హైదరాబాద్ నుమైష్ -2026లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్
హైదరాబాద్ నుమైష్ -2026లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్ హైదరాబాద్, గూఢచారి: ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమైష్ -2026)లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్ – కాలుష్య నియంత్రణ పై ప్రజల్లో అవగాహన. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ప్రదర్శన స్టాల్ను ఏర్పాటు చేసింది. ఈ స్టాల్లో మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు, పరిశ్రమల వల్ల కలిగే జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈ-వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణ, కాలుష్యం వలన పర్యవరణానికి కలిగే హాని పై సమాచారం అందించారు. వివిధ రకాల పోస్టర్లు ప్రదర్శనల ద్వారా కాలుష్యానికి కారణాలు, దుష్పరిణామాలు మరియు నియంత్రణ చర్యలపై సందర్శకులకు అవగాహన కల్పించారు. “పంటల మిగులు అవశేషాలను (స్టబ్బుల్) కాల్చడం భారతదేశంలో గాలి కాలుష్యాన్ని పెంచుతున్న ప్రధాన సమస్యగా మారింది. పంటల స్టబ్బుల్ను వెర్మీకంపోస్ట్గా మార్చాలి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగాన్ని ప్రోత్సహించాలి మరియు 15 సంవత్సరాలకు మించిన పాత వాహనాలను ఎలక్ట్రిక్...