ఏసీబీ కి చిక్కిన ఇరిగేషన్ శాఖకు చెందిన మరొక అవినీతి అధికారి
ఏసీబీ కి చిక్కిన ఇరిగేషన్ శాఖకు చెందిన మరొక అవినీతి అధికారి
అలంపూర్ : ఇరిగేషన్ శాఖకు చెందిన మరొక అవినీతి మింగడం ఏసీబీ అధికారులు వేసిన వలలో చిక్కుకున్నాడు. రెండు రోజుల క్రితమే మహబూబ్ నగర్ ఇరిగేషన్ శాఖ ఏఈ ఒకరు ఏసీబీకి చిక్కగా గురువారం అలంపూర్ ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీకాంత్ నాయుడు ఆర్డీఎస్ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి రూ.11వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఎందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. మూడు లక్షల రూపాయల కాంట్రాక్టు పనులకు సంబంధించి ఎం బి చేయడానికి డీఈ రూ. 12 వేలు లంచం డిమాండ్ చేసి.. 11000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సార్ పనులలో నష్టం వచ్చింది ఆ డబ్బులు ఇవ్వలేము అని చెప్పినప్పటికీ తప్పనిసరిగా మాకు మూడు శాతం కమిషన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ మేరకు ఏసీబీ మహబూబ్ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో వారి బృందం డి కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా పటుకుని కేసు నమోదు చేశారు.
Comments
Post a Comment