కాంగ్రెస్ డిఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత..! - పగుడాకుల బాలస్వామి


 కాంగ్రెస్ డిఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత..! - పగుడాకుల బాలస్వామిరాజ్యాంగాన్ని చేతబట్టి (ప్రదర్శిస్తూ) ఎంపీగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రమాణం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే దాని విలువలను విస్మరించడం రాజ్యాంగం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. "జై సంవిధాన్- జైహింద్" అని చేసిన నినాదాలు హిందూ వ్యతిరేకతను ప్రతిధ్వనించాయి. కులమతాలకు అతీతంగా, సర్వ మానవ శ్రేయస్సు కోసం పనిచేస్తానని జూన్ 25న ప్రమాణం చేసిన రాహుల్ గాంధీ.. జూలై 1న హిందూ సమాజంపై విషం చిమ్మడం రాజ్యాంగ విలువలకే అవమానం. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల "కుటుంబ ప్రతినిధి"గా రాజకీయాల్లో రాణిస్తున్న రాహుల్ గాంధీ.. ఈ దేశ మెజార్టీ ప్రజలపై, వారి విశ్వాసాలపై మాటల తూటాలతో దాడులకు తెగబడడం అప్రజాస్వామికం. "హిందువులు హింసావాదులు.. విధ్వంస కారులు.. కుట్ర దారులు" అంటూ నిరాధార ఆరోపణలు చేయడం అలౌకికం.!


 భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న హిందుత్వంపై హింసవాదులుగా, విధ్వంసకారులుగా ముద్ర వేయడం మూర్ఖత్వం.

సాటిలేని దేశ సమగ్రతకు, పరంపరకు రాహుల్ వ్యాఖ్యలు మాయని మచ్చ. "మైనార్టీలు దేశానికి గర్వకారణం.. అన్ని రంగాల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశభక్తులు వారు"అంటూ రాహుల్ గాంధీ ఓటు బ్యాంకు మాటలు మాట్లాడటం మెజారిటీ ప్రజల మనోభావాలను గాయపరచడమే. దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా ఈ దేశ పీఠంపై కూర్చున్న కాంగ్రెస్.. నేడు ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రచారం పొందాలనుకోవడం సముచితం కాదు.


15 నిమిషాల్లో హిందువులను అంతం చేస్తానని ఓ పార్టీ నేత (అక్బరుద్దీన్ ఓవైసీ).. సనాతన ధర్మాన్ని పెకిలించి వేస్తానని వెకిలి మాటలు మాట్లాడిన మరో నేత (ఉదయనిది స్టాలిన్) వంటి నేతల సరసన రాహుల్ గాంధీ  కూడా చేరడం లోక్ సభలో ప్రతిపక్ష నేత స్థాయిని తగ్గించే విషయం.


ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని, లౌకికవాదం ముసుగులో హిందుత్వం పై దాడి చేస్తే నేటి నాగరిక సమాజం హర్షించదు. ఆకాశం పై ఉమ్మేస్తే తిరిగి వచ్చి మన ముఖం మీదే పడుతుంది అనే విషయం సు స్పష్టం.

రాజకీయ అవసరాల కోసం హిందూ ధర్మంపై దాడి చేస్తే, తిరిగి తగు రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం కూడా సిద్ధంగా ఉందనే విషయం తెలుసుకోవాలి. భారతీయత కోసం.. సనాతన ధర్మం కోసం.. జాతీయ వాదం కోసం ప్రాణాలను లెక్కచేయక పోరాడిన పరాక్రమ వీరుల చరిత్ర ఓసారి గుర్తెగాలి.

హిందూ సమాజాన్ని అంతం చేయాలని పంతం పట్టి, అదే

 ఎజెండాగా పాలన సాగించిన అనేకమంది రాజులు కాలగర్భంలో కలిసిపోయారు, కాని వారి కోరిక నెరవేరనేలేదనే చరిత్ర చదువుకోవాలి. భౌతికంగా దేవాలయాలు, శిల్ప సంపద కొల్లగొట్టారు తప్ప.. ఈ దేశ మూలాలను, హిందూ సంస్కృతి సంప్రదాయాలను తాకలేకపోయారనే విషయం జగమెరిగిన సత్యం. మన పుణ్యభూమి.. వేద భూమి.. కర్మభూమి అయిన భరతభూమి గొప్ప చరిత్ర కలిగి ఉందని, అలాంటి సందర్భంలో ఈ దేశ సమగ్రతకు పెనుముప్పుగా సంక్రమిస్తున్న ప్రమాదకర "హిందూ విద్వేషపు మాట"లను హిందూ సమాజం నిశితంగా గమనిస్తోంది. లోతుగా ఆలోచిస్తుంది కూడా. రాజకీయ నేతలు పెంచి పోషిస్తున్న మతమార్పిడి మాఫియా, హిందూ వ్యతిరేక విధానాలపై స్పందించేందుకు సిద్ధంగా ఉంది.


భారతీయ జీవన విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలకు వంత పడటం కాంగ్రెస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.  ముఖ్యంగా తన డిఎన్ఏ లోనే హిందూ వ్యతిరేక భావాన్ని నింపుకున్నట్టుంది ఆ పార్టీ. అందులో భాగంగానే అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను బహిరంగంగా బహిష్కరించి, హిందూ విరోధిగా ముద్ర వేసుకుంది. దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘ  పోరాటం అనంతరం "హిందూ లోకం" చేసుకుంటున్న పండుగను వ్యతిరేకించింది. "రాముడు లేడు.. రామాయణం లేదు, రామసేతు కల్పితం" అంటూ వాదించింది. హిందుత్వం బలపడుతుంటే ఓర్చుకోలేని కాంగ్రెస్.. అయోధ్య రాముడి అక్షింతలను అవహేళన చేసింది. రాముడి అక్షంతలు కంట్రోల్ బియ్యామని అక్షింతలను ఎగతాళి చేశారు.. అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు  కాంగ్రెస్ నేతలు. శ్రీరాముడిపై, హిందూ ధర్మంపై అక్కసు వెలగక్కిన విషయం దేశ ప్రజలందరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి హిందువుల (బీసీ) రిజర్వేషన్లు లాక్కొని ఓట్ల కోసం ముస్లింలకు అప్పజెప్పిన పార్టీ కాంగ్రెస్.


మొత్తంగా హిందువులంటే కాంగ్రెస్ పార్టీకి లెక్కలేనంత విద్వేషం. అందులో భాగంగానే హిందువులపై భారీ కుట్రలకు తెరలోపుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. హిందూ ఉగ్రవాదం అనే భయానక మాటలతో ధర్మంపై దాడికి దిగటం కూడా ఈ కోవలోకి చెందినదే. హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని, హిందూ ఆచార వ్యవహారాలను, అనాదిగా వస్తున్న పరంపరపై నిందలు మోపేందుకు  ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నుతున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజకీయ లబ్ధి కోసం హిందూ ధర్మాన్ని విమర్శించడం కొంతమంది నేతలకు ఈ రోజుల్లో ఫ్యాషన్ గా మారిపోయింది.


ఈ సృష్టిలో 1600 ఏళ్ల క్రితం ఇస్లాం లేదు.. 2000 ఏళ్ల క్రితం క్రైస్తవం లేదు.. 600 ఏళ్ల క్రితం కాశ్మీర్ లో ముస్లిం అనే వారు లేరు. అందుకు చక్కని ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాం నబి ఆజాద్ వ్యాఖ్యలే." భారతీయులంతా ఒకప్పటి హిందువులే"ననే  ఆజాద్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ లోతుగా ఆలోచిస్తే హిందుత్వం విలువలు బోధపడే అవకాశం ఉంది. హిందూ ధర్మం అతి ప్రాచీనమైనది.. అత్యంత ప్రముఖమైనది కూడా. భారతీయ విలువలు.. సనాతన ధర్మం.. లక్షల ఏళ్లుగా వస్తున్న పరంపర. హిందుత్వం ఎవరో తయారు చేసిన మతం కాదు.. భగవంతుడు సృష్టించిన జీవన విధానం. “అన్ని మతాలు..ఆచారాలను ఎలాంటి కల్మషం లేకుండా తన కడుపులో దాచుకునే ఉధారమైన ధర్మం హైందవం”.అలాంటి ధర్మంపై నిందలు వేయడం పాపం.


ప్రస్తుతం ప్రపంచంలో అతి వేగంగా విస్తరిస్తున్న ధర్మం హిందూ ధర్మమే. ప్రపంచ దేశాలను హిందూ జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలు ఆకర్షిస్తున్నాయి.


 చెట్టు, పుట్ట, మట్టి, పాము, కుక్క, ఎలుక నుంచి మొదలుకొని ఏనుగు వరకు ప్రతి ప్రాణిని పూజించే వ్యక్తులు హిందువులే. అహింస.. శాంతిని ప్రపంచానికి చాటి చెప్పి, సేవా మార్గాన్ని చూపించింది హిందువులే. నిప్పును అగ్ని దేవతగా.. నీరును గంగా దేవతగా.. నేలను భూమాతగా.. గాలిని వాయుదేవుడిగా ప్రకృతిని ఆరాధిస్తూ.. సకల జీవరాశులను ప్రేమించే ధర్మం హిందువుల సొంతం. 

హిందువులు సహనశీలురు.. శాంతి స్వరూపులు. ఈ దేశంలోని అన్ని మతాలను గౌరవిస్తున్నారు, కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది.

చీమకు కూడా హాని తలపెట్టని హిందువులను ఉగ్రవాదులుగా పోల్చడం దుర్మార్గం. ఎన్నికల వేళలో దేవాలయాలను సందర్శిస్తూ.  నకిలీ ప్రేమను వలకబోసి, హిందువుల ఓట్లను పొందే దుర్మార్గమైన చర్య చేపట్టడం కాంగ్రెస్ నేతల సిగ్గుమాలిన చర్య. హిందువులు ఉగ్రవాదులు అనే వ్యాఖ్యలపై రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందువు స్పందించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని హిందువులందరూ జాగృతం కావాలి. లేదంటే స్వార్థ రాజకీయాల కుట్రలలో హిందుత్వం నలిగిపోయే ప్రమాదం లేకపోలేదు.


 ప్రపంచానికే దిక్సూచి హిందుత్వమని, 131 ఏళ్ల క్రితమే ప్రపంచ మత మహాసభల్లో హిందూ మతం గొప్పతనాన్ని స్వామి వివేకానందుడు ప్రపంచానికి తెలియజేసిన ఘటనలు అపురూపం.. ఆచంద్రార్కం.! ఇంతటి గొప్ప వైవిధ్యం గల హిందూ ధర్మంపై విధ్వంసకర మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ, వెంటనే హిందువులందరికీ క్షమాపణ చెప్పి దేశ సమగ్రతను కాపాడాలి.
పగుడాకుల బాలస్వామి

ప్రచార ప్రసార ప్రముఖ్

విశ్వహిందూ పరిషత్

తెలంగాణ రాష్ట్రం

9912975753

9182674020

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్