Skip to main content

ఇద్దరు యువతీయువకులు తెలుగు భాష కోసం ఏం చేసారన్నదే ''ఒక తెలుగు ప్రేమకథ'' చిత్రం   ట్రైలర్ లాంచ్*

ఇద్దరు యువతీయువకులు తెలుగు భాష కోసం ఏం చేసారన్నదే ''ఒక తెలుగు ప్రేమకథ'' చిత్రం 


 ట్రైలర్ లాంచ్*


ఇప్పుడున్న యువతకు, పిల్లలకు తెలుగు సరిగ్గ రావడం లేదు. వారంతా ఆంగ్లం మీద మోజుతో తల్లి లాంటి తెలుగును మర్చిపోతున్నారు. ఇది ఇలా కొనసాగితే ఎదో రోజు  తెలుగు భాష అంతరించిపోవచ్చు. అలా జరక్కుండా ఉండాలంటే మనందరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. మన భాషను మనమే కాపాడుకోవాలనే ఇద్దరు యువతీయువకులు తెలుగు భాష కోసం ఏం చేసారన్నదే మా ''ఒక తెలుగు ప్రేమకథ'' చిత్రం ఇతివృత్తం. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కె.ఎస్.రవికుమార్ (జై ప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మహబూబ్ నగర్) నంది అవార్డ్ గ్రహీత ఆచార్య చక్రవర్తి సమేత గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


ఈ సందర్బంగా కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ...
ఈ సినిమా ప్రివ్యూ చూసాను. తెలుగు భాష గురించి ఈ చిత్రంలో చాలా గొప్పగా చూపించడం జరిగింది. మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగింది. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆధారిస్తారని అనుకుంటున్నాను అన్నారు.


ఆచార్య చక్రవర్తి సమేత గాంధీ మాట్లాడుతూ...


నేను గతంలో చాలా చిత్రాల్లో నటించాను. ఈ సినిమాలో మరో మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. నాకు ఈ రోల్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా చూసాను. విమర్శకుల ప్రసంశలు పొందుతుందని నమ్ముతున్నాను అన్నారు.


ఈ సందర్బంగా నిర్మాత కె.బసిరెడ్డి మాట్లాడుతూ...


తెలుగు భాష, సంస్కృతిని మరిచిపోతున్న ఈ తరుణంలో తెలుగు భాష అభ్యున్నతి కోసం హీరో, హీరోయిన్ ఏం చేశారనే ఆసక్తికరమైన పాయింట్ తో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ప్రాన్స్ వాడు ప్రాన్స్ ను లైక్ చేస్తున్నాడు. గుజరాతి వాడు గుజారాతిలోనే మాట్లాడున్నాడు. కానీ మన ఇండియాలో తెలుగు వారు మాత్రం ఇంగ్లీష్ ను ఎక్కువగా వాడుతున్నాడు. ఈ సంస్కృతి అంతరించారని ఈ సినిమాను చెయ్యడం జరిగింది అన్నారు.


దర్శకుడు బి.సంతోష్ కృష్ణ మాట్లాడుతూ... 
నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత బసిరెడ్డి గారికి , పి. ఎల్.కె.రెడ్డి గారికి ధన్యవాదాలు. తెలుగు భాష గొప్పదనం గురించి ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం ఈ సినిమా. నటీనటులు అందరూ బాగా చేశారు. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను అన్నారు.


పి.ఎల్.కె.రెడ్డి మాట్లాడుతూ...


ఒక తెలుగు ప్రేమ కథ సినిమాకు నేను భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉంది. నిర్మాత బసిరెడ్డి టేస్ట్ ఉన్న నిర్మాత, దర్శకుడు సంతోష్ కృష్ణ సినిమాను బాగా తీసాడు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్మకం ఉంది అన్నారు


హీరో మహేంద్ర మాట్లాడుతూ...


దర్శకుడు సంతోష్ ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకొని సినిమాను తీశారు. నిర్మాత బసిరెడ్డి గారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను నిర్మించారు. ఈ సినిమా కోసం ప్రతి టెక్నీషియన్ కష్టపడి వర్క్ చేశారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది అన్నారు.


హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ...


ముందుగా నాకు ఈ సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత బసిరెడ్డి గారికి ధన్యవాదాలు. మంచి సినిమాను ప్రేక్షకుకు ఎప్పుడూ ఆధారిస్తూ వస్తున్నారు బీ సినిమాతో కథ కథనాలు బాగుంటాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.


తారాగణం:


మహేంద్ర, లావణ్య, సమ్మోట గాంధీ, భవాని శంకర్, సాకేత్ మాధవి, బేబీ కీర్తన, కృష్ణ మూర్తి 


నిర్మాణం: డిజిక్విస్ట్ ఇండియా లిమిటెడ్
నిర్మాత: కె.బసిరెడ్డి
దర్శకత్వం: బి.సంతోష్ కృష్ణ
కెమెరామెన్: దేవేందర్ రెడ్డి
సంగీతం: మహిత్ నారాయణ్
నిర్మాణ సారధి: పి.ఎల్.కె.రెడ్డి
ఎడిటర్: కృష్ణ పుత్ర (జై) రాఘవేందర్ రెడ్డి
నృత్యం: రాజ్ పైడి
శబ్దగ్రాహకులు: డి.వెంకట్రావు, సురేష్.ఎమ్
పి.ఆర్.ఓ: మధు వి.ఆర్


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్