యునెస్కో గుర్తింపులో మన గొంగడి ఉండడం గర్వకారణం : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
యునెస్కో గుర్తింపులో మన గొంగడి ఉండడం గర్వకారణం : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
యునెస్కో గుర్తింపులో మన రాష్ట్రానికి చెందిన మూడు వస్త్రాలు ఉండడం గర్వకారణమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి గొంగడితో సహాయ మంత్రికి సన్మానం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యునెస్కో గుర్తింపు పొందిన గొంగడి నేత కార్మికులకు శుభాకాంక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ద్వారా ఇతర రాష్ట్రాలకు వచ్చే మరమగ్గాలను మన రాష్ట్రానికి వచ్చేలాగా కృషి చేస్తానని గొంగడి నేత కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.మన రాష్ట్రం నుండి పురాతన వస్త్రంగా గొంగడి ఉన్నందుకు KRPS అధ్యక్షులు బింగి స్వామిని శాలువాతో సహాయ మంత్రి సన్మానించారు.
నల్లగొర్రెల ఊలుతో నేసే గొంగళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కురుమ ఇళ్లలో పురుడు పోసుకునే గొంగడి సామాజికవర్గం వారసత్వ సంప్రదాయంగా, కురుమల జీవితంలో అంతర్భాగంగా మారాయని. యునస్కో మన రాష్ట్రానికి చెందిన వస్త్రాన్ని గుర్తించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ఐఎఫ్డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సభ్యులు కపిలవాయి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment