మహా..ప్రభో మా మొర వినండి టెన్షన్ వద్దు..పెన్షన్ కావాలి *మాచన రఘునందన్*


 మహా..ప్రభో మా మొర వినండి


టెన్షన్ వద్దు..పెన్షన్ కావాలి



*మాచన రఘునందన్*


ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ 

దక్షిణ భారత ఇంచార్జ్


కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (న్యూ పెన్షన్ స్కీమ్) రద్దు కోసం.. రేపు హైదరాబాద్ లో కార్యక్రమం తల పెట్టినట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేశన్ యునైటెడ్ ఫ్రంట్ దక్షిణ భారత ఇన్ ఛార్జ్ మాచన రఘునందన్ తెలిపారు.న్యూ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో తేడా ల ను "మాచన" ఆదివారం నాడు నాడు వివరించారు.

తమ పింఛను వ్యధ, భాధ ను పంచుకున్నారు.

భాగస్యామ్య పింఛను పథకం, ఉద్యోగుల పాలిట ఓ టెన్షన్ స్కీమ్ అని,

ఉద్యోగులు సి పి ఎస్ ను ఎందుకు వద్దు అనుకుంటున్నారో..పాత పింఛను పథకం నే మళ్లీ ఎందుకు కొరుకుoటున్నారో..

"మాచన" మాటల్లోనే..


కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనబడే భాగస్వామ్య పింఛను పథకం ను,ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నది సెప్టెంబర్ 1 2004 నుంచి. 

ఆ రోజు నుంచి తమకు ఇక ప్రభుత్వ పెన్షన్ యోగం రాదు అనే వ్యధ ను మిగిల్చింది.ఉద్యోగం ఒక యోగం ,ప్రజా సేవా అవకాశం మహత్బాగ్యం అని భావించడం పరిపాటి. కానీ ఇప్పటి ఉద్యోగికి

నౌకరీ ఉన్నదన్న ధీమా నే గాని పాటు సైడ్ ఎఫెక్ట్ లా కాన్ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిణమించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు టెన్షన్ స్కీమ్ గా మారి ఆలోచనాగ్నిని రగిలించింది. ఉద్యమాన్ని రాజేస్తోంది.మాకు పింఛను రాదు అని, సర్వీసులో ఉన్నన్నాల్లూ జీతం, ఆ తర్వాత పెన్షన్ లేని జీవితం టెన్షన్ లేని జీవనం అయ్యింది. పాలకులు, ప్రభుత్వాలు, ఎలా ఆలోచించారో ఎమో కాని , ప్రశాంతంగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ శ్రేణుల్లో.."మనకు ఇక పెన్షన్ రాదు" అనే టెన్షన్ కు తెర తీసింది 2004 సెప్టెంబర్ 1నుంచి గవర్నమెంటు ఉద్యోగంలో చేరిన వారి పింఛను భరోసా కు భంగం కలిగింది. అసంతృప్తిని మిగిలించింది.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నపుడే ఈ పాలకులు సి పి ఎస్ కు ఎస్ అన్నపటినుంచి ఇప్పటి వరకూ ఎప్పు డెపుడు "నో" ..అంటారా అని ఉద్యోగులు ఆబగా ఎదురు చూస్తున్నారు. 

సీ పీ ఎస్ వద్దు ఓ పీ ఎస్ ముద్దు అని నినదిస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తాం అని ఆయా రాజకీయ పక్షాలు కూడా ఉద్యోగ వర్గాల పక్షాన ఉన్నట్టు ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొనే లా ఉద్యోగం ఉద్యమ రూపం దాల్చింది.అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు కూడా సీ పీ ఎస్ రద్దు కోసం ఆలోచించే లా వాతావ"రణం" పరిస్థితి నెలకొంది. సీ పీ ఎస్ ను ఎలాగైనా రద్దు చేస్తారేమో అన్న ఆశతో రాజకీయ పార్టీల ఎజెండాలో సీ పీ ఎస్ రద్దు ను ఓ ప్రధాన అంశంగా చేర్చేలా ఆయా పార్టీల కు విజ్ఞాపనలు చెయ్యడం జరిగింది. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఎన్ని ఉన్నా.. సీ పీ ఎస్ రద్దు ఎకైక ఎజెండా గా పోరాడేలా అందరినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలకుల కు కాస్తో..కూస్తో టెన్షన్ కల్గించి, అటెన్షన్ ఇవ్వక తప్పని పరిస్థితి దాపురించెలా చేసిందీ సీ పీ ఎస్ పథకమే.

సీ పీ ఎస్ లో ఉన్న ఉద్యోగి మరణిస్తే.. అతని ప్రాన్ ఖాతా లో జమ అయి ఉన్న అతి కొద్ది నామ మాత్రపు మొత్తం మాత్రమే కుటుంబానికి అందుతుంది.అన్న పాయింటును అర్థం చేయించడానికి ఎన్నో సమావేశాలు, సభలూ వర్క్ షాపులు జరిగాయి.

అయ్యా..మా మొర దయ చేసి ఆలకించరా.?! మేము సి పి ఎస్ వల్ల ఆర్థిక అన్యాయానికి గురవుతున్నాo.మా.. భాధ, వ్యధ ను అర్థం చేసుకోండి సార్ అంటూ వినమ్రంగా విన్నవించడం జరిగింది. సీ పీ ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల జీవితాల్లో ఆనందం నింపండి ప్రభో.. అంటూ వేడుకున్నాం. అన్నీ తెలిసిన అంతర్యామి కి తెలియని విషయం ఒకటి ఉంటుందా..సీ పీ ఎస్ కోసం ఉద్యోగం తో పాటు ఉద్యమం చేసి, చేసి ఇక అంతిమంగా సామాజిక మాధ్యమం ద్వారా విన్నపాలను..కేంద్ర, రాష్ట్ర పాలకులకు సోషల్ మీడియా సాయం తో..సాధ్యమైనన్ని ట్వీట్లు ఉద్యమ స్పూర్తి తో పెట్టడం ద్వారా మరో మారు పాలకులకు "సీ పీ ఎస్ రద్ధ్ కరో" అని నినాదం చేరేలా ప్రయత్నం చేస్తున్నాo. పాత పెన్షన్ పద్దతి పునరుద్దరణ అనేది ప్రతీ ఉద్యోగి హృదయ ఘోష.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం