Skip to main content

Posts

Showing posts with the label TELANGANA

మే 28 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణ లో  మే 28 117 కరోనా పాజిటివ్ కేసులు.. తెలంగాణ లో 66 ఇతర రాష్ట్రాలు 2, సౌదీ నుంచి వచ్చిన వాళ్లలో 49  

నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా మొరిశెట్టి

నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా మొరిశెట్టి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గా మొరిశెట్టి నాగేశ్వర్ రావును    నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి  నియమించారు. ఈ సందర్బంగా మొరిశెట్టి మాట్లాడుతూ నా పై నమ్మకంతో నియమించిన జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి కి  మరియు  రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులకు కార్యకర్తలకు బిజెపి తన అభిమానులకు  అందరికి   ధన్యవాదాలు తెలిపారు.

కత్తులతొ సంచరిస్తున్న యువకుని అదుపులొకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు

కత్తులతొ సంచరిస్తున్న యువకుని అదుపులొకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు హైద్రబాద్ పాతబస్తి రేయిన్ బజార్ పొలిసు పరిధిలొ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తు రెండు కత్తులు వెంటపెట్టుకుని తిరుగున్న 20 సంవత్సరాల అబ్దుల్ అద్నాన్ అనే యువకుని అదుపులొకి తిసుకుని రెండు ర్యాంబొ కత్తులు స్వాధినము చేసుకుని స్థానిక రేయిన్ బజార్ పొలిసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పొలిసులు.

అమృత్ పథకం పనులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

మిర్యాలగూడ,నల్గొండ పట్టణం లో అమృత్ పథకం,దేవరకొండ పట్టణం లో మిషన్ భగీరథ పనుల పై సమీక్ష నల్గొండ,మే 27. నల్గొండ,మిర్యాలగూడ పట్టణాల లో చేపట్టిన అమృత్ పథకం కింద చేపట్టిన పనులు,దేవరకొండ అర్బన్ మిషన్ భగీరథ ఆన్యూటీ మోడ్ పనుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నల్గొండ,మిర్యాలగూడ పట్టణం లలో అమృత్ పనులు,దేవరకొండ పట్టణంలో మిషన్ భగీరథ అర్బన్ పనుల పై నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ మున్సిపల్ కమిషనర్ లు,పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల తో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశానికి శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్ భాస్కర్ రావు,రవీంద్ర కుమార్ లు హజరయ్యారు. దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ మిషన్ భగీరథ  ఆన్యూటీ మోడ్ లో పట్టణం లో చేపట్టిన పనులు అసంపూర్తి గా వున్నట్లు తెలిపారు.పట్టణం లో ఒకట వ వార్డ్ లో త్రాగు నీరు సరిగా రావటం లేదని,పనులు అసంపూర్తి గా వున్నట్లు,మార్కెట్ యార్డ్ పరిధి లో ఇండ్లకు త్రాగు నీరు రావటం లేదని, స్లూయిజ్ వాల్వ్ ఏర్పాటు చేయాలన

వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఇన్ కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్

వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఇన్ కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అమీర్‌పేట లోని వ్యభిచార గృహం పై ఎస్సార్ నగర్ పోలీసుల దాడి. ముగ్గురుయువతులతో పాటు పట్టుబడ్డ ఇన్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ భుక్య ముంబై ఎం కె రోడ్డు లోని అయకార్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న నాగేందర్

మే 26 తెలంగాణ కరోనా బులిటెన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఇవాళ  71 పాజిటివ్ కేసులు నమోదు తెలంగాణ లో ఇప్పటి వరకు 1991 కేసులు నమోదు ఇవ్వాళ కొత్తగా ఒకరు మృతి. ఇప్పటి వరకు మొత్తం 57కి చేరిన మృతుల సంఖ్య. తెలంగాణా లో 650 అక్టీవ్ కేసులు ఇవాళ 120 మంది  డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి. ఇప్పటి వరకు 1284 మంది డిశ్చార్జి ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 38 12 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి. విదేశాల నుంచి వచ్చిన వారికి 4మందికి కొరొనా పాజిటివ్ నమోదు. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చెల్ 6,-  సూర్యాపేట్, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పెట్ లో ఒక్కో కేసు నమోదు

సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  -   హై కోర్ట్

సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  -   హై కోర్ట్ సూర్యాపేట లో టెస్టులు చేయడం లేదని   బిజెవైయం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకీనేని వరుణ్ రావు వేసిన పిల్ పై విచారణ చేసి సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  అని తేల్చి చెప్పిన హై కోర్ట్. సూర్యాపేట లో టెస్టులు చేయకపోవడంపై  చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహన్ జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం మూడు గంటల పాటు  విచారణ చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం ఎమైన  ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని ప్రభుత్వం పై మండిపడ్డా కోర్ట్ లక్షణాలు ఉన్న లేకున్నా టెస్టులు చేయాల్సిందే ఏప్రిల్ 24 తర్వాత కేవలం 35 టెస్టులు మాత్రమే చేసి రెడ్ జోన్ నుండి గ్రీన్ జోన్ గా మార్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం అడుతారా అని తీవ్రంగా సీరియస్ అయిన కోర్ట్  సూర్యాపేటతో పాటు తెలంగాణ అంతటా టెస్టులు నిర్వహించి జాతీయ సగటును అందుకోవాలని ఆర్డర్   వలస కార్మికుల కోసం తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించిన  కోర్ట్

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి - దర్యాప్తు చేపట్టిన పోలీసులు

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి    LB నగర్ లోని సాగర్ రింగ్ రోడ్ లోని అలేఖ్య టవర్స్ లో 14 వ అంతస్తు లో నివసిస్తున్న రఘురాం పద్మ కూతురు సాహితీ ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (BDS) నాలుగో సంవత్సరం చదువుతున్న సాహితీ ఈరోజు మధ్యాహ్నం సమయంలో తన నివాసంలోనే 14 వ అంతస్తు నుండి బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుండి దూకి ఆత్మహత్య   సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు...

మే 21 తెలంగాణ కరోనా బులిటెన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ ఇవాళ రాష్ట్రంలో   38 పాజిటివ్ కేసులు నమోదు ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం.  కేసులు నమోదు 1699 కరోనా తో ఇవాళ   5 మృతి ఇప్పటి వరకు మొత్తం 45 మంది మృతి తెలంగాణా లో అక్టీవ్ కేసులు 618 ఇవాళ 23  డిశ్చార్జి ఇప్పటి వరకు  1036 మంది డిశ్చార్జి ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 26  పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి..10 రంగారెడ్డి 2 ఇప్పటి వరకు రాష్ట్రంలో  99 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు కరోనా  

రైతులకు సలహాలు,సూచనలు  అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర -  నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

రైతులకు సలహాలు,సూచనలు  అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర -  నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ వ్యవసాయ రంగంలో వస్తున్న వస్తున్న మార్పులు,లాభసాటి వ్యవసాయ సాగుకు క్షేత్ర స్థాయిలో రైతులకు సలహాలు,సూచనలు  అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని  నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏ.ఈ. ఓ.లు) వ్యక్తిత్వ వికాస శిక్షణ,ఒత్తిడి అధిగమించడం పై  నిర్వహించిన  శిక్షణ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ది కి,రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయ విస్తరణ అధికారులు నియామకం జరిగినప్పటి నుండి ఎటువంటి వ్యక్తిత్వ వికాస శిక్షణ, స్ట్రెస్ మేనేజ్ మెంట్ పై శిక్షణ నివ్వలేదని,రానున్న రోజుల్లో వ్యవసాయ అధికారుల పై మరింత ఒత్తిడి వుంటుందని, ఈ శిక్షణ ద్వారా ఉద్యోగ పరంగా ఒత్తి

గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు పని కల్పించడం లో నిర్లక్ష్యం వహించవద్దు - జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్గొండ,మే 20..మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు పని కల్పించడం లో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.ఉపాధి హామీ కింద పని కోరిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎం.పి.డి. ఓ.లు, ఎం.పి. ఓ.లు,ఏ.పి. ఓ.లు,, పంచాయతీ కార్యదర్శులు,ఈ జీ ఎస్ సిబ్బంది తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పనులు,నర్సరీలు నిర్వహణ,మొక్కల సంరక్షణ తదితర అంశాలు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 844 గ్రామ పంచాయతీ ల్లో ఒక లక్షా 53 వేల 290 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వస్తున్నారని,ప్రతి జి.పి.లో సరాసరి 197 మంది హజరు అవుతున్నారని,సరాసరి ప్రతి జి.పి.లో 250 మంది వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఒక్కొక్కరికి సరాసరి 137 రూ. ల వేతనం వస్తుందని,వచ్చే వారం నాటికి సరాసరి వేతనం165  రూ.లు చెల్లించేలా పనులు కల్పించాలని సూచించారు. నర్సరీల లో మొక్కలు జి.పి.గ్రీన్ ప్లాన్ ప్రకారం పెంచాలని,పంచాయతీ కార్యదర్శులు మొక్కలు సంరక్షణ బాధ్యత వహించాలని అన్నారు.ముఖ్యంగా పండ్ల మొక్కలు పెంపకం చేపట్టాలని,జామ,ఉసిరి,బొప్

మాస్కులు దరించక పోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరిక

మాస్కులు దరించక పోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరిక మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరించారు.  కరోనా లాక్ డౌన్  మే 31వరకు పొడిగించినట్లు ప్రకటించిన కేసీఆర్.  కేబినెట్ సమావేశం అనంతరం పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచే నడుస్తాయని,  జిల్లాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్‌ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.  కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. 'హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతినిస్తున్నాం. హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులు తిరగవు. మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవు. ఆర్టీసీ బస్సులు కోవిడ్‌-19 జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు. పరిశ్రమలన్నింటికీ అనుమతి. హైదరాబాద్‌ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరవాలి.  సినిమ

గాలివాన బీభత్సనికి  ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయిన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి

గాలివాన బీభత్సనికి  ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయిన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ మండలం రాములబండ గ్రామంలో నిన్న  వచ్చిన గాలివాన బీభత్సనికి కూలిపోయిన విద్యుత్ స్తంభాలు విరిగిపడిన భారీ వృక్షాలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి  నిరాశ్రయు లైన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మరియు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి స్థానిక సర్పంచ్ రూపని జయమ్మ కార్యదర్శి సింగిల్విండో ఉపాధ్యక్షులు తవిటి కృష్ణ స్థానిక నాయకులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు

పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నాం-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నాం-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   నల్గొండ,మే 18 .రాష్ట్ర ప్రభుత్వం,వ్యవసాయ శాఖ సూచించిన విధంగా వానాకాలం లో పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.సోమవారం హైద్రాబాద్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ,రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ లు,అదనపు కలెక్టర్ లు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు,సహకార,ఉద్యాన శాఖ,రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుల తో మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వానాకాలం సీజన్ లో నియంత్రిత పద్దతిలో ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు వేయడం పై సుదీర్ఘంగా వివరించి జిల్లా కలెక్టర్ లు,రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుల తో జిల్లా పరిస్థితులు తెలుసుకొని సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ గత సంవత్సరం వానాకాలం సీజన్ లో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు,ఇందు లో 6.7లక్షలు ఎకరాలు పత్తి,3.4 లక్షల ఎకర

వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేసి గ్రామాలకు త్రాగు నీరు అందించాలి

వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేసి గ్రామాలకు త్రాగు నీరు అందించాలి జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం లో ఎం.పి.లు,శాసన సభ్యులు మిషన్ భగీరథ పనుల పై తీవ్ర అసంతృప్తి పోతిరె డ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి  3 టి.యం.సి.నీటిని డ్రా చేస్తూ జి. ఓ.203 జారీ వ్యతిరేకిస్తూ సభ ఏకగ్రీవ తీర్మానం నల్గొండ,మే 16.దక్షిణ తెలంగాణ ప్రాంతంకు ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రాంతం కు తీవ్ర అన్యాయం జరిగేలా  ఏ.పి.రాష్ట్రం పోతి రెడ్డి పాడు రెగ్యులేటర్ నుండి అక్రమంగా జి. ఓ 203 జారీ చేసి 3 టి.యం.సి నీటిని డ్రా చేయడం పట్ల వ్యతిరేకిస్తూ  జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం లో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ తీర్మానం చేశారు.శని వారం జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించి పంచాయతీ రాజ్,కరోనా నియంత్రణ చర్యలు, మిషన్ భగీరథ పనులు తదితర అంశాల పై సమీక్షించారు.సభ ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య మాట్లాడుతూ పోతిరె డ్డిపాడు నుండి అక్రమంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 3 టి.యం.సి  నీటిని తరలించడం పట్ల వ్యతిరే కిస్తూ తీర్మానం చేయాలని మాట్లాడగా హజరైన సభ్యులు బల పరుస్తూ సభలో ఏకగ్రీ

టెలి కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం

టెలి కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం    ప్రపంచమంతా కరోనా దరిమిలా  ఎక్కడి  కక్కడ  కొత్త పద్దతులతో  జీవించాల్సిన  పరిస్థితులు  వచ్చాయని , తప్ప ని పరిస్థితులలో  నూతన  పద్దతుల ను  అవలంభించడం  జరుగుతుందని మంత్రి  జగదీశ్  రెడ్డి   చెప్పారు . ఇందులో  భాగంగానే  టెలి కాన్ఫరెన్స్ ద్వారా   నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం  నిర్వహించు కోవడం  జరిగిందని  , ఇందుకు  సహకరించిన  మునిసిపల్  కౌన్సిల్  సభ్యులకు కృతజ్ఞతలు  తెలిపారు . శుక్రవారం  103 కోట్ల 14 లక్షల 65 వేల తో  2020 -21 ఆర్థిక  సంవత్సరానికి  గాను  బడ్జెట్ అంచనా , 2019 -20  సంవత్సర  సవరింపు  బడ్జెట్  అంచనా  ఆమోదానికి  గాను శుక్రవారం  కౌన్సిలర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మునిసిపల్  బడ్జెట్   సమావేశం   నిర్వహించారు .  నల్గొండ  మున్సిపల్  కార్యాలయం లోని  సమావేశ  మందిరం  నుండి  నిర్వహించిన  ఈ సమావేశానికి  ముఖ్య అతిధిగా  హాజరైన  రాష్ట్ర విద్యుత్  శాఖ మంత్రి  గుంత కండ్ల  జగదీశ్  రెడ్డి   మాట్లాడుతూ  కరోనా  నేపథ్యం లో  కొత్త  పద్దతుల  ద్వారా  ఎక్కడికక్కడ  కార్యక్రమాలు  నిర్వహించడం  జరుగుతుందని , ఇందులో  భాగంగానే   నల్గొండ

వానా కాలామ్ పంటకు ఎరువులు,విత్తనాలు అందు బాటులో ఉన్నాయి - రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి

వానా కాలామ్ పంటకు రైతులకు ఎరువులు,విత్తనాలు అందు బాటులో ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం పంటకు ఎరువులు,విత్తనాలు సరఫరా, యాసంగీ ధాన్యం కొనుగోళ్లు సమీక్షించారు.జిల్లాలో ఎరువులు రెండు లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల వానాకాలం సాగుకు అవసరం కాగా అందులో 80,000 మెట్రిక్ టన్నులు యూరియా,36,000  డి. ఏ.పి.,66,000 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు అవసరం కాగా, యూరియా,డి. ఏ.పి.,కాంప్లెక్స్ ఎరువులు 29,000 మెట్రిక్ టన్నులు అందు బాటులో వుందని వ్యవసాయ అధికారులు మంత్రికి వివరించారు. ఇందు లో 11,000 మెట్రిక్ టన్నుల యూరియా,2700 మెట్రిక్ టన్నుల డి. ఏ.పి.,13600 కాంప్లెక్స్ ఎరువులు అందు బాటులో వున్నట్లు వారు వివరించారు.ఎప్పటి కప్పుడు వచ్చిన ఎరువుల ర్యాక్ పి. ఏ.సి.ఎస్.,డీలర్ లకు పొజిషన్ చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు 1900 మెట్రిక్ టన్నులు ఎరువులు డీలర్ లు,పి. ఏ.సి.ఎస్., అగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా రైతుల కు విక్రయించి నట్లు అధికారులు

రెవెన్యూ పెండింగ్ కోర్ట్ కేసులు సమీక్షించిన జిల్లా కలెక్టర్

    రెవెన్యూ పెండింగ్ కోర్ట్ కేసులు సమీక్షించిన జిల్లా కలెక్టర్  రెవెన్యూ శాఖ కోర్ట్ కేసులకు సంబంధించి  కౌంటర్ లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.గురు వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో అర్.డి. ఓ.లు,తహశీల్దార్ లతో సమావేశం నిర్వహించి రెవెన్యూ పరంగా హైకోర్టు లో దాఖలు చేసిన పెండింగ్ కేసుల ను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, పట్టా భూములకు సంబంధించి హై కోర్ట్ లో దాఖలు చేసిన కేసుల కు సంబంధించి కౌంటర్ లు దాఖలు చేయాలని తహశీల్దార్ లు,అర్.డి. ఓ.లను కలెక్టర్ ఆదేశించారు.అదే విధంగా ప్రభుత్వ ఆదేశాల ననుసరించి నియోజక వర్గాలలో ఒక్కొక్క నియోజక వర్గంలో గోదాముల నిర్మాణం కు 15 నుండి 20 ఎకరాలు గుర్తించి నట్లు,గుర్తించిన స్థలం గోదాం ల నిర్మాణం చేయుటకు అనువుగా వున్నదా లేదా కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అర్.డి. ఓ.లు జగదీశ్వర్ రెడ్డి,(నల్గొండ),లింగ్యానాయక్,(దేవర కొండ),తహశీల్దార్ లు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు  ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి - అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు  ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి - అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో యాసంగి  వరి ధాన్యం కొనుగోళ్ళపై ఆయన సమీక్షించారు. యాసంగి లో వరి ధాన్యం సాగు అధికంగా జరిగినందున ఇంకా వరి ధాన్యం వస్తున్13 మండలాల వ్యవసాయ అధికారులు,పౌర సరఫరా శాఖ డి. టి.లు, ఏ.పి.యం.లు,పి. ఏ.సి.ఎస్.సి.ఈ. ఓ.లతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో స్టాక్,ఇంకా ఎంత ఉంది తదితర అంశాలు సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని లు కొరత వుంటే సరఫరా చేస్తామని,ఇతర జిల్లాల మిల్లులకు ట్యాగింగ్ చేసే అవకాశం వుందని,నాణ్యతా ప్రమాణాలు,తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జె.డి.శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ   రోహిత్ సింగ్ , నల్గొండ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ,దేవర కొండ ఆర్డీఓ లింగ్యా నాయక్,  జిల్లా  పౌర సరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ నాగేశ్వర్ రావు,  జిల్లా పౌర సరఫరాల అధికారిణి రుక్మిణీదేవి.  

మావోయిస్టు నక్సల్ ఐతడు లొంగుబాటు

మావోయిస్టు నక్సల్ ఐతడు లొంగుబాటు తెలంగాణ, ములుగు: మావోయిస్టు నక్సల్ పోలీసుల ఎదుట లొంగి పోయాడు.  వెట్టి ఐతు అలియాస్ ఐతడు అనే మావోయిస్టు నేడు ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగి పోయాడు.  మావోయిస్టు నేత బడే చొక్కా రావు కు ఐతడు గన్ మెన్‌ .