బాలికపై అత్యాచారం

 బాలికపై అత్యాచారం


మల్లప్పురం (కేరళ) : సమాజంలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువవుతున్నాయి. చిన్నపిల్లలపై కూడా కొందరు మృగాళ్లు అత్యాచారాలు చేయడం గమనార్హం. కేరళలోని మల్లప్పురం జిల్లాలో పాఠాలు చెప్పే అధ్యాపకుడే ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భందాల్చింది. బాలిక అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ఈ ఘోరం బయటకు వచ్చింది. గత రెండు నెలల నుంచి అధ్యాపకుడు  బెదిరించి అత్యాచారం చేసినట్టు బాధితురాలు వెల్లడించింది. దారుణానికి పాల్పడిన అధ్యాపకుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్యపరీక్షలకు తరలించి నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్