మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ మరణం పట్ల మంత్రి కోమటి రెడ్డి సంతాపం



*మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ మరణం పట్ల మంత్రి కోమటి రెడ్డి సంతాపం*


హైదరాబాద్:

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ (91) గారి మరణం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.


1972లో రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ పాటిల్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలుపొందారనీ,ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు,మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో రక్షణ (Defence), సైన్స్ & టెక్నాలజీ, మరియు హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారనీ గుర్తు చేశారు.

10వ లోక్‌సభ స్పీకర్‌గా మరియు పంజాబ్ గవర్నర్‌గా కూడా ఆయన సేవలందించారన్నారు.


సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ గారి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు,ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం