శ్రీయాన్ష్ ల్యాబ్స్ 2లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ - వెంటనే స్పందించి స్టాప్ ప్రోడక్షన్ ఆర్డర్ ఇచ్చిన పీసీబీ



 శ్రీయాన్ష్ ల్యాబ్స్ 2లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ - వెంటనే స్పందించి స్టాప్ ప్రోడక్షన్ ఆర్డర్ ఇచ్చిన పీసీబీ


మెదక్ జిల్లా


05.08.2025న ఉదయం 9:30 గంటలకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం, కుచారం గ్రామం, కుచారం నెం. 228/9, ఇండస్ట్రియల్ పార్క్, కుచారం, ప్లాట్ నెం. 83 వద్ద ఉన్న మెస్సర్స్ శ్రీయాన్ష్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ - 2లో క్లోరిన్ గ్యాస్ లీకేజి జరుగుతున్నదిని చుట్టుపక్కల పరిశ్రమల నుండి బోర్డుకు 05.08.2025న ఫిర్యాదు అందదంతో TGPCB యొక్క RO-RC పురం అధికారులు 05.08.2025న పరిశ్రమ మరియు పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. పరిశ్రమ డైరెక్టర్ 05.08.2025న ఉదయం 9:30 గంటల ప్రాంతంలో క్లోరిన్ సిలిండర్ నుండి క్లోరిన్ గ్యాస్ లీక్ అయిందని మరియు లీకేజీని దాదాపు 30 నిమిషాల్లో నియంత్రించామని అధికారులకు తెలియజేశారు. 


 లీకైన క్లోరిన్ సిలిండర్ చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్రమైన క్లోరిన్ (CI) వాసన కనిపించిందినీ, పరిశ్రమ నీరు మరియు మట్టిని ఉపయోగించి లీకేజీని నియంత్రించారని. ఇసుకలో క్లోరిన్ జాడలు ఉండి చుట్టుపక్కల వాతావరణంలోకి వ్యాపించైనట్లు అధికారుల తనిఖీ లో కనుగొన్నారు.

 పరిశ్రమ నిల్వ ప్రాంతంలో క్లోరిన్ డిటెక్టర్లను కలిగి ఉందనీ, 

క్లోరిన్ గ్యాస్ లీకేజీ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని మరియు పరిశ్రమ యొక్క DG సెట్ క్లోరిన్ సిలిండర్ నిల్వ ప్రాంతానికి ఆనుకొని ఉందని పరిశ్రమ ప్రతినిధి అధికారులకు తెలియజేశారు.

 అందువల్ల నియంత్రణ చర్యలు తీసుకోవడానికి వారు DG సెట్‌ను వెంటనే ప్రారంభించలేకపోయారు. భద్రతా దృక్కోణంలో DG సెట్ యొక్క స్థానం సముచితం కాదని ఇది సూచిస్తుందనీ అధికారులు అభిప్రాయ బడ్డారు.


 క్లోరిన్ గ్యాస్ లీకేజీలను నియంత్రించడానికి పరిశ్రమ ముందు జాగ్రత్త చర్యలు మరియు తగిన నియంత్రణ చర్యలు తీసుకోలేదు, తద్వారా చుట్టుపక్కల పరిశ్రమలలోని కార్మికులలో అసౌకర్యం మరియు భయాందోళనలు ఏర్పడ్డాయి.


క్లోరిన్ గ్యాస్ లీకేజీ సంఘటనల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, పీసీబీ 05.08.2025న మెస్సర్స్ శ్రీయాన్ష్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 2, ప్లాట్ నెం. 83, ఇండస్ట్రియల్ పార్క్ కుచారం, సైట్ నెం. 228/9, కుచారం గ్రామం, మనోహరాబాద్ మండలం, మెదక్ జిల్లాకు స్టాప్ ప్రోడక్షన్ ఆర్డర్ జారీ చేసింది

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం