ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ ఇంటి స్థలం మ్యుటేషన్ లో లంచం డిమాండ్ చేసి బాధితుడి వద్ద నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది మెదక్ ( గూఢచారి) : ఇంటి స్థలం మ్యుటేషన్ లో లంచం డిమాండ్ చేసి బాధితుడి వద్ద నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మెదక్ పట్టణం కు చెందిన శైలజ కు సర్వేనెంబర్ 505/1/2 లో 605 గజాల ఇంటి స్థలం ఉంది. భూమి మ్యుటేషన్ కోసం గత నెలలో దరఖాస్తు చేసింది. కానీ మ్యుటేషన్ కోసం మున్సిపల్ ఆర్ ఐ జానయ్య ను సంప్రదించగా పని చేయలేదు. దీంతో పలు మార్లు అతని వద్దకు వెళ్లిన ప్రయోజనం కలగలేదు. దీంతో విషయం సోదరుడు ధర్మకారి శివకుమార్ కు చెప్పడంతో మున్సిపల్ ఆర్ ఐ వద్దకు వెళ్లి మ్యుటేషన్ చేయాలని కోరగా అందుకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమండ్ చేసినట్లు తెలిపారు. ఇందుకు రూ.12 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ప్రభుత్వ అధికారి లంచం అడగడంతో శివకుమార్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు ...