Skip to main content

వైశ్య జాతిని కించ పరిస్తే ఖబర్దార్ - కాచం - వైశ్య గర్జన విజయవంతం


 వైశ్య జాతిని కించ పరిస్తే ఖబర్దార్ - కాచం

వైశ్య గర్జన విజయవంతం





హైదరాబాద్: 

వైశ్య గర్జన విజయవంతం అయ్యింది. నిర్వాహకులు శ్రమ ఫలించిందని, కుట్రలు చేసిన వారికి దిమ్మ తిరిగే జవాబు వైశ్యులు ఇచ్చారని పాల్గొన్న పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ గర్జన లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైశ్యులు డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి , వారికి అండగా ఉంటా అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.ఆదివారం సరూర్ నగర్ స్టేడియం లో వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో వైశ్యుల ఆత్మగౌరవం -హక్కుల సాధనకై ఏర్పాటు చేసిన" వైశ్య గర్జన కార్యక్రమం కు ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి హాజరు అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కూడా ఎంతోమంది ఆర్యవైశ్యులు అండగా ఉన్నారని గుర్తుకు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వైశ్యులకు కొన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.నియోజక వర్గంలో ఇప్పటికే 11 కేటాయించామని , మరికొన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా కూడా ఎల్బీనగర్లో భవిష్యత్తులో సీట్లు కేటాయిస్తము అని అన్నారు. అనంతరం కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వైశ్య జాతి కోసం ఐక్యత గా పోరాడుదాం అని, ఉప్పల్ బాగాయత్ లో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమి పై కమిటీ వేసి అధికారిని నియమించాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ, వైశ్య జాతి కోసం కంకణ బడ్డులై పని చేస్తాం అని , ఏ పార్టీ కో ,సంగానికో వ్యతిరేఖం కాదు అని అన్నారు. రాజకీయం గా మనం ఎక్కడున్నారో ఆలోచించాలి అని ,గతంలో 15 మంది ఎమ్మెల్యే లు ఉన్నారు అని అన్నారు. కుల గనన చేయాల్సిన పని ఆర్య వైశ్య మహా సభ పై ఉంది అన్నారు. వారు చేయకుంటే వైశ్య వికాస వేదిక నిర్వహించడానికి సిద్దంగా ఉన్నదని అన్నారు. వైశ్య గర్జన సభ విఫలం చేయడానికి ఆర్య వైశ్య మహా సభ ఎంతో ప్రయత్నం చేసింది అని అన్నారు. పదవులు అనుభవించి , సన్మానాలు పొంది పదవి విరమణ తర్వాత దొంగ దీక్షలు చేస్తున్నారు అని అన్నారు. జాతిని కించ పరిస్తే ఖబర్దార్ అని హెచ్చ రించారు. పేద వైశ్యలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇండ్లు కేటాయించాలి అని అన్నారు. ఈ గర్జన లో చేసిన డిమాండ్ లు 1. వైశ్య కమిషన్ ను స్థాపించాలి. 2. జనాభా దామశా ప్రకారం రాజకీయాల్లో వాటా కల్పించాలి. 3.వైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి. 4. ఈ డబ్లు ఎస్ లో వర్గీకరణ తేవాలి. 5.విదేశీ విద్యా సహాయ నిధిని ఏర్పాటు చేసి వైశ్య విద్యార్థులకు తోడుపాటు అందించాలి. 6.వైశ్య బందును ప్రారంభించాలి. 7.సమగ్ర కుటుంబ సర్వే నివేదికలో అగ్ర వర్ణాల వివరాలు, జన సంఖ్య , గణాంకాలు ప్రకటించాలి.8.వైశ్య ఇండియన్ ఛాంబర్ ఆఫ్ అండ్ ఇండస్ట్రీ ఏర్పాటు కు ఆర్ధిక చట్ట పరమైన వెసులు బాటు కల్పించాలి.9. రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్లలో  వైశ్య పారిశ్రామిక వేత్తలకు 25 శాతం కేటాయించాలి.10. వైశ్య ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉమెన్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ మాట్లాడుతూ గత 10 సంవత్సరముల నుండి కార్పొరేషన్ కొరకు పోరాటం చేస్తున్నానని ప్రభుత్వం వెంటనే కార్పొరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైశ్య వికాస వేదిక ప్రధాన కార్యదర్శి నంగునూరు రమేష్. కోశాధికారి కండె రామ్ నరేష్. గౌరవ సలహాదారులు కోటగిరి దైవదీనం బుక్క ఈశ్వరయ్య. కోదుమూరి దయాకర్ రావు. కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా, గార్లపాటి జితేంద్ర కుమార్, కల్వ సుజాత పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్