**ఏపీ కేబినెట్ నిర్ణయాలు..ఇవే..**

ఏపీ కేబినెట్ నిర్ణయాలు..ఇవే..


ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతనలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 


* 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎన్నికలు.
* పంచాయతీ ఎన్నికల నిర్వాహణ కోసం రిజర్వేషన్ల ఖరారు. 
* కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్ బోర్డుకు 4 ఎకరాలు కేటాయింపు. 
* మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. 


* 412 కొత్త 108 వాహనాలు కొనుగోలు. మార్చి 31లోపు కొనుగోలు చేసేందుకు రూ. 71 కోట్ల 48 లక్షలను నిధులు కేటాయింపు. 


 * 104 వాహనాలు (656) కొనుగోలు. ఇందుకు రూ. 60 కోట్ల 51 లక్షలతో నిధుల కేటాయింపు. 
* వ్యవసాయ ఉత్పత్తి కొనుగోలుకు కొత్త విధానం. 
 
* రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలు గాను, 150 ఉప మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని నిర్ణయం. ఁ
* పసుపు, మిర్చీ, ఉల్లి, చిరుధాన్య పంటలకు ప్రతి సంవత్సరం మద్దతు ధర ముందే ప్రకటిస్తాం. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్