమికల్ కాళీ చేస్తున్న లారీని మాత్రం ప్రస్తుతం పట్టుకున్నారు  భారీ ట్యాంకర్ కావడంతో  ఒక్క ట్యాంకర్ ఒక ట్రిప్

జీహెచ్‌ఎంసీ పరిధిలోని హౌసింగ్‌ సొసైటీలకు భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు

Image
  హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని హౌసింగ్‌ సొసైటీలకు భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులకు వివిధ ప్రభుత్వాలు కేటాయించే భూములపై ఈ తీర్పు ప్రభావం చూపుతుంది. ఈ కేటాయింపులను సవాల్ చేస్తూ రావు బి. చెలికాని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్షుణ్ణంగా చర్చించిన తర్వాత, కేటాయింపులు చెల్లవని ప్రకటిస్తూ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ముఖ్యంగా, కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు నివాస స్థలాలను కేటాయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 8న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేటాయింపు పత్రాలను వేడుకగా అందజేశారు. అయితే, సుప్రీంకోర్టు నిర్ణయం ఈ సొసైటీలకు కేటాయించిన భూముల యాజమాన్యం మరియు చట్టపరమైన హోదాపై అనిశ్చితిని కలిగి ఉంది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వాల భూ పంపిణీ ప్రక్రియ మరియు అటువంటి కేటాయింపుల చట్టబద్ధత గురించి విస్తృత ప్ర

మేము నివాసం వుంటున్న యిల్లు బఫర్ జోన్లో లేదు - హైడ్రా కమిషనర్ రంగనాథ్.

Image
 మేము నివాసం వుంటున్న యిల్లు బఫర్ జోన్లో లేదు - హైడ్రా కమిషనర్ రంగనాథ్. * మధురా నగర్లో మేము నివాసం వుంటున్న యిల్లు 4 దశాబ్దాల క్రితం మా నాన్నగారు నిర్మించినది. * కృష్ణకాంత్ పార్కు దిగువున వున్న వేలాది యిళ్ళ తర్వాత మా యిల్లు ఉంది.  * మా నాన్నగారు నిర్మించిన ఈ యిల్లు బఫర్ జోన్లో వుందని కొన్ని సామాజిక మాధ్యమాల్లో పాటు పేపర్లలో వచ్చిన వార్తలో వాస్తవం లేదు. * ఒకప్పటి పెద్ద చెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. * అయినప్పటికీ చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కిందన వున్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు. * అయినప్పటికీ కట్టకు దాదాపు కిలో మీటర్ దూరంలో మేము నివాసం వుంటున్న యిల్లు వుంది.  * వాస్తవాలు యిలా వుంటే తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని ఖండిస్తున్నాను.   * వాస్తవాలు యివి. ------------------ - మా నాన్న శ్రీ ఎ.పి.వి.సుబ్బయ్య గారు 1980 సంవత్సరంలో మేము వుంటున్న యింటిని నిర్మించారు.  - 44 సంవత్సరాల క్రితం నిర్మించిన అదే ఇంట్లో మా తండ్రితో కలిసి ఉంటున్నాము.

చిన్న పత్రికలకు అన్యాయం చేయొద్దు

Image
*చిన్న పత్రికలకు అన్యాయం చేయొద్దు*   *అక్రిడిటేషన్ లను పెంచాలి*   *చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబా*  హైద్రాబాద్(గూఢచారి): చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు గతంలో ఉన్న మాదిరిగానే ఐ అండ్ పిఆర్ నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం బషీర్ బాగ్ లోని దేశోద్ధారక భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన యూసుఫ్ బాబు మాట్లాడుతూ చిన్న పత్రికల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా కొందరు అధికారులు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలు తిప్పికొట్టేందుకు అందరూ సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ లను అమ్ముతున్నామన్న ప్రచారం అవాస్తవం అన్నారు. అలాంటి వాళ్ళను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో రానున్న అక్రిడిటేషన్ల నూతన జీవోపై ఇప్పటినుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే ఐ అండ్ పి ఆర్ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్లను కలిసి అక్రిడేషన్ల విషయమై చర్చించాలని తెలిపారు. పాత జీవోలో ఉన్న గ్రేడింగ్ల వి

*కొందరు అధికారులు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన* *చిన్న పత్రికలకు అన్యాయం చేయొద్దు*

Image
 *కొందరు అధికారులు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన* *చిన్న పత్రికలకు అన్యాయం చేయొద్దు*   *అక్రిడిటేషన్ లను పెంచాలి*   *చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబా*  చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు గతంలో ఉన్న మాదిరిగానే ఐ అండ్ పిఆర్ నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం బషీర్ బాగ్ లోని దేశోద్ధారక భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన యూసుఫ్ బాబు మాట్లాడుతూ చిన్న పత్రికల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా కొందరు అధికారులు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలు తిప్పికొట్టేందుకు అందరూ సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ లను అమ్ముతున్నామన్న ప్రచారం అవాస్తవం అన్నారు. అలాంటి వాళ్ళను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో రానున్న అక్రిడిటేషన్ల నూతన జీవోపై ఇప్పటినుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే ఐ అండ్ పి ఆర్ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్లను కలిసి అక్రిడేషన్ల విషయమై చర్చించాలని తెలిప

మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య తృతీయ వర్ధంతి

Image
  మాజీ ముఖ్యమంత్రి   కొణిజెటి రోశయ్య  తృతీయ వర్ధంతి హైద్రాబాద్, (గూఢచారి): డిసెంబర్ 4వ తారీఖు రోజున మాజీ ముఖ్యమంత్రి  కొణిజెటి రోశయ్య  తృతీయ వర్ధంతి రోజున హైద్రాబాద్ హైటెక్ సిటీ, HICC హోటల్ లో ఉదయం 11: 00గంటలకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,  ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత  విచ్చేయు చున్నారనీ తెలిపారు.  ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై మన ఐక్యమత్యం చాటుకోవాలని  నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారికి  బస్సు  సౌకర్యం, భోజనం  వసతి  ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థలం హైదరాబాద్ ఇట్లు *యల్ వీ కుమార్* *Mobile: 98480 50321* 🙏🙏🙏🙏🙏🙏🙏

హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడులు

Image
 *హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడులు*  హైద్రాబాద్, గూఢచారి:  *ఓ కేసు క్లోజ్ చేసేందుకు ఓ వ్యక్తి వద్ద నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ బండ్లగూడ పోలీస్ స్టేషన్ SI పవన్, కానిస్టేబుళ్లు రామకృష్ణ & సంతోష్ కుమార్*.  *ఓ వ్యక్తి వద్ద నుండి పోలీస్ స్టేషన్ లో 15 వేల రూపాయిలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ పోలీసులు* 22.11.2024న 1920 గంటల సమయంలో AO-1 R. పవన్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, బండ్లగూడ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ సిటీ, అతను రూ. 30,000/- డిమాండ్ చేసి, రూ. 15,000 లంచం తీసుకుంటుండగా ACB, హైదరాబాద్ సిటీ రేంజ్-2 యూనిట్ పట్టుకున్నారు. /- ఫిర్యాదుదారు నుండి AO-2 Ch.రామకృష్ణ, పోలీస్ కానిస్టేబుల్, బండ్లగూడ ద్వారా పోలీసు స్టేషన్, హైదరాబాద్ సిటీ అధికారికంగా అనుకూలత చూపినందుకు అంటే "ఫిర్యాదుదారుపై నమోదైన బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లోని Cr.No.116/2024లో కేసును మూసివేయడం. P.S. బండ్లగూడలోని AO-3 B.సంతోష్ పోలీస్ కానిస్టేబుల్ కూడా రూ. 2000/- డిమాండ్ చేసి స్వీకరించారు. కేసును ముగించడంలో ఫిర్యాదుదారునికి సహాయం చేసినందుకు ఫిర్యాదుదార

*సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాసేవకు అంకితం కావలి: మల్టీ జోన్ -1 ఐజీపీ*

Image
*సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాసేవకు అంకితం కావలి: మల్టీ జోన్ -1 ఐజీపీ* *ఘనంగా ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఆవుట్ పరేడ్ (దీక్షాంత్‌ పరేడ్‌..)* ఖమ్మం, (గూఢచారి ప్రతినిధి నాని) : సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాసేవకు అంకితం కావాలని మల్టీ జోన్ -1 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.  తొమ్మిది నెలల బేసిక్‌ ఇండక్షన్‌ శిక్షణను పూర్తి చేసుకున్న 263 ఏఆర్, సివిల్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (దీక్షాంత్‌ పరేడ్‌) గురువారం సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం ఏస్పీ రోహిత్ రాజ్ హజరైయ్యారు. ముఖ్య అతిథిగా హజరైన మల్టీ జోన్ -1 ఐజీపీ ముందుగా ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో వివక్ష చూపమనీ, తమ సేవలతో దేశ ప్రతిష్ట పెంచుతామని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ప్రతిజ్ఞ చేశారు.  ఈ సందర్భంగా ఐజీపీ గారు మాట్లాడుతూ..సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం వున్న పోలీస్ శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ఈరోజు నుండి పోలీస్ శాఖలో పూర్తి భా

ACB raids | అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్

Image
  ACB raids | అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ సంగారెడ్డి జిల్లా, (గూఢచారి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొనసాగుతున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు.   హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ( Ameenpur Municipality) కార్యాలయంలో ఏసీబీ రైడ్స్(ACB raids) కొన సాగు తున్నాయి. ఏసీబీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందంతో సోదాలు చేపట్టారు. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో కలిసిన గ్రామాలకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన పలు పర్మిషన్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

20 వేలు లంచం తీసుకుంటూ ACB పట్టుబడిన సర్వే డిపార్టుమెంటు సీనియర్ డ్రాఫ్ట్ మాన్

Image
 20 వేలు లంచం తీసుకుంటూ ACB పట్టుబడిన సర్వే డిపార్టుమెంటు సీనియర్ డ్రాఫ్ట్ మాన్  మహబూబాబాద్ జిల్లా, (గూఢచారి):  మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ACB పట్టుబడిన సీనియర్ డ్రాఫ్ట్ మాన్ (SDM) అధికారి జ్యోతి శర్మ బాయ్ కొనసాగుతున్న విచారణ

ఏఎస్సైలు గా పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

Image
  *ఏఎస్సైలు గా పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్* ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో హెడ్ కానిస్టేబుల్ గా భాధ్యతలు నిర్వహిస్తూ...ఏఎస్సైలు పదోన్నతి పొందిన ఐదుగురు పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు అభినందించారు. ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏఎస్సైలు గా పదోన్నతి పొందిన వారు పోలీస్ కమిషనర్ గారిని కలిశారు. పదోన్నతి పొందిన వారిలో SK. నూరుద్దీన్,కె. నాగేశ్వరరావు, బి.వి.ఆర్. రాజు,ఐ.చిన్నారావు,ఎస్.శ్రీనివాసరావు వున్నారు.  కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా& ఆర్డర్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.                           

భారత సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేలా "లోక్‌మంథన్ "

Image
 భారత సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేలా "లోక్‌మంథన్ " హైద్రాబాద్, (గూఢచారి):  అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగర్ వేదిక కానుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమైంది. సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం (లోక్ మంథన్) అంగరంగ వైభవంగా సాగనుంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాదులో నిర్వహించే లోక్‌మంథన్ (జాన పద వేడుక )కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ గారితో పాటు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,పలువురు గవర్నర్లు, ఆచార్య మిథిలేష్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా వివిధ రంగాల ప్రముఖులు వేడుకకు హాజరు కానుండటం విశేషం. కేంద్ర మంత్రి, లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా జి. కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. దేశంలోని జానపద కళాకారులు అందరినీ ఏకం చేసి, వారి ప్రతిభాపాటవాలు నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదికను ఏర్పాటు చేసింది ప్రజ్ఞా ప్రవాహ్ అనే సంస్థ. లోక్ మంథన్ అంటే జానపద మేళా అని చెప్పవచ్చు. వనవాస

ACB నెట్‌లో సహాయ ఇంజనీర్

Image
 ACB నెట్‌లో సహాయ ఇంజనీర్    గద్వాల్, గూఢచారి: 2024 నవంబర్ 18న 1310 గంటలకు గద్వాల్ జిల్లా, ఇటిక్యాల్ మండల, పంచాయితీ రాజ్ శాఖ, సహాయ ఇంజనీర్ పండు రంగరావు అనుకూలత కోసం ఫిర్యాదుదారుడి నుండి రూ. 50,000/-ను డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు ACB, మహబూబ్ నగర్ యూనిట్ చేత పట్టుబడ్డారు. "ఫిర్యాదుదారుడు నిర్వహించిన మైనారిటీ కమ్యూనిటీ హాల్ పనుల కొరకు కొలత పుస్తకం నమోదు చేయడం మరియు బిల్‌ను ముందుకు పంపించడం" అని పేర్కొనబడింది. ఈ నిందిత అధికారికుడు తన ప్రజా విధిని తప్పుగా మరియు అవినీతిగా నిర్వహించాడు.   రంగరావు వద్ద ఉన్న ఆ బ్రైబ్ మొత్తాన్ని అతని సూచనపై స్వాధీనం చేసుకున్నారు. అయన యొక్క రెండు చేతి వేళ్లు మరియు ప్యాంట్ యొక్క ఎడమ వైపు ముందువైపు జేబు రసాయన పరీక్షలో సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. పండు రంగరావు, సహాయ ఇంజనీర్ పంచాయితీ రాజ్ శాఖ, ఇటిక్యాల్ మండల, గడ్వాల్ జిల్లా అరెస్టు చేయబడుతున్నారు. మరియు నాంపల్లి, హైదరాబాద్‌లో SPE మరియు ACB కేసుల కొరకు గౌరవనీయమైన 1వ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టబడుతున్నారు. కేసు విచారణలో ఉంది.   కాల్ ఫోన్ నంబర్ 1064 (టోల్ ఫ్రీ నంబర్)   ఏదైనా ప్రజా సే

ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు.. అరెస్ట్ నుంచి రక్షించలేమన్న హైకోర్టు!

Image
 ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు.. అరెస్ట్ నుంచి రక్షించలేమన్న హైకోర్టు! చంద్రబాబు, పవన్ లపై గతంలో వర్మ అనుచిత పోస్టులు కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు అరెస్ట్ నుంచి తనను రక్షించాలని వర్మ పిటిషన్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచన ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే... గత ఎన్నికలకు ముందు 'వ్యూహం' చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం రేపు పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి

నగరంలో ఐటీ సోదాలు

Image
 నగరంలో ఐటీ సోదాలు...  పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు... బంజారాహిల్స్ లోని  స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న సోదాలు.. కల్పన రాజేందర్, లక్ష్మణ్ నివాసాల్లోనూ సోదాలు... చేవెళ్ల, షాద్ నగర్ లో కూడా సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు...

సీల్వెల్ కార్పొరేషన్ సీఎండి బండారు సుబ్బారావు పుట్టినరోజు సందర్భముగా ఉచిత బోజనాలు

Image
. సీల్వెల్ కార్పొరేషన్ సీఎండి బండారు సుబ్బారావు పుట్టినరోజు సందర్భముగా ఉచిత బోజనాలు హైద్రాబాద్, గూఢచారి:  ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చీఫ్ అడ్వైజర్, సీల్వెల్ కార్పొరేషన్ సీఎండి బండారు సుబ్బారావు పుట్టినరోజు సందర్భముగా 18-11-2024, మధ్యాహ్నం 1.00 గంటలకు గాంధీ హాస్పిటల్ వద్ద 1,000 మందికి ఉచిత భోజనాలు వామ్ నేషనల్ అడ్వైజర్ కౌటికే విఠల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.