పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకుందాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
*పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకుందాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*
*హైదరాబాద్, ఆగస్టు 23:* పర్యావరణ హితంగా, ఘనంగా గణేష్ చతుర్థిని జరుపుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగర ప్రజలను కోరారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు, సిబ్బందికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... గణేష్ చతుర్థి పది రోజుల పాటు జరిగే ముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ పండుగను పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా జరుపుకోవడమే జీహెచ్ఎంసీ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శానిటేషన్, వీధి లైట్లు, చెట్ల కొమ్మల తొలగింపు, రోడ్డు మరమ్మత్తులు, నిమజ్జన ఏర్పాట్లలో క్రేన్లు, కంట్రోల్ రూములు, బేబీ పాండ్ లు, ఎక్సవేటరీ పాండ్ లు, తాత్కాలిక పాండ్ ల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శోభాయాత్రల సందర్భంగా శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి తీసుకుంటామని తెలిపారు. 25 వేల మంది కార్మికులు మూడు షిఫ్టులు గా విధులు నిర్వహించనున్నారని మేయర్ తెలిపారు.
పర్యావరణానికి హానికరమైన పి.ఓ.పి విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి ఆమె కోరారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 2 లక్షల మట్టి వినాయక విగ్రహాలను క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశామని అన్నారు. సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పని చేస్తున్నాయని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా C&D వెస్ట్ తో తయారు చేసిన మట్టి కుండీలు, మట్టితో చేసిన దీపాల ప్రమిదలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (శానిటేషన్ & హెల్త్) రఘు ప్రసాద్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment