వాహనాల తనిఖీలో మద్యం పట్టివేత


 *వాహనాల తనిఖీలో మద్యం పట్టివేత*...

గూఢచారి సూర్యాపేట, 1 డిసెంబర్

దూరాజ్ పల్లి ఎక్స్ రోడ్ వద్ద సిబ్బంది తో యుక్తముగా వాహనాల తనిఖీ చేస్తుండగా TG 29 T 0002 నెంబరు గల ఏర్టిగా కారును తనిఖీ చేయగా కారు యందు ఎటువంటి అనుమతులు లేకుండా (11) ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్ కాటన్ లు సూర్యాపేట నుండి మున్యా నాయక్ తండా కు తరలిస్తుండగా కారు డ్రైవర్ ధారవత్ సైదా మరియు అట్టి సరుకు కొనుగోలు చేసిన వ్యక్తి ధరవాత్ నాగు లను విచారించి పంచనామా జరిపి మద్యాన్ని కారును సీజ్ చేసి చివ్వేంల పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి కేసు నమోదు చేసారు. సీజ్ చేసిన మొత్తం మద్యం 528 క్వార్టర్ బాటిల్స్ విలువ లక్ష రూపాయలు వుంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భముగా గ్రామాల యందు ఎవరైనా తమ ఇండ్ల వద్ద గాని షాపుల యందు గాని మరియు మద్యం రవాణా చేసినట్లు ఉంటే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొనబడునని చివ్వెంల ఎస్ఐ వి.మహేశ్వర్ హెచ్చరించారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*