భాజపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు


కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న భాజపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజ్‌భవన్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడియూరప్ప నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ వాజుభాయి వాలా యడియూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించారు.  అనంతరం ఆయనకు గవర్నర్‌ అభినందనలు తెలిపారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం ఎస్‌.ఎం. కృష్ణ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఇతర భాజపా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్