నరేంద్ర మోదీ కి అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి
దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సందర్భంగా కుల గణనను కూడా చేర్చాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ అనుభవాలను కేంద్ర ప్రభుత్వానికి అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. జనాభా లెక్కల్లో కుల గణన అంశం చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, కేంద్ర మంత్రివర్గానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. జనాభా లెక్కల్లో కుల గణన చేర్చాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో నిర్వహించిన కుల గణన దేశానికి రోల్ మోడల్‌గా ఉందని, ఈ విషయంలో తమ అనుభవాలను పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని స్పష్టం చేశారు. ఓబీసీల్లో రాష్ట్రాల వారిగా వేర్వేరు కేటగిరీలుగా ఉన్నందున, కుల గణన విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టబోయే ముందు రాజకీయ పార్టీలతో చర్చించడానికి మంత్రులతో ఒక కమిటీని నియమించాలని, అలాగే ఉన్నతస్థాయిలో అధికారులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా అధ్యయనం జరగాల్స...