Skip to main content

Posts

Showing posts from 2024

Gainesville తెలుగు కుటుంబాల ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

 Gainesville తెలుగు కుటుంబాల ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు ఫ్లోరిడా లోని Gainesville తెలుగు కుటుంబాల ఆధ్వర్యంలో ఆటలు, పాటలతో కోలాహలంగా ఘనంగా ఉగాది ఉత్సవాలు నీబెర్రి లోని ఫ్రెడీ వాల్మార్క్ పార్కు లో నిర్వహించారు. ఈ ఉత్సవములో దాదాపు 150 మంది తెలుగువారు పాల్గొన్నారు. ఈ పండుగ ఉత్సవం లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నలు, పెద్దలు పాల్గొని శ్రోతలను ఉర్రూతలూగించారు. తొలుత మహిళలు, బాలికలు పంచాంగ శ్రవణం చేశారు. భారతీయ, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఉత్సవం సాగింది. కమ్మని  విందు ఏర్పాటు చేశారు. 
  @ ధాన్యం సేకరణను వేగవంతం చేసిన నల్గొండ జిల్లా యంత్రాంగం @ 5 లక్షల మె. ట ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటికే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  @ సుమారు 13 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ    @ కొనుగోలు కేంద్రాల సక్రమ నిర్వహణకు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ప్రత్యేక పర్యవేక్షణ  @ రెవెన్యూ అదనపు కలెక్టర్ తో పాటు, పౌరసరఫరాలు, మార్కెటింగ్ ,వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, తాసిల్దారుల తో ప్రతిరోజు సమీక్ష, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీలు.       రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరేలా యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో దాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతున్నది .రైతులు పండించిన దాన్యాన్ని కొనుగోలు చేసేందుకుగాను ఈ యాసంగిలో జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, 370 కి 370 కేంద్రాలను ప్రారంభించడం జరిగింది . ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 171 కోట్ల రూపాయల విలువ చేసే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. శనివారం న

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

  చలివేంద్రాన్ని ప్రారంభించిన  ఉప్పల శ్రీనివాస్ గుప్త హైదరాబాద్ లోని  ఉప్పల్ , రామంతపూర్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమములో ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్  వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు IVF జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ  చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త విచ్చేసి   రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో..* IVF  మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు పాండు గుప్త, IVF  మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ కొత్తపల్లి రమేష్, కోశాధికారి బోనగిరి శ్రవణ్ కుమార్, IVF స్టేట్ ఆధ్యాత్మిక చైర్మన్ బోనగిరి శ్రీనివాస్,  నగేష్, IVF మేడ్చల్ జిల్లా నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్ కుమార్*

  *తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటావా?*   *కొట్లాడి తెలంగాణ సాధించి అధికారమిస్తే...తెలివిలేనోళ్లంటావా?*   *తెలంగాణ సొమ్మును దోచుకుని తెలివిలేనోళ్లంటావా?*   *అమెరికాలో చిప్పలు కడిగిన నిన్ను మంత్రి చేస్తే ఇదేనా నువ్విచ్చే బహమతి?*   *తెలంగాణ ప్రజలారా... బీఆర్ఎస్ ను ఈడ్చి తన్నండి*   *తెలివిలేనోళ్లు మాత్రమే బీఆర్ఎస్ కు ఓటేయండి...*   *తెలివి ఉన్నోళ్లెవరూ బీఆర్ఎస్ కు ఓటేయకండి*   *బీఆర్ఎస్ కార్యకర్తలారా... మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే ‘క్విట్ బీఆర్ఎస్‘*   *కేటీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్ కుమార్*   తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రోళ్లు తెలివైన వాళ్లంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ భగ్గుమన్నారు. ‘‘కొట్లాడి రాష్ట్రం సాధించిన తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటావా? అమెరికాలో చిప్పలు కడిగిన నీకు అధికారం అప్పగిస్తే.. తెలివిలేనోళ్లంటావా. సకల జనుల సమ్మె చేసి ఉద్యోగాలనే ఫణంగా పెట్టిన తెలంగాణ ఉద్యోగులను తెలివిలేనోళ్లంటావా? తెలంగాణ కోసం పోరాడి బలిదానమైన 14 వందల మంది నీకు తెలివిలేనోళ్లా?’’ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలారా....

*రాజేష్ కుటుంబానికి అండగా* *ఉంటాం* *-మీడియా అకాడమీ చైర్మన్* *కె.శ్రీనివాస్ రెడ్డి*

 *రాజేష్ కుటుంబానికి అండగా* *ఉంటాం* *-మీడియా అకాడమీ చైర్మన్* *కె.శ్రీనివాస్ రెడ్డి*  ---------------------------------------- యువ ఫోటో జర్నలిస్ట్ నర్రా రాజేష్ ఆకస్మిక మరణం అత్యంత విషాదకరమని, అతని కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్  కె.శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రాజేష్ సంస్మరణ సభ, అసోసియేషన్ నుండి బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయా పత్రికల్లో ఫోటో జర్నలిస్టుగా సేవలందించిన రాజేష్, ఎంతో బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడని ఆయన కొనియాడారు. మీడియాకు ఫోటో జర్నలిస్టులు కళ్ళు, చెవుల లాంటి వారన్నారు. పత్రికల్లో వార్తలకు సాక్ష్యంగా నిలిచేది ఫోటోలేనని, ఆ ఫోటోల కోసం ఫోటో జర్నలిస్టులు పడే తిప్పలు వర్ణనాతీతమని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పాత్రికేయ వృత్తి అభద్రతా, అత్యంత ప్రమాదకరమైనట్లు ప్రజాస్వామిక దేశాలకు ఐక్యరాజ్య సమితి ఎప్పుడో సూచించిందని ఆయన గుర్తుచేసారు. ఫోటో, వీడియో జర్నలిస్ట

ఉద్యోగుల వయో పరిమితిపై వచ్చే వార్తల్లో వాస్తవం లేదు*

 *ఉద్యోగుల వయో పరిమితిపై వచ్చే వార్తల్లో వాస్తవం లేదు*        హైదరాబాద్, ఏప్రిల్ 12:: 'రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్లుగా లేదా 33 సంవత్సరాల సర్వీసు' అంటూ వివిధ వార్త పత్రికలూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏవిధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ లేదని స్పష్టం చేశాయి. ఈ విధమైన వూహ జనిత వార్తలు రాయడం, దీనిని సామాజిక మాధ్యల్లో ప్రసారం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే / ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఒక అధికార ప్రకటనలో తెలిపారు. ------------------------------------------------------------------------------------------------------------ స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.

*బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏరుకొండ హరి*

 *బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏరుకొండ హరి*   నల్లగొండ:   బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ పట్టణానికి చెందిన ఏరుకొండ హరి నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏరుకొండ హరి బిజెపిలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ ఓ బీసీల హక్కుల సాధన కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రాజిలేని పోరాటం చేస్తామని తెలిపారు. ఓబీసీలను సంఘటితం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి , ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.

బండి సంజయ్ చాయ్ పే చర్చా

 ఎన్నికల బిజీ ప్రచారం నడుమ బండి సంజయ్ చాయ్ పే చర్చా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రం చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలతో కలిసి చాయ్ తాగుతున్న బండి సంజయ్

పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎం - కోమటిరెడ్డి

  *పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎం* *కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవు* *రేవంత్ నాయకత్వంలో టీం వర్క్ గా పని చేస్తున్నాం* *కాంగ్రెస్ లో ఏకనాథ షిండేలు లేరు* *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* *హరీష్ రావు,మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్* *నల్లగొండ*: రాష్ట్రంలో ఈ ఐదేళ్లతో పాటు వచ్చే ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన రంజాన్ వేడుకలలో పాల్గొన్న అనంతరం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని హరీష్ రావు, బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంత టీం వర్క్ గా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు లేరని, గ్రూపులు లేవని అన్నారు. ఏక్ నాథ్ షిండే అన

జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి*

 *జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి* *నల్లగొండ*: అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినీమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి,మేధావి, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు మహిళలకు కూడా సమాజంలో గౌరవం తెచ్చే విధంగా స్ఫూర్తిని తీసుకువచ్చాడని అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే ఆశ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో తాను నల్లగొండలో ఎక్కడలేని విధంగా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు.ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జ్యోతిరావు పూలే సేవలను గుర్తించి ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించిందని అన్నారు.బడుగు,బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల

పార్లమెంట్ ఎన్నికలో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం - బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానం పూడి సైది రెడ్డి

  పార్లమెంట్ ఎన్నికలో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం - బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానం పూడి సైది రెడ్డి నల్గొండ:  వచ్చే పార్లమెంట్ ఎన్నికలో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని నల్లగొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానం పూడి సైది రెడ్డి అన్నారు. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి యువత ,మహిళలు ,వృద్దులు అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. పిల్లిరామరాజు రాకతో నల్లగొండ నియెజకవర్గ ములో పార్టీకి మంచి పట్టు వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పచ్చీస్ పతకాలను అమలుకానీ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారనీ దుయ్యబట్టారు. నల్లగొండ పార్లమెంట్ నియెజకవర్గ పరిధిలో యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని తెలిపారు. ఢిల్లీ లో మోడీ ,నల్లగొండ లో సైదిరెడ్డి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువత కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్ల

దివంగత సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం రంజాన్ సందర్భంగా పేదలకు కిరణం అందుచేత

దివంగత సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం రంజాన్ సందర్భంగా 25 పేద కుటుంబాలకు అయన కుమారుడు ప్రముఖ హైకోర్టు అడ్వకేటు సోమవరపు సత్యనారాయణ కిరణా సరకులు అందించాడు.  

స్వరూప వైవిధ్యం.. శుభవసంతం..! @ ఘనంగా ఉగాది పర్వదిన వేడుక

 స్వరూప వైవిధ్యం.. శుభవసంతం..! @ ఘనంగా ఉగాది పర్వదిన వేడుక @ పర్యావరణానికి ప్రతిరూపం ఉగాది @ అలరించిన కవి సమ్మేళనం @ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ @ పచ్చడి వితరణ పండుగలు ప్రకృతితో మమేకం చేస్తాయని.. మనుషులందరినీ కలిపి ఆహ్లాద వాతావరణం సృష్టిస్తాయని విశ్వహిందూ పరిషత్ పెద్దలు అన్నారు. ప్రధానంగా ఉగాది పర్వదినం సంస్కృతి సంప్రదాయానికి ప్రతిబింబమని.. స్వరూప వైవిధ్యం. స్వభావ ఏకత్వం అన్నారు. ఉగాది అంటేనే శుభ వసంతం అని వివరించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం..కవి సమ్మేళనం.. పచ్చడి వితరణ.. ప్రముఖులకు ఘన సన్మానం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి, మాసన చెన్నప్ప, రిటైర్డ్ తెలుగు లెక్చరర్లు, ప్రొఫెసర్లు, పండితులు హాజరై చక్కటి కవి సమ్మేళనం నిర్వహించారు. క్రోధి నామ సంవత్సరం సకల జగత్తుకు శుభం కలగాలని అభిప్రాయపడ్డారు. ధర్మం జయించాలని, అధర్మం అంతం అవ్వాలని అభిలాషించారు. అయోధ్య లో శ్రీ బాల రాముడి ప్రాణప్రతిష్ట చేసుకున్న శుభ సందర్భంగా అయోధ్య బలరా

పల్లె రవి కుమార్ కు తృటిలో తప్పిన ప్రమాదం

 *పల్లె రవి కుమార్ కు తృటిలో తప్పిన ప్రమాదం* తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ కు మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో కొత్తపేట వద్ద ప్రమాదం తృటిలో తప్పింది. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఖైరతాబాద్ లో ఆసుపత్రిలో ఒక మిత్రుడిని పరామర్శించి తిరిగి ఇంటికి వస్తుండగా తను ప్రయాణిస్తున్న కారు కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలోటైరు పగిలిపోవడంతో అదుపు తప్పి డివైడర్ కు, మెట్రో రైలు పిల్లరుకు గుద్దుకన్నది. కారు ఎయిర్ బేలూన్లు ఒపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. పల్లె.రవి కుమార్ తో పాటు ఆయన మిత్రుడు రాజు, డ్రైవరు ఖదీర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

కేంద్ర మంత్రి వర్యులు జి. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ లో చేరిన పిల్లి రామరాజు యాదవ్...

 ఈరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు & కేంద్ర మంత్రి వర్యులు జి. కిషన్ రెడ్డి  సమక్షంలో బీజేపీ లో చేరిన పిల్లి రామరాజు యాదవ్...  • కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో నేడు బీజేపీ లో చేరిన నల్లగొండ నియోజకవర్గం AIFB నేత పిల్లి రామరాజు యాదవ్ . • ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ గా హైదరాబాద్ కి బయల్దేరిన రామరాజు యాదవ్    *రామరాజు యాదవ్ కామెంట్స్ :-*  • భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ ... మోడీని మూడవసారి పీఎం చేసుకొని దేశాభివృద్ధిలో భాగస్వామి అవుతాను  • అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను కుటుంబ సభ్యుడిగా భావించి నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు  • నల్లగొండ నియోజకవర్గం ప్రజల కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పని చేస్తా   • అసెంబ్లీ ఎన్నికలలో ఎంతమంది ఇబ్బంది పెట్టిన ప్రజలు నాకు మద్దతుగా దాదాపు 30 వేల ఓట్లు వేశారు  • నల్గొండ పార్లమెంట్లో బిజెపి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత నల్గొండ మున్సిపాలిటీ పై దృష్టి పెడతా   • నల్గొండలో నా ఎదుగుదలను ఓర్వలేక చాలామంది నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు  • బ

అంగరంగ వైభవంగా సుంకరి ఫౌండేషన్ ఉగాది ఉత్సవాలు

 అంగరంగ వైభవంగా సుంకరి ఫౌండేషన్ ఉగాది ఉత్సవాలు  నల్గొండ లో అంగరంగ వైభవంగా జరిగిన సుంకరి ఫౌండేషన్ ఉగాది ఉత్సవాల సన్మాన సభ. ఈ ఉగాది ఉత్సవాల సన్మాన సభ లో ప్రతిభామూర్తులకు శ్రీ సుంకరి ఫౌండేషన్ నల్లగొండ వారిచే ఉగాది పురస్కారాలు బహుకరణ చేశారు. కూరెళ్ళ విఠలాచార్య, కొండవీటి రాధాకృష్ణ, దుచ్చెర్ల సత్యనారాయణ, కొల్లా భాస్కర రావు, J.S.శెట్టి, చిన్న వెంకట్ రెడ్డి, పుల్లెముల వెంకట్ నారాయణ గౌడ్, వేణు సంకోజ్, ఏనుగుల లక్ష్మారెడ్డి, కృష్ణ కౌండిన్య, కోమటిరెడ్డి బుచ్చి రెడ్డి, సముద్రాల మల్లికార్జున్, సుదర్శన్ రెడ్డి , కంది సూర్యనారాయణ, K.మట్టపల్లి, గోన రెడ్డి, రఘువర్ రావు, అమరేందర్ రావు,డాక్టర్ కొండల రావు,డాక్టర్ పుల్లారావు, శ్రీమతి కొండవీటి అంజనీ భాయ్, శ్రీమతి పిచ్చమ్మ , శ్రీమతి మామిడి ప్రమీల, K.పర్వతాలు, మాదగోని బిక్షపతి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పబ్బు వీరస్వామి, జర్నలిస్టు సుధాకర్, పున్న అంజయ్య, బోర్ర సుధాకర్, అంబటి వెంకన్న, మునస వెంకన్న, ఎల్వీ కుమార్, కొండూరు సత్యనారాయణ గార్లకు పాల్గొని ఫౌండేషన్ వారు ఉగాది పురస్కారాలు, సన్మానం చేశారు. ఈ సన్మాన సభను విజయవంతం చేసినందుకు వారందరికీ పత్రికాముఖం

మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో రాణించాలి...యోగ గురూజీ సంధ్య

మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో రాణించాలి...యోగ గురూజీ సంధ్య  మహిళలు అన్ని రంగాలలో ధైర్యంగా రాణించాలని ఆర్యన్స్ యోగ అండ్ ఫిట్నెస్ సెంటర్ యోగ గురూజీ సంధ్య అన్నారు. ఆదివారం ఫన్ డే కార్యక్రమాన్ని స్థానిక పంచ తత్వ పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు నిర్వహించిన ఫన్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ అమ్మ ఆరోగ్యం అంటే ఇంట్లో ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుందని అందుకోసం ప్రతి ఒక్కరు యోగ అలవర్చుకొని ఆ కుటుంబాన్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని అన్నారు. ఈ సందర్భంగా యోగాలో శిక్షణ పొంది బాగా బరువు తగ్గిన వారికి చోక్కారపు మాధవి బహుమతులు అందజేశారు. అనంతరం మహిళలు చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా జారుడుబండ ,ఉయ్యాల ఊగడం, మరికొన్ని క్రీడలు ఆడి ఆనందంగా గడిపారు.  

బీజేపీ లో చేరానున్న పిల్లి రామరాజు యాదవ్!

  *ఈ నెల 9వ తారీకు నా బీజేపీ లో చేరానున్న పిల్లి రామరాజు యాదవ్..* బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు.. మరియు అధిష్టాన పెద్దలతో జరిపిన చర్చలు సఫలం.. కేంద్ర ప్రభుత్వం..మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలకు ఆకర్షతులై చేరిక కు రంగం సిద్ధం చేసుకున్న రామరాజు యాదవ్.. ఇటీవల తన రాజకీయ భవిష్యత్తు పై అనుచరులు.. కార్యకర్తలు.. అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్న రామరాజు  కాంగ్రెస్ లో చేరాలని భావించిన అనుచరులు బీజేపీ లో చేరాలని ఒత్తిడి.. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధిష్టానం తో మంతనలు  ఈ నెల 9న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సమక్షంలో చేరిక.. రాష్ట్ర స్థాయి లో సమూచిత స్థానం కల్పించనున్న బీజేపీ  రామరాజు చేరిక తో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు పార్లమెంట్ స్థాయి లో బలపడనున్న బీజేపీ

తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో.. బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ తో “మీట్ ది ప్రెస్”

 ఆదిత్య పార్క్ ఇన్ హోటల్, అమీర్పెట్ లో.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో.. బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ తో   “మీట్ ది ప్రెస్” కార్యక్రమం. ఈటెల రాజేందర్ కామెంట్స్:  రేవంత్ కేసీఆర్ లాగే మాట తప్పారు.. తానూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: ఈటెల రాజేందర్ తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం.  రాజకీయ వ్యవస్థలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలే.. గెలిపించేది ఓడించేది ప్రజలే తెలంగాణ యువనయ్య జాగిరి కాదు ప్రజలది ప్రజలనే నమ్ముకున్నా.. ధర్మాన్ని నమ్ముకున్నా.. శ్రమను నమ్ముకున్నా... బిజెపి మల్కాజ్ గిరి ఎంపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించిందని  స్వతంత్ర్యాన్ని తెచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో గెలవడం కోసం జిల్లాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుంది ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ “మీట్ ద ప్రెస్“ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ రావు అధ్యక్షతన  కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అ
చర్లపల్లి లో వాసవి భవన్ ప్రారంభోత్సవం చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు చిత్ర రవిచంద్రన్ నల్గొండ లోని చర్లపల్లి లో వాసవి భవన్ ప్రారంభోత్సవం చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు చిత్ర రవిచంద్రన్ చేశారు.    వాసవి క్లబ్ చర్లపల్లి ప్రమాణ స్వీకారం వాసవి క్లబ్ చెర్లపల్లి , అధ్యక్షులు Vn.ఇమ్మడి హరిప్రసాద్, కార్యదర్శి Vn.ఇమ్మడి విజయకుమార్, కోశాధికారి Vn.కొండూరు తేజ చే I.E.C. Vn. యామా దయాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా గవర్నర్104/A Vn.Daimond KCGF SHREYOBHILASHI రాచర్ల లక్ష్మీ కమలాకర్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేశారు. వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ Vn.KCGF గజవెల్లి సత్తయ్య, కార్యదర్శి బిక్కుమల్ల రవీందర్,కోశాధికారి గజవెల్లి యాదయ్య, మరియు క్లబ్ పూర్వ అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పై కార్యక్రమమునకు, జిల్లా ఐపిసి, ఐఇసి, ఆర్సి, జెడ్ సి, వివిధ క్లబ్ సభ్యుల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు, మరియు వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ క్లబ్ సభ్యులు, హాజరై కార్యక్రమం దిగ్విజయం చేసినారు.  

రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. *ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్సై, రైటర్ .

  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని *మాదాపూర్ పోలీస్ స్టేషన్లో* ఏసీబీ తనిఖీలు  రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. *ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్సై రంజిత్.. ఎస్సై రైటర్ విక్రమ్*.  ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.  మాదాపూర్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా నిఘాపెట్టిన ఏసీబి అధికారులు
  *అమరవీరుల త్యాగాలు మరువలేనివి..*  *-బిజెపి జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు*   జాతీయవాదం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల త్యాగాలు మరువలేని వారు చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాదు అని మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు అన్నారు.  నల్లగొండ ఉమ్మడి జిల్లాలో జాతీయవాదమే ఊపిరిగా బతికిన ఏబీవీపీ నాయకులు ఏచూరి శ్రీనివాస్, మన్యం చినమల్లారెడ్డి గారి చిత్రపటాలకు నల్లగొండ జిల్లా ఏబీవీపీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది..  ఇదేవిధంగా నరహంతక నక్సలైట్ల చేతుల్లో అమరులైన శ్రీ గుండుగోని మైసయ్య గౌడ్ గారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది...  రాష్ట్ర నాయకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓరుగంటి రాములు గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి రాములు గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది...  కోతి పాపి రెడ్డి గారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది...    ఈ సందర్భంగా *మురళీధర్ రావు మాట్లాడుతూ..*  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేకమంది జాతీయ వాదులు. పోరాటాలు

వల్లబ్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన

  వల్లబ్ నగర్  సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. అయిన వాటిని పట్టించుకోకుండా  మేడ్చల్ జిల్లా  వల్లబ్ నగర్  సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎన్నికల  కోడ్ ఉల్లంఘన జరుగుతున్నది. ఎన్నికల నియమావలికి  విరుద్ధంగా, సీఎం ఫోటో  కార్యాలయం లో డిస్ప్లే చేయడం, మరి ఆ సబ్ రిజిస్టర్  ఫోటో కూడా  అందులో ఉండడం  ఎన్నికల కోడ్ ఉల్లంఘన  క్రిందకు వస్తుందని పలువురు జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని  వీడియో కవరేజ్ లో  చూడొచ్చు. ఇందులో ఎన్నికల కమిషనర్ యొక్క నిర్లక్ష్యం కూడా కనిపిస్తున్నట్టుగా, ప్రభుత్వ కార్యాలయ పై దృష్టి పెట్టకపోవడం, కార్యాలయం యొక్క అధికారులు కూడా ఎన్నికల నియమాల్ని  పాటించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా ఎలక్షన్ కమీషన్ స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

MCMC ద్వారా నిర్దేశించిన సమయంలో రాజకీయ ప్రకటనలకు అనుమతులను ఇవ్వాలి -:జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన

  MCMC ద్వారా నిర్దేశించిన సమయంలో రాజకీయ ప్రకటనలకు అనుమతులను ఇవ్వాలి -:జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన లోక సభ ఎన్నికల సందర్బంగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎం సి ఎంసి) ద్వారా నిర్దేశించిన సమయంలో రాజకీయ ప్రకటనలకు అనుమతులను ఇవ్వాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు.అంతేకాక ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని ఆదేశించారు.        లోక సభ ఎన్నికల సందర్బంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎం సి ఎంసి మరియు మీడియా కేంద్రాన్ని   గురువారం ఆమె ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.         ఎం సి ఎం సి ద్వారా నిర్వహించే పెయిడ్ న్యూస్,రాజకీయ ప్రకటనల ముందస్తు అనుమతి,సోషల్ మీడియా,తదితర అంశాలను సమీక్షించడమే కాకుండా ఇందుకు సంబంధించిన అన్ని ఫైళ్లు,రిజిస్టర్లను తనిఖీ చేశారు.             ఎప్పటికపుడు చురుకుగా ఉంటూ ప్రింట్ ,ఎలెక్ట్రానిక్ మీడియా లో వచ్చే పెయిడ్ న్యూస్,ప్రకటనలుపరిశీలించాలని,అనుమతులు సకాలంలో ఇవ్వాలని సమాచార శాఖ ఏ డి (డిపిఆర్ ఓ) వెంకటేశ్వర్లు ను ఆదేశించారు.            ఈ సందర్బంగా ఏ డి యు.వెంకటేశ్వర్లు ఎమ్ సి ఎం సి కార్యక

మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బిజెవైయం నల్గొండ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి

 మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బిజెవైయం నల్గొండ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి బిజెపి ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిజెవైయం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యేలు 8 మంది వెంకట్ రెడ్డి గారితో మరియు కాంగ్రెస్ అధిష్టానంతో అందుబాటులో ఉన్నారని చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో డబ్బు అహంకారం చూపిస్తే నల్లగొండ అసెంబ్లీ ప్రజలు గతంలో ఓడించారు. మళ్లీ దొంగ హామీలను ఇచ్చి ఇప్పుడు ఆరు దొంగ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మళ్లీ మభ్యపెట్టి అధికారాన్ని తెచ్చుకున్నారు. మరియు ఇప్పుడు అధికార అహంతో భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఆ వ్యాఖ్యలు సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతోని అందుబాటులో ఉండి రాజగోపాల్ రెడ్డి గారికి సహకరించింది వాస్తవమా కాదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారతీయ జ

ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగు తొలగించాలి - పాలడుగు నాగార్జున

 ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగు తొలగించాలి - పాలడుగు నాగార్జున   పార్లమెంట్ ఎన్నికల నిబంధనల ప్రకారంగా రాజకీయ నాయకులకు ముసుగులు వేస్తారు. ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నల్లగొండ పట్టణం లోని పెద్ద గడియారం సెంటర్లో గల జ్యోతిబాపూలే కు తెల్లటి గుడ్డలతో ముసుకు కప్పడం జరిగిందని, గతంలో జరిగిన ఏ ఎన్నికలలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగులు కప్పబడి లేదని, నేడు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి ముసుకు కప్పారని, తగు పరిశీలన జరిపి ఎన్నికల నిబంధనావలి కి లోబడి ముసుగు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున వినతి పత్రం సమర్పించారు.

టేట్ అర్హత ఫీజును తగ్గించాలి: బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి

 *టేట్ అర్హత ఫీజును తగ్గించాలి: బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి*  గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుంది నల్గొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు వంగూరు రాఖీ అన్నారు. గతంలో టెట్ అర్హత ఫీజు ఒక పేపర్ కు రూ.200 ఉండగా దాని రూ.1000కి ఫీజు పెంచారు,రెండు పేపర్లు వస్తే అభ్యర్థులకు గతంలో రూ.300 ఉండగా దాని ఏకంగా రూ.2000కి పెంచారు.ఈ సాయి పెంచడం నిరుద్యోగులకు అన్యాయం చేయటమే, ఈ యొక్క ఫీజులను తక్షణమే తగ్గించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది.

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవం

 బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవం  నల్గొండ బార్ అసోసియేషన్ 28-3-2024 జరగబోయే ఎన్నికల్లో , ట్రెజరర్ గా మంచుకొండ రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా లేడీ రిప్రజెంటేటివ్ గా నాంపల్లి భాగ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 

కార్పోరేషన్ ప్రకటించినందుకు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్

 ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పోరేషన్ ప్రకటించినందుకు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేసిన ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. *_ఎన్నో సంవత్సరాల చిరకాల వాంఛ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు.. చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ ఆర్యవైశ్యులలో కూడా పేద ఆర్యవైశ్యులు ఉంటారు అని గుర్తించి ఆర్యవైశ్య కార్పొరేషన్ కి కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా.. ఈరోజు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న "తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్" (TFJA)..

 రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న "తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్" (TFJA).. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ "డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్" పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో "విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ "కె.శ్రీనివాస్ రెడ్డి", తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు "దిల్ రాజు", పీపుల్ స్టార్ "ఆర్.నారాయణమూర్తి", TUWJ ప్రధాన కార్యదర్శి "విరహత్ అలీ" తదితరులు పాల్గొన్నారు.... తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యక్షుడు "వి.లక్ష్మీనారాయణ", ప్రధాన కార్యదర్శి "వై.జె.రాంబాబు", కోశాధికారి "నాయుడు సురేంద్ర కుమార్" వివరించారు...

జర్నలిస్టుల డిమాండ్స్ ను* *పరిష్కరించాలి* *-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి* *టీయూడబ్ల్యూజే వినతి పత్రం*

 *జర్నలిస్టుల డిమాండ్స్ ను* *పరిష్కరించాలి* *-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి* *టీయూడబ్ల్యూజే వినతి పత్రం*  దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ, షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చ్ 3న, "జర్నలిస్ట్స్ డిమాండ్ డే"కు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఆయా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సందర్బంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, ప్రెస్ కమిషన్ చివరి నివేదిక 1982లో వెలువడిందని, ఆతర్వాత దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రాకతో మీడియా దృష్టాంతంలో పెనుమార్పు వచ్చిందని, ఇందుకుగాను మీడియా సమస్యలను పరిష్కరించడానికి కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జర్నలిస్టులకు

ఆది పరాశక్తి

 *ఆది పరాశక్తి* *పదాలు రెండూ పరస్పర విరుద్ధంగా వున్నా, గుణాన్ని లెక్కగట్టే విషయంలో భావం ఒక్కటే. బాధితులు "రాక్షసి" అంటే, హర్షించినవారు "ఆదిపరాశక్తి" అంటారు.* *ఈ రెండింటి ప్రతిరూపం భానుప్రియ మీనా. 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి, ఢిల్లీ ఎన్ ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టరు మరియు ఢిల్లీ మద్యం కుంభకోణం కూపీలు లాగుతున్న అద్వితీయ మహిళ.* *మనం సాధారణంగా టివి ఒ.టి.టిలో క్రైం థ్రిల్లర్ సీరియల్ చూసినా, సినిమా చూసినా ఇలాంటి లేడీ ఆఫీసర్ చేసిన నటిని "ఎంతబాగా చేసిందో" అంటూ ఉంటాం.* *అదే దృశ్యం నటన కాకుండా నిజం అయితే?*💪 *హైదరాబాదులో కవిత అరెస్టు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కచ్చితంగా అపూర్వం. భానుప్రియ ఆ రెండు విధులునూ ఎంత తెగింపుతో చేసిందో, ఎంత చాకచక్యంగా హ్యాండిల్ చేసిందో, ఎంత పరిపక్వత, అనుభవం చూపించిందో చూసినవారు చప్పట్లు కొట్టిఉంటారు.* *కల్వకుంట్ల తారక రామారావుని "ఎక్కువ మాట్లాడితే నిన్నూ జైల్లో పడేస్తా" అనడానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి?* *తొమ్మిది సార్లు తప్పించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ను పదవసారి కారెక్కెంచుకుని తన ఆఫీసుకి లాక్కెళ్ళిన ధీశ

జర్నలిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

 జర్నలిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణలో అనేక పోరాటాలు చేసిందని జర్నలిస్టులు అనేవారు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నించాలన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి కలిసి రఘునందన్ రావుకు డైరీ అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కప్పర్ ప్రసాద్ రావు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి విలేకరి నుంచి రఘునందన్ రావు ఇంత ఎత్తుకు ఎదగడం సంతోషంగా ఉందని జర్నలిస్టుల సమస్యల కోసం అసెంబ్లీలో గళం విప్పిన రఘునందన్ రావు రేపు పార్లమెంట్లో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడేలా అవకాశం వస్తున్నందుకు సంతోషించారు

పర్యావరణ క్యాలెండర్ ఆవిష్కరించిన పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు

 పర్యావరణ క్యాలెండర్ ఆవిష్కరించిన  పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ ఇండియన్ ఎన్విరాన్ మెంట్ సోషల్ ఫోరం (ఐ ఈ ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నల్లగొండ పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక పర్యావరణ అంశాలతో కూడిన ప్రకృతి దినాలను పొందుపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పర్యావరణ కార్యకర్త జీడిమెట్ల రవీందర్ ,సహాయ పర్యావరణ ఇంజనీర్ ఎండి సజీనా బేగం, సహాయ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.పురుషోత్తం రెడ్డి, డాక్టర్ యం.రామకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది రహిమ, కె.నాగరాజు, విజిత, తదితరులు ఉన్నారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

  జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి  తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ( టి జే యు) 2024 డైరీ ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పౌర సంబంధాల శాఖ, రెవిన్యూ శాఖ మంత్రి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2024 డైరీ ని ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు పెద్దపీట  వేస్తుంది అన్నారు. జర్నలిస్టుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే తీరాయని ఇప్పటి ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులు అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనతంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలు వివరించగా ప్రభుత్వము లో చర్చిస్తా మన్నారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు  మాట్లాడుతూ 2012న ఏర్పాటు అయినా జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ ఏర్పాటు కోసం అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిందని 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులన్నారు. కెసిఆర్ కు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలకు యూనియన్ లకు తప్ప ప్రజా సమస

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్*

*ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్*    *హైదరాబాద్, మార్చి 16:*   జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్  జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్  రోనాల్డ్ రోస్ అన్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్లో  సి పి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.... పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నేటి (శనివారం) నుండి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ లోక్ సభ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిందని, తెలంగాణ లో ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడుతుందని, ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 26న స్క్రూటిని, 29న విత్ డ్రాయల్ ఉంటాయని, మే 13న పోలింగ్ జరుగుతుందని, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ కు ఆర్.ఓ గా హైదరాబాద్ జిల్లా కలెక్టర