Posts

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థుల కు నృత్యం, స్కిట్ మరియు పెయింటింగ్ పోటీలు

Image
 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థుల కు నృత్యం, స్కిట్ మరియు పెయింటింగ్ పోటీలు హైద్రాబాద్, గూఢచారి: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల పోటీలను నిర్వహిస్తోంది.  ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవం (WED)గా ప్రకటించింది.  ఈ సంవత్సరం థీమ్ "ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం". ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం ఎదుర్కొంటున్న క్లిష్టమైన పర్యావరణ సవాళ్ల గురించి అవగాహన పెంచే అవకాశంగా ఉపయోగపడుతుంది.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) విద్యార్థులకు **నృత్యం, స్కిట్ మరియు పెయింటింగ్ పోటీలు** వంటి అవగాహన కార్యక్రమాల శ్రేణిని నిర్వహిస్తోంది.  ఈ పోటీలు రెండు విభాగాలుగా జరుగుతాయి: ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల: మే 21, 22 మరియు 23, 2025 తేదీలలో TGPCB ఆడిటోరియంలో ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతాయి.  పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను హైలైట్ చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనాలని ఆహ్వానించబడ్...

అకాల వర్షాలు వచ్చే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు తక్షణమే కొనుగోలు చేయాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
  నకరికల్ మండలం, గోరింకల పల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లను వేగవంతం చేసి వారంలో కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కొనుగోలు కేంద్రం నిర్వాహకులను , సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.      బుధవారం ఆమె గోరింకలపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.        కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని పరిశీలిస్తూ దాన్యం లో తేమశాతాన్ని ,అదేవిధంగా తాలు, చెత్తా,చెదారం, తదితర అన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించారు .      అకాల వర్షాలు వచ్చే సూచన ఉన్నందున  కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని చెప్పారు. ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఈ విషయంపై మరోసారి రైతులకు అవగాహన కల్పించాలని  అన్నారు.రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు సరైన తేమ శాతంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల తేవాలని, అదేవిధంగా దాన్యంలో తాలు ఉండవద్దని ,చెత్త ,చెదారం మట్టి పెల...

విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను నిలిపివేసిన హైకోర్టు:

Image
  విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను నిలిపివేసిన హైకోర్టు:  తెలంగాణ విద్యుత్ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తేదీ జూన్ 2, 2014 నుండి ఇచ్చిన పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పర్యవాసనంగా రావలసిన సీనియారిటీకి సంబంధించి పదోన్నతులను ఎనిమిది వారాల్లో సమీక్షించి నష్టపోయిన బిసి, ఓసి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడెపాక కుమార స్వామి, తెలంగాణ విద్యుత్ బిసి, ఓసి ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ముత్యం వెంకన్న గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం పిటిషన్ జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు బెంచ్ ముందుకు వచ్చింది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గోడ శివ వాదనలు వినిపిస్తూ, విద్యుత్ సంస్థల్లో వేలాది పదోన్నతులను షరతులతో ఆడ్ హక్ పద్ధతిలో హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను లెక్కచేయకుండా యాజమాన్యాలు పదోన్నతులు ఇస్తున్నారని. ఫలితంగా వందలాది బీసీ, ఓసి ఉద్యోగులకు పైస్థాయి ఉద్యోగాల్లో పదోన్నతులు రావడంలేదని, కాల ...

రూ.22,000 లంచం కేసులో షామీర్‌పేట పోలీస్ స్టేషన్ SI

Image
 హైదరాబాద్ , గూఢచారి: సోమవారం తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) షామిర్‌పేట పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) M. పరశురామ్‌ను అధికారిక సహాయం కోసం ఫిర్యాదుదారుడి నుండి రూ.22,000 లంచం తీసుకున్నందుకు అరెస్టు చేసింది. షామిర్‌పేట పోలీసులు నమోదు చేసిన మోసం కేసు నుండి ఫిర్యాదుదారుని మరియు అతని ఉద్యోగిని మినహాయించడానికి మరియు ఫిర్యాదుదారుడి సెల్ ఫోన్‌ను తిరిగి ఇవ్వడానికి పరశురామ్ లంచం డిమాండ్ చేసి అంగీకరించాడు. SI ఇప్పటికే ఫిర్యాదుదారుడి నుండి రూ.2 లక్షలు లంచంగా తీసుకున్నాడని ACB అధికారులు తెలిపారు. SI తన ప్రజా విధిని సక్రమంగా మరియు నిజాయితీగా నిర్వర్తించలేదని మరియు అతని నుండి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారని వారు తెలిపారు. అధికారులు SIని ACB కేసుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు, తరువాత కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. గతంలో, ACB అధికారులు పోలీస్ స్టేషన్‌లో దాడులు నిర్వహించి ఫైళ్లను పరిశీలించారు. పరశురామ్ దర్యాప్తు చేస్తున్న కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు మరియు అతన్ని అరెస్టు చేయడానికి ముందు పోలీస్ స్టేషన్‌లోని అతని సహచరుల నుండి వివరాలను సేకరించారు.

తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీ(సీఎస్)గా కే రామకృష్ణారావు (IAS) నియామకం

Image
 తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీ(సీఎస్)గా కే రామకృష్ణారావు (IAS) నియామకం *తెలంగాణ కొత్త సీఎస్​ కె.రామకృష్ణారావు* *రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావు నియామకం - సీఎస్‌గా కె.రామకృష్ణారావు నియమిస్తూ ఉత్తర్వులు - ఈనెల 30న పదవి విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి* *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ఐఏఎస్​ బ్యాచ్​కు చెందిన ఆయన, ప్రస్తుతం ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఈనెల 30న ప్రస్తుత సీఎస్​ శాంతికుమారి పదవి విరమణ చేయనున్నారు.* *రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు* గుడ్‌ గవర్నెన్స్‌ వైఎస్‌ ఛైర్మన్‌గా శశాంక్‌ గోయల్ ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ సీఈవోగా జయేశ్‌ రంజన్‌ పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌ ఫైనాన్స్ కమిషన్‌ మెంబర్ సెక్రటరీగా స్మితాసభర్వాల్‌ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిశోర్‌ పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్‌ఎండీఏ వెలుపల)- టీకే శ్రీదేవి పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి( హెచ్‌ఎండీఏ పరిధి)- ఇలంబర్తి జీహెచ్‌ఎంస...

ప్రభుత్వ అభివృద్ధి లో పాలుపంచుకునే కాంట్రాక్టర్లను రక్షించాలి - బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డివిఎన్ రెడ్డి

Image
 ప్రభుత్వ అభివృద్ధి లో పాలుపంచుకునే కాంట్రాక్టర్లను రక్షించాలి - బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డివిఎన్ రెడ్డి  నల్గొండ, గూఢచారి: ప్రభుత్వ అభివృద్ధి లో పాలుపంచుకునే కాంట్రాక్టర్లను రక్షించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డివిఎన్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎం ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ సెంటర్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం కాంట్రాక్టర్ల సమస్యలపై చర్చించాలని, వారి బిల్లులు చెల్లించడం జటిలంగా అయినాయని, జిల్లా మంత్రులైన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పౌరసరఫరాల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా అభివృద్ధిలో వివిధ పనులు చేసే కాంట్రాక్టర్లను రక్షించుకోవడంతోపాటు చిన్న కాంట్రాక్టర్లు రాష్ట్రం మొత్తంలో మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు ఆర్ అండ్ బి లో 100 కోట్లు ఇస్తే 22 వందల బిల్లులు క్లియర్ అవుతాయని రోడ్ల మరమ్మతులకు ఐదు వేల నుంచి 20 లక్షల వరకు ఉన్నాయని, వాటిని వెంటనే ఇప్పించాలని ముఖ్యమంత్రిని ఇతర మంత్రులను వేడుకుంటున్నామని అన్నారు. చిన...

మోటార్ వాహన ఇన్స్పెక్టర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

Image
 మోటార్ వాహన ఇన్స్పెక్టర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు  హైద్రాబాద్, గూఢచారి:  మొహ్మద్ ఘౌస్ పాషా, మోటార్ వాహన ఇన్స్పెక్టర్ FAC జిల్లా రవాణా అధికారి, మహబూబాబాద్ జిల్లా (సస్పెన్షన్ లో) పై ఆదాయానికి ముంచిన ఆస్తుల కేసు నమోదు చేయబడింది.  ఆయన సేవ సమయంలో అవినీతి ప్రవర్తనలు మరియు అనుమానాస్పద మార్గాలను అనుసరించి ఆస్తులు సంపాదించినందున, తెలిసిన ఆదాయ మూలాలకు సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయబడింది.  1988లోని అవినీతి నివారణ చట్టం (2018లో సవరించబడిన) కింద 13 (1) (బి) r/w 13(2) సెక్షన్ కింద ఇది ఒక నేరం కావడం వల్ల, 25.04.2025 న ఆయన ఇంటి మరియు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన నాలుగు వివిధ ప్రదేశాల్లో శోధనలు నిర్వహించబడ్డాయి.  శోధనల సమయంలో, ఇళ్లకు, ఓపెన్ ప్లాట్లకు మరియు వ్యవసాయ భూములకు సంబంధిత ఆస్తి పత్రాలు కనుగొనబడ్డాయి. అంటే, 2-ఇంటి పత్రాలు W/రూ.26,85,000/-, 25-ఓపెన్ ప్లాట్ పత్రాలు W/రూ.2,28,29,168/-, AO మరియు ఆయన కుటుంబ సభ్యుల పేర్లలో 10-36½ గుంటల వ్యవసాయ భూములకు సంబంధిత పత్రాలు W/రూ.55,98,736/- కనుగొనబడ్డాయి. మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే చాలా ఎక్కువగా ఉ...