మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా
హైద్రాబాద్: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పది సంవత్సరాల నుండి చెప్పుకుంటూ అప్రజాస్వామికంగా అరాచకంగా ఆ స్థానంలో ఉంటూ ఇటీవల కోర్టు తీర్పును సైతం ధిక్కరించి ఇప్పటికీ నేనే అధ్యక్షుడుని అని చింతల్ బస్తీలోని కార్యాలయంలో జాతీయ జెండా ని ఎగురవేయడానికి సిద్ధమైన అమరవాది లక్ష్మీ నారాయణ.
ఆర్యవైశ్య మహాసభ ప్రక్షలన కమిటీ నిరసనలతో జెండా ఆవిష్కరించకుండా పక్కకు తప్పుకున్న అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు.
ఆర్యవైశ్య మహాసభ ప్రక్షలన కమిటీ ఆధ్వర్యంలో అమరావతి వెంటనే ఎన్నికలు పెట్టాలని కోర్టు తీర్పులు అమలు పరచాలని కోరుతూ నిరసన తెలపడంతో అమరవాది జాతీయ జండా ఆవిష్కరించకుండా తప్పుకున్నారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు. ఈరోజు ఉదయం ప్రక్షణల కమిటీ ఆధ్వర్యంలో అమరవాది దిగిపోవాలి, కోర్టు తీర్పును వెంటనే అమలు పరచి ఎన్నికలు పెట్టాలని అమరవాది అధ్యక్షుడు కాదని నిరసనలు తెలపడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తర్జనభర్జన అయిన తర్వాత రేణిగుంట్ల గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ తరఫున మిడిదొడ్డి శ్యాంసుందర్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత, మొగులపల్లి ఉపేందర్, పుల్లూరి సత్యనారాయణ, ప్రేమ్ గాంధీ, ఆకుతోట రమాకాంత్మ, పోతుగంటి ప్రవీణ్కుమార్ గుప్త మరియు
50 మంది పాల్గొన్నారు.
నేతి శ్రీనివాస్ అల్లాడి శ్రీనివాస్ ఉప్పుగండ్ల అశోక్ కోరుట్ల నుండి పాల్గొన్నారు మరియు కైలాస నవీన్ పాల్గొన్నారు
Comments
Post a Comment