సేవలకు... ప్రతిరూపం...వైశ్యులే...
సేవలకు... ప్రతిరూపం...వైశ్యులే...
విజయవాడ, గూఢచారి - 4-9-2024
బాధితులకు సేవలందించి మరొక్కసారి నిరూపించిన ఆర్యవైశ్య సంస్థలు...
దాతలను అర్థించిన ముఖ్యమంత్రి చంద్రబాబు....
బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చిన మహాసభ అధ్యక్షుడుచిన్నిరామసత్య
నారాయన....
స్ప0దించిన పలు ఆర్యవైశ్య సంస్థలు....
వేలాదిమంది బాధితులకు సేవలందించి విజ్ఞత చాటుకున్న ఆర్యవైశ్యులు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్నిరామసత్యనారాయన, పిలుపుమేరకు రాష్ట్రంలోని ఆర్యవైశ్య సంస్థలు బాధితులకు సేవలందించేందుకు రంగములోకి దిగాయి..
సంస్థల పాలకుల ఆధ్వర్యంలో తమకు తోచిన విధంగా బాధితులకు నిత్యావసర వస్తువులు, ఆహార పొట్లాల తోపాటు పలురూపాల్లో సేవలు అందిస్తూ,అండగా మేమున్నామని నిరూపిస్తున్నారు.
ప్రకృతి విసిరిని సవాల్ ను దైర్య0గా ఎదుర్కొంటు..అపన్నలకు సేవలందిస్తూ ఆర్యవైశ్య సంస్థలు తమఘనతనుచాటుకున్నాయి..
రాష్ట్రంలో వరదలు సంభవించిన జిల్లాల్లో ఆర్యవైశ్య సంస్థలు బాధితులకు సేవలందించుటలో నిమగ్నమయ్యాయి
మహాసభ అధ్యక్షుడు CHR, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి.రజిని,ప్రపంచఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కునా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బొగ్గవరపు వెంకట రాజారావు,(మాకు అందిన సమాచారం మేరకు)తదితర వైశ్య సంస్థల పాలకుల ఆదేశాలతో పెద్దఎత్తున బాధితులకుసహాయ,సహకారాలను అందించుటలో ఆర్యవైశ్యులు విశేషంగా కృషి చేస్తున్నారు
మహాసభ సదరు సంస్థల పాలకులను అభినందిస్తోంది...
Comments
Post a Comment