పెట్రోల్ లూజ్ సేల్స్ నిబంధనలకు విరుద్ధం


 పెట్రోల్ లూజ్ సేల్స్ నిబంధనలకు విరుద్ధం


పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్  మాచన రఘునందన్ 



పెట్రోల్ బంక్ యజమాన్యాలు బల్క్ లూస్ సేల్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.శనివారం నాడు ఆయన నాంపల్లి లో బి పి సి ఎల్ పెట్రోల్ బంక్ ను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..కొన్ని పెట్రోల్ బంకు ల వాళ్లు డీజిల్, పెట్రోల్ ను ట్రాక్టర్ లో వచ్చిన డ్రమ్ముల్లో పోసి పంపిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని రఘునందన్ అన్నారు. ఇంధనాన్ని విడిగా పెద్ద మొత్తం లో విక్రయిస్తే..పెట్రోల్ బంక్ యజమానులు ఇంధనాన్ని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు అని జనం భావించే పరిస్థితి తలెత్తగలదని రఘునందన్ హెచ్చరించారు. పీపాల్లో ,డ్రమ్ము ల్లో పెట్రోల్ ,డీజిల్ ను పట్టుకు పోయిన వాళ్లు ఇంధనాన్ని అధిక ధరకు అమ్ముకునే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.పెట్రోల్ పేలుడు పదార్థాల కేటగిరి లోకి వస్తుంది కాబట్టే..అగ్నిమాపక పరికరాలు, సాధనాలు ఉన్న ప్రాంగణం లో నే పెట్రోల్ ను అమ్మడం జరుగుతుందని రఘునందన్ వివరించారు.పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో విక్రయించవద్దు అని చమురు సంస్థలే ప్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రాచారం చేస్తున్నాయని రఘునందన్ చెప్పారు. లూస్ పెట్రోల్ అమ్మితే ఇంధనం లో నాణ్యత లేకున్నా.. ఇంధన కల్తీ కి పెట్రోల్ బంక్ యజమానులే భాధ్యత వహించాల్సి వస్తుందని మాచన రఘునందన్ జాగ్రత్త చెప్పారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం