*మట్టి వినాయకులను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*
*ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు*
*మట్టి వినాయకులను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*
నల్గొండ:
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
మంగళవారం నాడు మంత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...
నల్గొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సుమారు 4100 మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ వాతావరణ కాలుష్యం కాకుండా మట్టి వినాయకులను పూజించాలని తెలిపారు. దీనివల్ల వాతావరణ సమతుల్యంతో పాటు,వినాయకులను నిమజ్జనం చేసే చెరువులు కలుషితం కాకుండా ఉంటాయని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయక విగ్రహాలను వాడడం వల్ల అన్ని రకాలుగా హానికరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment