అకాల వర్షాలు వచ్చే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు తక్షణమే కొనుగోలు చేయాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నకరికల్ మండలం, గోరింకల పల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లను వేగవంతం చేసి వారంలో కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కొనుగోలు కేంద్రం నిర్వాహకులను , సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆమె గోరింకలపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని పరిశీలిస్తూ దాన్యం లో తేమశాతాన్ని ,అదేవిధంగా తాలు, చెత్తా,చెదారం, తదితర అన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించారు .
అకాల వర్షాలు వచ్చే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని చెప్పారు. ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఈ విషయంపై మరోసారి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు సరైన తేమ శాతంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల తేవాలని, అదేవిధంగా దాన్యంలో తాలు ఉండవద్దని ,చెత్త ,చెదారం మట్టి పెల్లలు వంటివి లేకుండా చూసుకోవాలని, అలాంటివి తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆకాల వర్షాలు వస్తే కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసిపోయెందుకు అవకాశం ఉందని, అలా కాకుండా నిర్వాహకులు ముందస్తుగానే అవసరమైనన్ని టార్పాలిన్లు సేకరించుకుని అందుబాటులో ఉంచుకోవాలని, ఎట్టి పరిస్థితులలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవో అశోక్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, తహసిల్దార్, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
Comments
Post a Comment