ఉద్యోగం వస్తే..డీలర్ రాజీనామా చేయాల్సిందే - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ ;
ఉద్యోగం వస్తే..డీలర్ రాజీనామా చేయాల్సిందే
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ
మాచన రఘునందన్
రేషన్ డీలర్ కుటుంబాల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే..వాళ్ళు రేషన్ దుకాణం ను వదిలిపెట్టాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆయన చింత పల్లి లో మాట్లాడుతూ..రేషన్ డీలర్ల కుటుంబాల్లో..ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన దాఖలాలున్నాయని,అలాంటి ఉదంతాల్లో డీలర్లు స్వచ్చందంగా రాజీనామ చేయడం మంచిదని సూచించారు. చౌక దుకాణాలు కేవలం ఒక ఉపాధి మార్గం అని రఘునందన్ వివరించారు.రేషన్ డీలర్ల కుటుంబాల్లో ఏ వ్యక్తి ఐనా..ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక ఐనా..లేదా ఇప్పటికే ఉద్యోగం వస్తే.. రేషన్ డీలర్షిప్ కు స్వచ్చంద రాజీనామ చేయడం శ్రేష్టం అని రఘునందన్ అన్నారు. స్వచ్ఛంద రాజీనామా చేయక పోతే..సమగ్ర విచారణ జరిపి "మీ ఉద్యోగి కుటుంబానికి రేషన్ దుకాణం కూడా ఉంది" గమనించగలరు అంటూ లేఖ రాసి నిజం చెప్పాల్సిన అగత్యం ఏర్పడుతుందని "మాచన" హెచ్చరించారు.
Comments
Post a Comment