టిజి పి సి బి ద్వారా 3.24 లక్షలకు పైగా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ
టిజి పి సి బి ద్వారా 3.24 లక్షలకు పైగా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ
*పర్యావరణ అనుకూలమైన మట్టి గణేష్ విగ్రహాలను ప్రోత్సహించే ప్రచార పోస్టర్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) ఆవిష్కరణ.
*మట్టి గణేష్ విగ్రహాలపై మంత్రి శ్రీమతి కొండా సురేఖ పోస్టర్లను ఆవిష్కరించారు.
హైదరాబాద్:
27-8-2025 నుండి ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ప్రజలు మట్టి గణపతులను మాత్రమే పూజించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నుండి మట్టి విగ్రహాలకు మారాలని ఆమె ప్రజలను గట్టిగా కోరారు. ”మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేసి ఇంట్లో మరియు మన నివాస ప్రాంతాలలో మట్టి గణేష్ విగ్రహాలకు పూజలు చేద్దాం. నీటి వనరులలో నుండి మట్టిని ఉపయోగిo చి మట్టి విగ్రహాలను తయారు చేసి పూజ చేసిన తర్వాత నీటి వనరులలోవాటిని తిరిగి నిమజ్జనం చేయలని” తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) మట్టి గణేష్ విగ్రహాలపై ప్రచార పోస్టర్లను శనివారం సచివాలయంలో విడుదల చేస్తూ మంత్రి సురేఖ అన్నారు.
పూజలలో ఉపయోగించే పూలు మరియు మూలికలను కంపోస్ట్ చేయాలని మరియు బయోడిగ్రేడబుల్ కాని పదార్థాలను నీటి వనరులలో వేయకూడదని ఆమె ప్రజలను కోరారు.
2025 గణేష్ చతుర్థికి సంబంధించి టిజిపిసిబి మట్టి గణేశ విగ్రహాల ప్రచారం కోసం పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల కోసం మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ కేంద్రాలు నిర్వహించడం, ఆటోలపై పోస్టర్లను ప్రదర్శించడం, దేవాలయాలలో ప్రదర్శనలు, జి హెచ్ ఎం సి ప్రాంతం మరియు జిల్లాల్లో 3.24 లక్షలు కు పైగా మట్టి విగ్రహాల పంపిణీ వంటి అనేక పర్యావరణ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది..
టిజిపిసిబి సభ్య కార్యదర్శి G. రవి, చీఫ్ ఇంజనీర్ B. రఘు మరియు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Post a Comment