పూణేలో భారీ వర్షం - 17 మంది మృతి


పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో భారీ వర్షాల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న 16 వేల మందిని అధికారులు రక్షించారు. ముంబై- బెంగళూరు జాతీయ రహదారిపై ఖేద్‌-శివపూర్‌ గ్రామంలోని ఓ దర్గాలో నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చిన వరదలకు కొట్టుకుపోయారు. అరణ్యేశ్వర్‌ ప్రాంతంలో గోడకూలిన ఘటనలో ఐదుగురు చనిపోయారు. మిగతా ప్రాంతాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. పుణేతో పాటు బారామతి తహ్‌శీల్‌లో ప్రజలను రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)ను పంపించారు.కాగా.. కుంభవృష్టి కారణంగా పుణె నగరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సహకార్‌నగర్, పర్వతి, సింహగడ్ రోడ్, దండేకర్ బ్రిడ్జి, పద్మావతి సా లాంటి పల్లపు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. పుణె నగర వీధుల్లో వరదనీరు భారీగా చేరింది.


 


Comments