*నాగారం భూములపై సుప్రీంకోర్టుకు వెళ్లిన బిర్ల మల్లేష్ చుక్కెదురు* హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు..
*నాగారం భూములపై సుప్రీంకోర్టుకు వెళ్లిన బిర్ల మల్లేష్ చుక్కెదురు* హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు..
పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేత.
నాగారం భూముల వివాదానికి సంబంధించి బిర్ల మల్లేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది.
నాగారం ప్రాంతంలోని భూములను భూధాన్ ల్యాండ్స్‌గా పేర్కొంటూ, ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేసిన భూములపై బిర్ల మల్లేష్ వివాదం సృష్టించారు. ఈ నేపథ్యంలో మల్లేష్ ముందుగా హైకోర్టును ఆశ్రయించగా, ఐఏఎస్–ఐపీఎస్ అధికారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మల్లేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌లో తగిన ఆధారాలు లేవని భావించిన సుప్రీంకోర్టు, విచారణకు కూడా అర్హత లేదని పేర్కొంటూ పిటిషన్‌ను పిటిషన్ స్థాయిలోనే కొట్టివేసింది.
దీంతో నాగారం భూముల వివాదంలో హైకోర్టు తీర్పే తుది నిర్ణయంగా నిలిచినట్లైంది. సుప్రీంకోర్టు కూడా అదే తీర్పును సమర్థించడంతో, బిర్ల మల్లేష్‌కు ఈ కేసులో ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

Comments
Post a Comment