Skip to main content

*అడ్డదారిలో పదవులు చేపట్టమని మహాసభ తెలియ చేసిందా ?


 ఆర్యవైశ్య మహాసభ నాయకులుగా చెలామణి అయ్యేవారికి ప్రశ్నలు సందిస్తు సోషల్ మీడియా లో పోస్టు



*ఆర్యవైశ్యులరా ఇకనైనా మేల్కోండి . తప్పు చేసిన వాడిని నిలదీసిన రోజే ఆర్యవైశ్య జాతి సభ్య సమాజంలో తలెత్తుకుంటుంది .


*ఆర్యవైశ్య మహాసభ నియమావళి ప్రకారం మూడు నెలలకు ఒకసారి జరగవలసిన కార్యవర్గ సమావేశాలు పెడుతున్నారా? ,


*బైలా తెలియనివాళ్లు పదవులు చేపడితే ఇలాగే ఉంటుంది


*అడ్డదారిలో పదవులు చేపట్టమని మహాసభ తెలియ చేసిందా ?


*జాతికి ద్రోహం చేస్తూ పదవులను అలంకరించడం మహాసభ నియమ నిబంధనలో ఉన్నదా ?


*ఆర్యవైశ్య మహాసభ ఎవరి సొత్తు , ఎవరి జాగీరు కాదు9 సంవత్సరాల నుండి రాష్ట్ర ఎన్నికల నిర్వహించకుండా ఎవరికివారు స్వార్థపూరితంగా వ్యవహరించడం మహాసభ నియమ నిబంధనలో ఉన్నదా ? 


*ఆర్యవైశ్య జాతికి ద్రోహం చేసే వారిపై చర్యలు ఉండవు , పాటుపడే వారిపై చర్యలు ఉంటాయా . మహాసభ నియమావళి అదేవిధంగా ఉన్నదా .




ఆర్యవైశ్య మహాసభ నియమావళి ప్రకారం మూడు నెలలకు ఒకసారి జరగవలసిన కార్యవర్గ సమావేశాన్ని సకాలంలో , సరైన సమయంలో నిర్వహించకుండా ఎవరు రాలేని సందర్భాన్ని పురస్కరించుకొని సమావేశాన్ని ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా సమావేశాన్ని నిర్వహించి ఇచ్చిన హామీలను విస్మరించడమే కాక మహాసభ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవడానికి సమావేశం తీర్మానం చేయడం జరిగిందని చెప్పుకోవడం ఆశాస్పదంగా ఉంది . బైలా తెలియనివాళ్లు పదవులు చేపడితే ఇలాగే ఉంటుంది . జిల్లాలలోనే కాక రాష్ట్రంలో కూడా బైల తెలియని వాళ్ళు నాయకులుగా కొనసాగడం మరింత విడ్డూరంగా ఉంది . జాతిని మోసం చేసి అడ్డదారిలో హామీలను విస్మరించమని మహాసభ తెలియజేసిందా ? ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక అడ్డదారిలో పదవిని చేపట్టి జాతిని అగౌరపరచడం మహాసభ ఆమోదిస్తుందా ? ఎవరికి వారు స్వార్ధ రాజకీయాలతో జాతిని అగౌరవపరచమని మహాసభ తెలియజేసిందా ? అడ్డదారిలో పదవులు చేపట్టమని మహాసభ తెలియ చేసిందా ? స్వార్ధపరులు ఎవరికి వారు ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తూ జాతికి ద్రోహం చేస్తూ పదవులను అలంకరించడం మహాసభ నియమ నిబంధనలో ఉన్నదా ? ఆర్యవైశ్య మహాసభ ఎవరి సొత్తు , ఎవరి జాగీరు కాదు. 118 సంవత్సరాల ఆర్యవైశ్య చరిత్ర ప్రస్తుత సమాజంలో ఉనికిని డ్స్కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే స్వార్ధపరుల ప్రమేయమే అందుకు కారణం కాదా ? 9 సంవత్సరాల నుండి రాష్ట్ర ఎన్నికల నిర్వహించకుండా ఎవరికివారు స్వార్థపూరితంగా వ్యవహరించడం మహాసభ నియమ నిబంధనలో ఉన్నదా ? జాతిని మోసం చేసి ఇచ్చిన హామీలను నెరవేర్చని వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ వాసవి మాతకే వదిలేసాము . 90 శాతం సామాన్య మధ్యతరగతి ఆర్యవైశ్యులతో నిండుకొని ఉన్నది . సామాన్య మధ్య తరగతి ఆర్యవైశ్యుల ఆకాంక్షను , వారి అభివృద్ధికి పాటు పడాల్సిన నాయకులు ""అమ్మ పెట్టదు - అడుక్కొనియదు "" అన్న చందంగా కొనసాగుతుంటే నిరాశా నిస్సృహాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్యవైశ్యులకు న్యాయం జరిగేది ఎప్పుడు ? ఆర్యవైశ్య జాతికి ద్రోహం చేసే వారిపై చర్యలు ఉండవు , పాటుపడే వారిపై చర్యలు ఉంటాయా . మహాసభ నియమావళి అదేవిధంగా ఉన్నదా . ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ఎదగాలి ఎదగాలి ఎదగాలి అంటూ స్టేజిలెక్కి గొంతు చించుకొని అరుస్తారు . ఆర్య వైశ్యులు ఎదగటం అంటే ఇదేనా ? స్వార్ధపరులు అన్ని రంగాల్లో ఎదిగితే ఆర్యవైశ్యులు ఎదిగినట్లేనా ? దయచేసి ఇకనైనా మారండి జాతిని అడ్డం పెట్టుకుని పదవులు పొందినందుకు కొంతైనా ఆర్యవైశ్యుల అభివృద్ధికి , జాతి గౌరవానికి కట్టుబడి ఉండండి . ఆర్యవైశ్యులరా ఇకనైనా మేల్కోండి . తప్పు చేసిన వాడిని నిలదీసిన రోజే ఆర్యవైశ్య జాతి సభ్య సమాజంలో తలెత్తుకుంటుంది . దిగజారిన విలువలను కాపాడుదాం . ఆర్యవైశ్య జాతి విలువలను ఎలుగెత్తి చాటుదాం . సభ్యులు మన్నించాలి ఎంతోమంది ఆర్యవైశ్యుల ఆక్రందనను వి నిపిస్తున్నాను .


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్